తిరుమలలో భక్తుల వద్దకు కదిలివస్తున్న అన్నప్రసాదం.!

Publish Date:Aug 7, 2026

Advertisement

దేవుడి ప్రసాదాన్ని అందుకోవడానికి ఎక్కడైనా సరే భక్తులు వెళ్లాల్సి వస్తుంది. కానీ కలియుగ ప్రత్యక్ష దైవం  తిరుమల వేంకటేశ్వరుడి ప్రసాదం మాత్రం భక్తుల వద్దకే కదిలి వస్తున్నది. తిరుమలలో భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం ఈ వినూత్న విధానాన్ని సాంకేతిక హంగులతో అమలులోకి తీసుకువచ్చింది. వివరాలిలా ఉన్నాయి.. 

తిరుమలలో స్వామి వారి దర్శన భాగ్యం కోసం భక్తులు గంటల తరబడి కంపార్ట్ మెంట్లలోనూ, క్యూలైన్ లోనూ వేచి ఉంటారు. ఒక్కోసారి స్వామి వారి దర్శనానికి పట్టే సమయం 24 గంటలకు పడుతూ ఉంటుంది. ముఖ్యంగా వారాంతం, పండుగలు పర్వదినాలలో అయితే స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులతో తిరుమల గిరులు కిటకిటలాడిపోతాయి. భక్త జన సంద్రాన్ని తలపిస్తాయి.   ఎంతటి భక్తజన ప్రవాహం వచ్చినా వారి ఆకలి తీర్చడమే పరమావధిగా భావించి   టీటీడీ, భక్తులకు అన్నప్రసాదాలను ఎలాంటి జాగు లేకుండా సులభంగా అందించడానికి మరియు సులభతరంగా చేయడానికి కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది.  క్యూలైన్లలో కిక్కిరిసిపోయే భక్తుల రద్దీని తట్టుకుంటూనే, అందరికీ సమయానికి అన్నప్రసాదం అందించేందుకు కదిలే డైనింగ్ టేబుళ్ల ను అందుబాటులోకి తీసుకువచ్చింది. 

 టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఇంజినీరింగ్,  క్యాటరింగ్ విభాగాల అధికారులతో సమగ్రంగా చర్చించి ఈ వినూత్న ప్రాజెక్టుకు రూపునిచ్చారు. క్యూలైన్లలో శ్రీవారి సేవకులు నడుస్తూ ప్రసాదం పంపిణీ చేయడం ద్వారా రద్దీ సమయంలో తరచూ తోపులాటలు జరగడం, భక్తులకు సమయానికి ప్రసాదం అందకపోవడం వంటి ఇబ్బందులు తలెత్తుతుండేవి. వీటిని నివారించడానికి ఇంజినీరింగ్ విభాగం దాదాపు పది లక్షల  వ్యయంతో ఏడు మీటర్ల పొడవు కలిగిన ఒక మూవింగ్ టేబుల్‌ను  రూపొందించింది. ఈ టేబుల్ ఒక కన్వేయర్ బెల్టు తరహాలో చుట్టూ నిరంతరం కదులుతూ ఉంటుంది.

ఈ సాంకేతిక వ్యవస్థ పనిచేసే విధానం చాలా సరళంగా,  సమర్థవంతంగా ఉంటుంది. కదిలే ఈ బెల్టుపై శ్రీవారి సేవకులు వేడివేడి అన్నప్రసాదాల ప్లేట్లను వరుసగా ఉంచుతారు. క్యూలైన్లలో నడుచుకుంటూ వెళ్లే భక్తులు తమ ప్రయాణాన్ని ఆపకుండానే, పక్కనే కదులుతున్న టేబుల్ పైనుంచి సులభంగా తమకు కావాల్సిన ప్రసాదం ప్లేటును అందుకోవచ్చు. ప్లేటును భక్తులు తీసుకోగానే ఖాళీ అయిన ఆ ప్రదేశంలో సేవకులు వెంటనే మరొక  అన్నప్రసాదం ప్లేటును ఉంచుతారు. దీనివల్ల భక్తులు ఎక్కడా ఆగాల్సిన అవసరం లేకుండా, రద్దీ నిరంతరం కదులుతూనే అన్నప్రసాదం పొందేందుకు మార్గం సుగమమైంది.

ఈ ప్రయోగాత్మక మూవింగ్ టేబుల్‌ పనితీరుపై   తిరుమలలోని రింగ్ రోడ్డు వద్ద టీటీడీ అధికారులు   ట్రయల్ రన్ నిర్వహించారు.  అక్కడ నిర్వహించిన ట్రయల్ రన్ విజయవంతమైంది. భక్తులు,  శ్రీవారి సేవకుల నుంచి విశేష స్పందన లభించింది.    భవిష్యత్తులో తిరుమలలోని ప్రధాన క్యూలైన్ మార్గాలన్నింటిలోనూ ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి టీటీడీ ప్రణాళికలు వేస్తోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1, వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2 తో పాటు నారాయణగిరి షెడ్లు,  ఇతర కీలక క్యూలైన్ మార్గాల్లో మొత్తం సుమారు 10 కదిలే మూవింగ్ టేబుళ్లను ఏర్పాటు చేయనుంది.  

