దిగొచ్చిన టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి!.. హోటళ్ల మూత.. సేవల ధరల పెంపుపై వెనకడుగు!

Publish Date:Mar 4, 2022

Advertisement

‘తిరుమలలో ప్రైవేట్ హొటళ్లకు అనుమతి రద్దు..’, ‘శ్రీవారి ఆర్జిత సేవల టికెట్ ధరల పెంపు’ కొద్ది రోజుల క్రితం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులను బాగా ఇబ్బంది పెట్టిన టీటీడీ నిర్ణయాలివి. కొద్ది రోజుల క్రితం తిరుమలలో చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన టీటీడీ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారని మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. దాంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల నుంచి ఒక్కసారిగా ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. నిర్ణయించిందే తడవు అన్నట్లు కొండమీద ప్రైవేట్ హొటళ్లను మూసేయాలని అధికారులు హుకుం జారీ చేయడం భక్తుల్లో తీవ్ర ఆగ్రహావేశాలకు కారణమైంది. ఈ రెండు నిర్ణయాలపైనా భక్తుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు, ప్రతిఘటన ఎదురవడంతో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తోకముడవక తప్పలేదు. ఆ రెండు అంశాలపైన బోర్డు సమావేశంలో చర్చ జరిగింది కానీ.. అమలుకు నిర్ణయం తీసుకోలేదంటూ ఇప్పడు సన్నాయి నొక్కులు నొక్కడం విశేషం.

తిరుమల కొండపై దశాబ్దాలుగా తాము చేస్తున్న హొటల్ వ్యాపారాన్ని అకస్మాత్తుగా మూసేయాలంటే.. తమ జీవితాలు రోడ్డున పడతాయంటూ వ్యాపారులు గగ్గోలు పెట్టారు. హొటళ్లు మూసేయడంతో తిరుమలకు తరలి వచ్చే లక్షలాది మంది శ్రీవారి భక్తులు అన్నమో రామచంద్రా అంటూ ఆర్తనాదాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తుల్లో వృద్ధులు, బాలింతలు, పిల్లలు కూడా అధిక సంఖ్యలోనే ఉంటారు. దేవుని దర్శనానికి వచ్చే చక్కెర వ్యాధిగ్రస్తులకు సకాలంలో ఆహారం దొరక్కపోతే వారి పరిస్థితి ఇబ్బందికరంగా మారుతుంది. అలాగే పిల్లలకు పాలు దొరక్కపోతే ఆకలితో అలమటించిపోతారు. సాధారణ భక్తులు కూడా అల్పాహారం లేకపోతే తీవ్ర ఇబ్బందులు పడతారు. కొండపై హొటళ్లు లేకపోతే ఇలాంటి కష్టాలన్నీ భక్తులకు ఎదురవుతాయని పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం అయింది.

అలాగే.. శ్రీవారి ఆర్జిత సేవల ధరలు పెంచుతున్నట్లు.. అది కూడా రెండు నుంచి ఐదు రెట్ల వరకూ ధరలు పెంచాలని టీటీడీ పాలకమండలి నిర్ణయించినట్లు పెంచాలని నిర్ణయించిన ధరల పట్టికలతో పాటుగా మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ నిర్ణయాన్ని కూడా భారీ సంఖ్యలో భక్తులు వ్యతిరేకిస్తుండడం గమనార్హం. ఈ రెండు అంశాలపైనా చర్చ మాత్రమే జరిగిందని, తిరుమలలో శ్రీవారికి జరిగే ఏ ఆర్జిత సేవల ధరలను పెంచే ఉద్దేశం లేదని స్పష్టం చేయడం విశేషం. అలాగే.. తిరుమలలో ప్రైవేట్ హొటళ్ల మూసివేత నిర్ణయంపై ఆయన స్పందిస్తూ..  స్వామి దర్శనానికి ఎంత మంది భక్తులు వచ్చనా అన్నప్రసాదం విషయంలో ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటామని వివరణ ఇచ్చారు. శ్రీవారి భక్తులందరికీ ఉచితంగా అన్నప్రసాదం అందించాలని ఆలోచన మాత్రమే చేశామన్నారు. ఆ ఆలోచనను ఇప్పటికి ఇప్పుడు అమలు చేయలేమని చెప్పడం విశేషం.

తిరుమలలో ప్రైవేటు హొటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు యధావిధిగా కొనసాగుతాయని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పడం వెనుక భక్తుల ఆగ్రహానికి భయపడినట్లే ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తిరుమలలో ఎవ్వరికీ ఇబ్బంది లేని విధంగా హొటళ్ల తొలగింపుపై నిర్ణయం తీసుకుంటామంటూ కాస్త మేకపోతు గాంభీర్యాన్ని కూడా ఆయన ప్రదర్శించారు.

శ్రీవారి ఆర్జిత సేవలను ఏప్రిల్ 1 నుంచి పునరుద్ధరిస్తామని చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పుకొచ్చారు. కోవిడ్ కారణంగా రెండేళ్లుగా నిలిచిపోయిన సర్వదర్శనాన్ని వారం రోజుల క్రితమే  ప్రారంభించామన్నారు. దాంతో శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగిందని చెప్పారు. ఉత్తర భారతదేశం నుంచి వచ్చే స్వామివారి భక్తుల కోసం త్వరలో చపాతీలు, రొట్టెలను అన్న ప్రసాదంలో అందిస్తామని చెప్పారు. తిరుమలలో మరో రెండు చోట్ల అన్న ప్రసాదం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. తిరుమలలో శుక్రవారంనాడు అన్న ప్రసాద భవనం కమాండ్ కంట్రోల్ ను పరిశీలించిన సందర్భంగా సుబ్బారెడ్డి ప్రైవేట్ హొటళ్లు, రెస్టారెంట్లు యధావిధిగా నడుస్తాయని, ఆర్జిత సేవల ధరల్ని ఇప్పుడే పెంచబోమని వివరణ ఇచ్చుకున్నారు.

By
en-us Political News

  
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్‌ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్‌ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్,   విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  
Telangana government pays special attention to the renovation of barrages, Revanth Reddy, Kaleshwaram Project, Medigadda Barrage, Annaram Barrage, Sundilla Barrage, Kaleshwaram Barrage Repairs, Barrage Restoration, Dam Safety, NDSA, Irrigation Projects, Devadula Lift Irrigation, Sitarama Lift Irrigation
ఏపీపీఎస్సీ గ్రూప్-1 మూల్యాంకన కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) చేపట్టిన సోదాలు ముగిశాయి.
తెలంగాణ ప్రభుత్వం ప్రజారోగ్య పరిరక్షణ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల లబ్దిదారుల ఎంపిక విధానంలో అత్యంత కీలకమైన మార్పులకు తెరలేపుతున్నట్లు తెలుస్తోంది.
Mahabubnagar ACB Raid, Telangana ACB, ACB Trap, Bribery Case, Rs 1 Lakh Bribe, Government Officials Arrested, Mahabubnagar Corruption, Youth and Sports Department, Jakkula Rajasekhar Reddy, Gorre Umesh, Telangana Anti Corruption Bureau, ACB Helpline 1064, Telangana Crime News
చలికాలం రాగానే మనలో చాలామంది ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.