రాజ్ భవన్, ప్రగతి భవన్ సయోధ్య మూన్నాళ్ల ముచ్చటేనా?

Publish Date:Mar 3, 2023

Advertisement

తెలంగాణలో ప్రభుత్వం, గవర్నర్ మధ్య సయోధ్య మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలింది. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా కోర్టు సూచనలతో అనివార్యంగా రాజ్ భవన్, ప్రగతి భవన్ ల మధ్య కుదిరిన సయోధ్య కొనసాగుతుందా అంటూ అప్పట్లోనే తెలుగువన్ ఇది మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోతుందని విస్పష్టంగా చెప్పింది. ఇప్పుడు తెలంగాణ సర్కార్ గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్న బిల్లులకు వెంటనే ఆమోదం తెలపాలని ఆదేశించాలని కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అంటే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్బంగా కనిపంచిన సుహృద్భావం అక్కడితోనే మాయమైపోయిందని తేటతెల్లమైంది. అయితే ఒక్కటి మాత్రం నిజం అసలు గవర్నర్  శాసన సభకు వచ్చి ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించడం, నిజంగా... నిజమా, అనే అనుమానం అప్పట్లో అందరిలో కలిగింది.  నిజం  తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ను ముఖ్యమంత్రి కేసీఆర్  సాదరంగా ఆహ్వానించి అసెంబ్లీలోకి తోడ్కొని వెళ్లడం కూడా అప్పట్లో సంభ్రమాశ్చర్యాలను కలిగింది. అదే విధంగా  ప్రభుత్వం రాసిచ్చిన ప్రసంగాన్ని గవర్నర్    అక్షరం పొల్లు పోకుండా ఉన్నది ఉన్నట్లు చదవడం కూడా విభేదాలన్నీ గతించిన గతమేనా అన్న భావన కూడా కలిగించింది.

ఎందుకంటే అప్పటికి రెండున్నర సంవత్సరాలకు పైగా ప్రగతి భవన్, రాజ్ భవన్ మధ్య జరుగుతన్న ప్రచ్ఛన్న పోరు, రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు ముందు చోటు చేసుకున్నపరిణామాలు, రాజ్యాంగ సంక్షోభం తప్పదా అనిపించేలా తలెత్తిన పరిస్థితులు గమనిస్తే..  అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్బంగా గవర్నర్ తమిళిసై ప్రసంగిస్తారని కానీ, ఆమెను ముఖ్యమంత్రి కేసీఆర్ సాదరంగా ఆహ్వానిస్తారని కానీ ఎవరూ కనీసం ఊహించలేదు.  నిజానికి   తెలంగాణ  హై కోర్టు జోక్యం చేసుకోవడం వలన కానీ  లేదంటే  నిజంగానే రాజ్యాంగ సంక్షోభం ఏర్పడేదే అన్న అభిప్రాయం ఇప్పటికీ పరిశీలకులలో వ్యక్తమౌతోంది.  అయితే హైకోర్టు జోక్యంతో అనివార్యంగానైనా ముఖ్యమంత్రి కేసీఆర్,  గవర్నర్ తమిళి సై  చాలా చక్కగా వారి వారి పాత్రలను వారు పోషించారు. ‘సయోధ్య’ చిత్రాన్ని రక్తి కట్టించారు.  

అఫ్కోర్స్ అప్పట్లో ముఖ్యమంత్రి బాడీ లాంగ్వేజ్ లో కొద్దిపాటి అవమాన ఛాయలు, గవర్నర్ అడుగుల్లో కొద్దిపాటి విజయ దరహాసం కనిపించాయనుకోండి అది వేరే విషయం.  అయినా  రెండు వ్యవస్థల మధ్య సయోధ్య అవసరాన్ని ఇద్దరూ ఎంతో కొంత గ్రహించినట్లే అప్పట్లో కనిపించారు.  అయితే, ఈ సయోధ్య ఇంత వరకేనా   ముందు ముందు కూడా కొనసాగుతుందా? అంటే, రాజకీయ విశ్లేషకులు అనుమానమే అంటున్నారు. కానీ  ఇక ముందు గతంలోలాగా తెగే వరకూ లాగే పరిస్థితి అయితే రాకపోవచ్చనీ, ఇరు వర్గాల నుంచి ఎంతో కొంత విజ్ఞత, వివేచనా, సంయమనం ఆశించ వచ్చననే అభిప్రాయం అప్పట్లో వ్యక్తమైంది. కానీ ఆ అభిప్రాయం పూర్తిగా తప్పని తదననంతర పరిణామాలు రుజువు చేశాయి.

పెండింగ్ లో ఉన్న ఐదారు బిల్లుల విషయంలో గవర్నర్ ఎలాంటి  నిర్ణయం ఇప్పటి వరకూ అయితే తీసుకోలేదు. వాటికి ఆమోదముద్ర వేయలేదు.  ప్రధానంగా  మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలలో అవిశ్వాసం తీర్మానం గడువును ప్రస్తుతమున్న మూడేళ్ళ నుంచి నాలుగేళ్ళకు పొడిగిస్తూ  గత అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదించిన సవరణ బిల్లు విషయంలోనూ గవర్నర్ నిర్ణయం తీసుకోలేదు. అలాగని తిప్పి పంపనూ లేదు. పరిశీలనలో ఉంది (అండర్ కన్సిడరేషన్) అని మాత్రమే చెబుతూ ఉన్నారు.   ఈ నేపథ్యంలోనే కేసీఆర్ సర్కార్ ఇక లాభం లేదన్న నిర్ణయానికి వచ్చేసి ఏకంగా బిల్లులపై గవర్నర్ సంతకాలు చేసేలా ఆదేశించాలని కోర్టును ఆశ్రయించింది.

 ఆమోదం కోసం ప్రభుత్వం పంపించిన 10 బిల్లులను  గవర్నర్ పెండింగ్ లో పెట్టారని.. ఆమోదించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ.. తెలంగాణ ప్రభుత్వమే సుప్రీంకోర్టులో రిట్ పిటీషన్ దాఖలు చేయటం సంచలనం సృష్టించింది.   ఆరు నెలలుగా 10 బిల్లులను ఆమోదించకుండా తొక్కిపెడుతున్నారని,  గవర్నర్ పరిధి ఏమిటి?  ఎందుకు బిల్లులు ఆమోదించటం లేదనే విషయాన్ని సుప్రీం కోర్టులోనే తేల్చుకోవాలని  నిర్ణయించుకున్న బీఆర్ఎస్ సర్కార్  బిల్లులను  గవర్నర్ ఆమోదించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో రాష్ట్రంలో ప్రగతి భవన్, రాజ్ భవన్ మధ్య విభేదాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గతంలో కనిపించిన సయోధ్య అంతా పైపై మెరుగేనని తేటతెల్లమైపోయింది. 

By
en-us Political News

  
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.