టీటీడీ నిలువు దోపిడీ.. కొండెక్కిన గదుల అద్దె!

Publish Date:Jan 8, 2023

Advertisement

తిరుమల ఒక పవిత్ర పుణ్య క్షేత్రం. ఒక్క తెలుగు రాష్ట్రాల నుంచే కాదు.. ప్రతి రోజూ దేశం నలుమూల నుంచి ఇంకా మాట్లాడితే, ప్రపంచం నలుమూలల నుంచి  లక్షల్లో భక్తులు వచ్చి వెంకన్న దేవుని దర్శించుకుంటారు. కానుకలు సమర్పించు కుంటారు. భక్తులు పైసా పైసా కూడబెట్టి, ముడుపులు కట్టి భగవంతునికి సమర్పించుకునే రోజువారీ హుండీ ఆదాయమే లక్షల్లో కాదు, కోట్లలో ఉంటుంది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం( 2022 మర్చి 1 నుంచి 2023 ఫిబ్రవరి 28 వరకు) లో హుండీ ఆదాయం రూ.1000 కోట్లు ఉంటుందని టీటీడీ అంచనా వేసింది. కానీ, గత మార్చి మొదలు నవంబర్ వరకు ప్రతి నెల రూ. 100 కోట్లకు తగ్గకుండా ఆదాయం వచ్చింది.

మూడు నెలల ముందుగానే గత అక్టోబర్ నాటికే హుండి ఆదాయం వార్షిక అంచనా రూ. 1000 కోట్లను దాటేసింది. దీంతో టీటీడీ తన అంచనాలను సవరించింది. ఈ వార్షిక సంవత్సరంలో రూ. 1600 కోట్లకు పైగా హుండీ ఆదాయం వస్తుందని భావిస్తోంది.ఇక తల నీలాలు మొదలు  లడ్డూ ప్రసాదం, ప్రసాదం కవర్ల వరకు, దర్శనం టికెట్లు,ఆర్జిత సేవల టికెట్ల విక్రయం ద్వారా వచ్చే ఆదాయం ఇంకెన్ని వందల వేల కోట్ల రూపాయలు ఉంటుందో ఆ వెంకన్నదేవునికే తెలియాలి.

అయితే, ప్రతి రోజు, ప్రతి నెల, ప్రతి సంవత్సరం అవసరాలకు మించిన ఆదాయం వస్తున్నా, ఇందుకు అదనంగా కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు దేశం అంతటా స్వామి వారి పేరున ఉన్న స్థిరాస్తులు, భూములు, పంట పొలాలు నుంచి వచ్చే ఆదాయం, బ్యాంకు డిపాజిట్స్ పై వచ్చే ఆదాయం, ఇతరత్రా అనేక మార్గాల్లో వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నా, తిరుమల తిరుపతి దేవస్థానము ( టీటీడీ) దాహం తీరడం లేదు. 

అందుకే ఇప్పడు కొత్తగా, కొండపై ఉన్న వసతి గృహాలలో రూము రెంట్  ను ఏకంగా ఒకేసారి రెండు రెట్లు అంతకంటే ఎక్కువ పెంచారు. ఇంతవరకు  మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉన్న నందకం, పాంచజన్యం, కౌస్తుభం, వకుళ మాత వసతి గృహాల్లో రూ.500 నుంచి  రూ.600 వరకు ఉన్న గది అద్దెను ఒక్కసారిగా  రూ.1000కు పెంచేశారు. ఈ నెల 1 నుంచి నారాయణగిరి రెస్ట్‌ హౌస్‌లోని 1, 2, 3లో గదులను రూ.150 నుంచి జీఎస్టీతో కలిపి రూ.1700 చేశారు. నారాయణగిరి రెస్ట్  హౌస్‌ 4లో ఒక్కో గదిని రూ.750 నుంచి రూ.1700కు పెంచారు. కార్నర్‌ సూట్‌ను జీఎస్టీతో కలిపి రూ.2200కు పెంచారు. స్పెషల్‌ టైప్‌ కాటేజెస్‌లో రూ.750 ఉన్న గది అద్దెను జీఎస్టీతో కలిపి రూ.2800 చేశారు. భక్తులు గదుల అద్దెతో పాటు డిపాజిట్‌ను అంతే మొత్తంలో చెల్లించాల్సి ఉంది. దీంతో గదిని 1700కు పొందితే డిపాజిట్‌ నగదుతో కలిపి రూ.3400 చెల్లించాల్సి ఉంటుంది. 