TTD moving dining conveyor, Tirumala prasadam conveyor belt, TTD Vaikuntam queue complex, Tirupati news today, Tirumala devotees facilities, TTD food conveyor belt

By
en-us Political News

  
ప్రత్యేకంగా బీఆర్‌టీఎస్ కారిడార్‌తో పాటు రహదారికి ఇరువైపులా సర్వీసు రోడ్లను అందుబాటులోకి తెచ్చారు. రవాణాతో పాటే విద్యుత్తు, తాగునీటి సరఫరా, గ్యాస్ నెట్‌వర్క్, డ్రైనేజీ, కమ్యూనికేషన్ కేబుళ్ల నిర్వహణ కోసం భూగర్భ మౌలిక వసతులు సమకూర్చారు.   పాదచారుల కోసం ఫుట్‌పాత్‌లు, సైకిల్ ట్రాక్‌లు,   గ్రీన్‌బెల్ట్ నిర్మాణంతో ఆధునిక  రవాణా వ్యవస్థకు ఈ రోడ్డు దర్పణం పడుతుంది.  
దక్షిణాసియా ప్రాంతంలో అల్‌ఖైదా, ఐసిస్ వంటి ఉగ్రవాద అనుబంధ సంస్థల   దాడుల సామర్థ్యం గణనీయంగా పెరుగుతోందని హెచ్చరించింది. ఈ ఉగ్ర సంస్థలు  రసాయన, జీవాయుధాలను సేకరించి.. వాటితో విధ్వంసం సృష్టించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాయనీ, కుట్రలు పన్నుతున్నాయనీ వెల్లడించింది.
భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పదవిపై బిసిసిఐ స్పష్టత ఇచ్చింది. జట్టు ట్రాన్సిషన్ ఫేజ్, ఆటగాళ్ల గాయాల దృష్ట్యా గంభీర్‌ను 2027 వరల్డ్ కప్ వరకు కోచ్‌గా కొనసాగించేందుకు బిసిసిఐ తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
షేక్ రషీద్ అహ్మద్ లష్కరే తోయిబా సీనియర్ కమాండర్ ఖలీద్ మసూద్ సంధు, ఆ ఉగ్ర సంస్థ కేంద్ర సలహా మండలి సభ్యుడు ఖారీ మహమ్మద్ యాకూబ్ షేక్‌లతో కలిసి వేదికను పంచుకున్నారు. ఆ సందర్భంగా ప్రసంగించిన ఆయన తాను లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు, మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హఫీజ్ సయీద్‌కు బానిసనని బాహాటంగా ప్రకటించారు.
జడేజా కెరీర్ ముగింపునకు చేరువవుతున్న వేళ టీమిండియా తదుపరి స్పిన్ లీడర్ ఎవరు కుల్దీప్ యాదవ్ విరాట్, రోహిత్, గిల్ కెప్టెన్సీలలో సాధించిన రికార్డులు, డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టిక సవాళ్లు మరియు మురళీ కార్తీక్ విశ్లేషణపై సమగ్ర కథనం.
2027 వన్డే వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మ ఆడతాడా లేదా అనే విషయంపై ఆస్ట్రేలియా మాజీ దిగ్గజం మ్యాథ్యూ హేడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హిట్‌మ్యాన్ ఏజ్, ఫిట్‌నెస్, రికార్డులతో కూడిన పూర్తి విశ్లేషణ ఇక్కడ చదవండి!
భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో ఉత్తరాంధ్రలో విమాన కనెక్టివిటీ మరింత విస్తరించే అవకాశం ఉంది. ఇ ఇదిలా ఉండగా, విమానాశ్రయా నికి ప్రయాణికుల రాకపోకలను సులభతరం చేసేందుకు ఆగస్టు 15 నుంచి ఎలక్ట్రిక్‌ బస్సుల సేవలను కూడా ప్రారంభిం చనున్నారు.  
ఇటీవలే   బిడ్డకు జన్మనిచ్చిన కరోలిన్ లెవిట్..  తన పిల్లలు కుటుంబ సభ్యులతోనూ ఎక్కువ సమయం గడిపేందుకు ప్రెస్ సెక్రటరీ పదవి నుంచి వైదొలగాలని స్వచ్ఛందంగా నిర్ణయించుకున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి.
వెలుగును చంద్రుడు పూర్తిగా అడ్డుకోవడంతో భూమిపైకి సూర్యకాంతి కనిపించకుండా పోయింది.  గ్రీన్‌లాండ్, ఐస్‌లాండ్, ఉత్తర రష్యా, స్పెయిన్, పోర్చుగల్ దేశాల్లో  ప్రాంతాల్లో ఈ సంపూర్ణ సూర్యగ్రహణం స్పష్టంగా దర్శనమిచ్చింది. ఈ ప్రాంతాల్లో ఏకంగా 2 నిమిషాల 18 సెకన్ల పాటు   అక్కడి ప్రజలు పట్టపగలే చిమ్మ చీకట్లు అలుముకున్న అద్భుతాన్ని ఆస్వాదించారు.  
మేడ్చల్ జిల్లా పరిధిలో జరిగిన సదరు కూల్చివేతలకు రెవెన్యూ యంత్రాంగం ఎలాంటి అనుమతులు,  ఉత్తర్వులు ఇవ్వలేదనీ,   తమ శాఖ సమ్మతి లేకుండానే జిల్లా వ్యాప్తంగా దాదాపు నలభై ప్రదేశాల్లో హైడ్రా బలగాలు కూల్చివేతలు సాగించాయని కలెక్టర్ హైకోర్టు ధర్మాసనం ముందు వెల్లడించారు. 
అమెరికా సైనిక సామర్థ్యాలను దగ్గరుండి పరిశీలించే అవకాశం దక్కిందన్న ఆయన తాము ఊహించిన దాని కంటే.. అమెరికా సైన్యం చాలా బలహీనంగా ఉందన్నారు.
గత విచారణల సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్‌కు పంపిన నోటీసులు ఆయనకు అందలేదని తేలడంపై న్యాయమూర్తి.. ఈసారి ఎలాంటి సాంకేతిక విఘాతాలు లేదా డెలివరీ సమస్యలు తలెత్తకుండా పక్కాగా నోటీసులు అందజేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.