Publish Date:Mar 17, 2025
తెలంగాణ ప్రజా ప్రతినిథుల సిఫారసులపై తిరుమలేశుని దర్శనాన్ని కల్పించేందుకు టీటీడీ ముందుకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ నెల 24 నుంచి తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిథుల లేఖలపై శ్రీవారి దర్శనాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం కల్పించనుంది.ఇందులో భాగంగా వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించి తెలంగాణ ప్రజా ప్రతినిథుల సిఫారసు లేఖలను ఆది, సోమవారాలలో మాత్రమే స్వీకరిస్తుంది.
ఆ లేఖలపై శ్రీవారి దర్శనాన్ని సోమ మంగళవారాలలో కల్పిస్తుంది. అలాగే రూ.300ల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లకు సంబంధించిన సిఫారసు లేఖలను బుధ, గురువారాలలో మాత్రమే టీటీడీ స్వీకరిస్తుంది. ఇక ఒక ప్రజా ప్రతినిధికి ఒక సిఫారసు లేఖ మాత్రమే ఇవ్వాలనీ, అదీ ఒక లేఖపై ఆరుగురికి మించకుండా ఉండాలని టీటీడీ పేర్కొంది. తిరుమలలో అందుబాటులో ఉన్న వసతి సౌకర్యాలు, భక్తుల దర్శన సమయాలను దృష్టిలో ఉంచుకుని సుదీర్ఘంగా చర్చించిన అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న అనంతరం టీటీడీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ttd-accept-telangana-people-reprasentatives-recomondation-letters-25-194531.html
హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది.
గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని చారిత్రాత్మక బాపూఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నివాళులు అర్పించింది.
కనీస ధర రూ.30కి పెంపునకు సిఫార్సు.!
వెబ్‌సిరీస్ ల్లో ఎక్కువగా బ్యాంకులు, బంగారు దుకాణాల్లో దోపిడీలకు సంబంధించిన వీడియోలే చూసేవాడు.. ఆ తర్వాత తనకున్న ఆర్మీ అనుభవాన్ని ఉపయోగించుకోని సికింద్రాబాద్ మద్రాస్ రెజిమెంట్‌ను ఎంచుకున్నాడు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) వ్యవహారశైలిని నిరసిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
హైదరాబాద్ నగరవాసుల ప్రయాణ కష్టాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది.
కొత్త కారు కొనుక్కోవాలని ఎన్నో రోజులుగా కలలు కంటారు.. ఆ కల నెరవేరిన రోజు ఆ ఆనందమే వేరు! ఎంతో ఇష్టపడి కొత్త బీఎండబ్ల్యూ కారు కొనుగోలు చేసిన ఓ వ్యక్తి..
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త వాతావరణం నెలకొంది.
మహారాష్ట్రలోని ప్రఖ్యాత హిందూ హృదయసమ్రాట్ బాలాసాహెబ్ థాకరే మహారాష్ట్ర సమృద్ధి మహామార్గ్‌పై జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి కెప్టెన్‌పై జరిగిన కత్తిదాడి అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలను దేశవ్యాప్తంగా అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు వేగవంతమైంది.