టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలివే...
Publish Date:Nov 14, 2023
Advertisement
టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన పాలకమండలి మంగళవారం(నవంబర్ 14) తిరుమలలో భేటీ అయింది. ఈ సమావేశంలో టీటీడీ బోర్డు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించాలని పాలక మండలి నిర్ణయం తీసుకుంది. 114 జీవో ప్రకారం అర్హులైన ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని పాలకమండలి నిర్ణయం తీసకుంది. టీటీడీ ఉద్యోగులకు బ్రహ్మోత్సవ బహుమానంపై ఈ సమావేశంలో చర్చించారు.
ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టీటీడీలోని అర్హులైన కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని నిర్ణయించారు. అలిపిరి గోశాల వద్ద ఈ నెల 23 నుంచి శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిర్వహించనున్నారు. టీటీడీ పర్మినెంటు ఉద్యోగులకు బ్రహ్మోత్సవ బహుమానంగా రూ.14 వేలు, కాంట్రాక్టు ఉద్యోగులకు బ్రహ్మోత్సవ బహుమానంగా రూ.6,850 ఇవ్వనున్నారు. పప్పు దినుసులు, చక్కెర, నెయ్యి నిల్వ చేసేందుకు అలిపిరి వద్ద మరో గోదాం నిర్మించాలని నిర్ణయించారు. కరీంనగర్ లో శ్రీవారి ఆలయ నిర్మాణానికి రూ.15.54 కోట్ల మంజూరు చేసేందుకు టీటీడీ పాలకమండలి ఆమోదం తెలిపింది. తిరుమల నడకదారుల్లో వన్యమృగాల నుంచి భక్తుల రక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ క్రమంలో భద్రతా పరికరాల కొనుగోలుకు రూ.3.5 కోట్ల మంజూరుకు ఈ సమావేశంలో ఆమోదం లభించింది.
http://www.teluguone.com/news/content/ttd-board-meeting-key-points-on-nov-14-39-165152.html