నిజానికి, ఇంతలా ఆదాయం వస్తున్నా కొండపై భక్తులకు కల్పించే సదుపాయాలు ఏమైనా మెరుగు పరిచారా అంటే అదీ లేదు. నిజానికి, హిందూ ధర్మ ప్రచారం,రాష్ట్రంలో, దేశంలో జీర్ణ ఆలాయాల పునరుద్ధరణ, హిందూ ధార్మిక కార్యకలాపాలు నిర్వహించడం టీటీడీ ప్రధాన కర్తవ్యం. వైసీపీ  ప్రభుత్వం, ముఖ్యమంత్రి బాబాయ్ ఎస్వీ సుబ్బారెడ్డి  చైర్మన్  గానియమించిన పాలక మండలి, హిందూ ధర్మ ప్రచారం కంటే, అడ్డగోలుగా ఆదాయం పెంచుకునేందుకు, అన్యమత ప్రచారానికి ఎక్కవు ప్రాధాన్యత ఇస్తోందని, భక్తులు, హిందూ ధార్మిక సంస్థలు ఎన్నో మార్లు ఆరోపించాయి, అయినా, టీటీడీ పట్టించుకోలేదు. ప్రభుత్వం సంగతి అయితే చెప్పనే అక్కరలేదు. వెంకన్న దేవుని ఆదాయాన్నే కాదు ఏకంగా ఆస్తులను మింగేసే ప్రయత్నం చేస్తోందనే ఆరోపణలున్నాయి.

నిజానికి అవేవీ ఆరోపణలు కాదు, దేశంలో ఎక్కడెక్కడో ఉన్న ఆస్తులను కాపాడ లేక పోతున్నామనే సాకుతో చెన్నై తదిర నగరాలలో ఉన్న అస్తుల అమ్మకానికి టీటీడీ గుట్టుచప్పుడు కాకుండా తీర్మానం చేసింది, అయితే, ఇంతలోనే ఆ నిర్వాకం బయటకు పొక్కడంతో, హిందూ సమాజం అప్రమత్తమై ఆందోళను దిగడంతో, టీటీడీ వెనకడుగు వేసింది. నిజానికి, జగన్ రెడ్డి ముఖ్యమంత్రి,  అయిన తర్వాత ఒక్క తిరుమలలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా హిందూ దేవాలయాలపై ప్రత్యక్షంగా,పరోక్షంగా దాడులు జరుగుతూనే ఉన్నాయి.గడచిన ముడున్నసంవత్సరాలలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో వందల ఆలయాలను దుండగులు ద్వంసం చేశారు. అయినా ఇంతవరకు ఒక్కరి మీద అయినా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. మరో వంక ప్రభుత్వం అన్య మత ప్రచారకులు, పాస్టర్లకు నెల జీతాలు ఇచ్చి పోషిస్తోంది.  

ఆ విషయాన్ని అలా ఉంచి, మరో మారు తిరుమల వసతి గదుల రెంట్  విషయానికి వస్తే, దేశంలో అత్యధిక ఆదాయం వచ్చే ఆలయాలలో తిరుమల మొదటి స్థానంలో ఉంటుంది.కానీ, దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్క టీటీడీ  మాత్రమే, వసతి వ్యాపారం చేస్తోంది. దేశంలోని ఇతర పుణ్య క్షేత్రాలలో ఉచిత సత్రాలు లేదా నామ మాత్రపు రుసుముతో ఆ మేరకు సదుపాయాలు కల్పించే వ్యవస్థలున్నాయే కానీ, ఇలా దొరికిన కాడికి దొరికినంత దోచుకునే దోపిడీ వ్యవస్థ, ఇంకెక్కడా లేదు. అందుకే టీటీడీ పుణ్యాన తిరుమమలో వసతి అనేది అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారిపోయింది. కొండెక్కి కూర్చుంది. స్టార్ హోటళ్ల స్థాయిలో రూమ్ రెంట్లు పెంచేస్తున్నారు.

అందుకే సామాన్యులు తిరుమల వచ్చేందుకే భయపడే విధంగా టీటీడీ వ్యవహరిస్తోందని, సామాన్య భక్తులు వాపోతున్నారు. నిజానికి, ఒక్క గదుల విషయమే కాదు, టీటీడీ, జగన్ రెడ్డి ప్రభుత్వం సంయుక్తంగా తిరుమలను ఒక వ్యాపార కేంద్రంగా మార్చేందుకు కుట్రలకు పలపడుతోందని అంటే   కాదనలేని విధంగా వ్యవహారాలు జరుగుతున్నాయి. అదే మంటే .. ఇదేమని అడుగేవారు లేరు. అదే టీటీడీ ధైర్యం. కానీ, ఎవరు అడిగినా అడగక పోయినా, సమయం వచినప్పుడు అడగవలసిన వారే అడుగుతారు. వడ్డీతో  సహా వసూలు చేస్తారు .. ఓంనమో వేంకటేశాయ !

