వనమా తరువాత వంతు మంత్రి శ్రీనివాస్ గౌడ్ దేనా?

Publish Date:Jul 25, 2023

Advertisement

కొత్తగూడెం ఎమ్మెల్యేగా వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించిన రోజే అటువంటిదే మరో  పిటిషన్ ను కొట్టి వేయాలంటూ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. తన ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్ ను కొట్టివేయాల్సిందిగా శ్రీనివాస్ గౌడ్ దాఖలు చేసుకున్న పిటిషన్ ను తెలంగాణ హై కోర్టు కొట్టివేసింది.

మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు ధృవపత్రాలు ధాఖలు చేశారంటూ మహబూబ్ నగర్ కు చెందిన రాఘవేంద్ర రాజు అనే వ్యక్తి హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శ్రీనివాసగౌడ్ కు ఎమ్మెల్యేగా, మంత్రిగా కొనసాగే అర్హత లేదని రాఘవేంద్రరాజు ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. కాగా ఆ పిటిషన్ ను కొట్టివేయాలంటూ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ ను విచారించిన హై కోర్టు ఇరు పక్షాల వాదనలూ విన్న తరువాత శ్రీనివా గౌడ్ పిటిషన్ ను కొట్టివేసింది.  

పిటిషనర్ వేసిన పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం అనుమతించింది. రాఘవేంద్రరాజు పిటిషన్ ను విచారణకు స్వీకరించింది. దీంతో వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ పలువురు మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై రాఘవేంద్రరాజు ధాఖలు చేసిన పిటిషన్ తీర్పు ఎలా ఉండబోతోందన్న చర్చకు తెరలేపారు. ఏది ఏమైనా  మంత్రి శ్రీనివాసగౌడ్ ఎన్నికను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించడం బీఆర్ఎస్ కు, మంత్రికీ కూడా ఎదురుదెబ్బగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
రా బిడ్డా.. అసెంబ్లీకి’.. KTRకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్.!
భారతీయ రైల్వేలో ప్రయాణం చేయడానికి ప్రయాణికులు చాలా కాలం ముందే టికెట్లను రిజర్వ్ చేసుకుంటూ ఉంటారు.
తండ్రి అంటే పిల్లలకు ఉండే ప్రాణం, ఆప్యాయత ఎంతో గొప్పవి. కానీ ఆ ప్రేమ కొన్నిసార్లు ఊహకందని వింత నిర్ణయాలకు దారితీస్తుంది.
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో తీవ్ర కలకలం రేపిన ఉదంతంలో ఒకరు దారుణ హత్యకు గురయ్యారు.
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
జమ్మూకశ్మీర్‌‌లోని కతువా జిల్లాలో అత్యంత విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది.
హైదరాబాద్‌ నగరంలోని నిమ్స్‌ అదనపు మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నోరి లక్ష్మీ భాస్కర్‌పై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దర్యాప్తును ముమ్మరం చేసింది.
హైదరాబాద్‌లోని టెక్ హబ్ మాదాపూర్‌లో జరిగిన ఒక సంచలన ఘటన కలకలం రేపింది.
దేశవ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక కీలక ప్రకటన చేసింది
డేటింగ్ యాప్ ద్వారా పరిచయం.. పబ్‌కు తీసుకెళ్లి రూ.29 వేల బిల్లు.!
హైదరాబాద్ నగరంలోని ఎస్‌ఆర్‌ నగర్ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపిన ఒక విషాదకర ఘటనలో యువతి ప్రాణాలు కోల్పోయింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.