By
en-us Political News

  
రేపే మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌.. ప్రశాంతంగా సాగేనా.?
విజయసాయి ఈ వీడియో చేయడం వెనుక పొలిటకల్ స్ట్రాటజీ ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తారకరత్న కుమార్తెతో వీడియో చేయడం ద్వారా తెలుగుదేశం శ్రేణుల మద్దతు పొంది తన పొలిటికల్ రూట్ లో ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ర్నాబ్ తుపానుతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ సరఫరాను సత్వరమే పునరుద్ధరించడానికి తమిళనాడు సహాయాన్ని కోరింది. ఈ మేరకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తమిళనాడు ప్రభుత్వాన్ని  రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ పునరుద్ధరణ  వేగవంతం చేయడానికి  అదనపు విద్యుత్ శాఖ సిబ్బందిని, పరికరాలను కోరారు.
సాధారణంగా వైసీపీ ఎకో సిస్టమ్ ఎలా ఉంటుందంటే.. ఎవరైనా సరే  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని , ఆయన పాలనా విధానాలను పొగిడితే వెంటనే ఆ పొగిడిన వారిపై విమర్శలు గుప్పించేస్తుంది. ఇందుకు గతంలో చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయి.
పులివెందుల మునిసిపోల్ రణరంగంగా మారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పోలీసులూ అప్రమత్తమయ్యారు. ఎలాంటి హింసాత్మక ఘటనలకూ తావులేకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అవసరమైతే  ఇటు తెలుగుదేశం కూటమి, అటు వైసీపీకి చెందిన ముఖ్య నేతలను హౌస్ అరెస్టు చేసేందుకైనా వెనుకాడబోమని పోలీసులు విస్పష్ట హెచ్చరికలు జారీ చేశారు.
గతంలో రాష్ట్ర రాజకీయాలలో  కొండా సురేఖ కేటీఆర్ పై చేసిన వ్యక్తిగత విమర్శలు  దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పిన కొండా సురేఖ వాటిని ఉపసంహరించుకున్నారు.   గతంలో కేటీఆర్ పై తాను చేసిన అనుచిత వ్యాఖ్యలను  పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా  పేర్కొన్నారు. 
తెలంగాణ రాజకీయాలలో ఏ పార్టీతోనూ పొత్తు లేదు లేదంటూనే జనసేనతో పొత్తుకు తహతహలాడుతోంది. తెలంగాణలో స్వంతంగానే బరిలోకి దిగుతామని కుండబద్దలు కొట్టిన బీజేపీ ఇప్పుడు జనసేనతో అంతర్గత పొత్తు కుదుర్చుకుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 
నియోజకవర్గంలో రాబోయే మున్సిపల్ చైర్మన్ ఎన్నికలను తెలుగుదేశం కూటమి గెలుచుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. వైసీపీకి పులివెందుల ఇంకెంత మాత్రం కంచుకోట కాదని విస్పష్టంగా పేర్కొన్నారు.  దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న పులివెందులలో కూటమి నేతలు నేరుగా సవాళ్లు విసురుతుండటం పులివెందులలో మసకబారిన వైసీపీ ప్రతిష్ఠకు, పలుకుబడికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
అయితే, ప్రస్తుతం సిద్ధమవుతున్న చార్జ్‌షీట్‌ను మరింత పటిష్టంగా రూపొందించేందుకు ఉన్నతాధికారులు ఢిల్లీలోని ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాదులతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. సాంకేతిక సాక్ష్యాలు, బాధితుల వాంగ్మూలాల ఆధారంగా ఈ అదనపు చార్జిషీట్ ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
స్థానిక  సన్నాహాలపై తెలుగుదేశం కూటమికి చెందిన దాదాపు 45 వేల మంది ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు,  కార్యకర్తలతో  సీఎం చంద్రబాబు ఈ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై చంద్ర నిప్పులు చెరిగారు.
కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో 4-0తో ఎన్డీఏ క్లీన్ స్వీప్.!
జగన్‌ తాను మళ్లీ  అధికారంలోకి వస్తానంటూ జగన్ 2.o అంటూ చేసిన వ్యాఖ్యలకు పవన్ కల్యాణ్ మేం 10x చూపిస్తామంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.  తెలుగుదేశం కూటమి ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ జగన్ చేసిన హెచ్చరికలకు పవన్ కల్యాణ్  దీటుగా ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ పొలిటికల్ సర్కిల్స్ లోనూ, సోషల్ మీడియాలోనూ కూడా పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.  
పులివెందుల నియోజకవర్గ పరిధిలో కూటమి అభ్యర్థులు స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. దశాబ్దాల కాలంగా ఎలాంటి ప్రతిఘటన లేకుండా ఏకపక్షంగా జగన్ కు పట్టుఉన్న నియోజకవర్గం పులివెందుల. అటువంటి పులివెందులలో ఎంపీటీసి జడ్పీటీసి స్థానాలను టీడీపీ  ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.