కేబినెట్ విస్త‌ర‌ణ‌పై కేసీఆర్ క‌స‌రత్తు!.. ఎవ‌రికి షాక్‌? ఎవ‌రికి ఛాన్స్‌?

Publish Date:Mar 17, 2022

Advertisement

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్’ ఎప్పుడు ఏ నిర్ణయం తెసుకుంటారో, ఏ నిర్ణయం ఎందుకు తీస్కుంటారో, ఎవరకీ అర్థం కాదు. అయితే, ముందస్తు ఎన్నికలకు వెళ్ళే విషయంలో అయితే, ముఖ్యమంత్రి ఇప్పటికే ఒక  స్పష్టమైన నిర్ణయానికి వచ్చారని పార్టీ నాయకులే కాదు, ప్రత్యర్ధి పార్టీల నేతలు, రాజకీయ విశ్లేషకులు కూడా గంటకొట్టి మరీ చెపుతున్నారు. మరోవంక, ఎలక్షన్ కాబినెట్’ మీద ముఖ్యమంత్రి కసరత్తు చేతున్నారని, కొద్ది రోజుల్లోనే మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని అంటున్నారు. నిజానికి శాసన సభ బడ్జెట్ సమావేశాలకు ముందే, మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ప్రచారం జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికలు అయిన వెంటనే, ముఖ్యమంత్రి రాజకీయంగా,పాలనా పరంగా పావులు కదుపడం ప్రారంభించారు. పార్టీ జిల్లా అధ్యక్షులను నియమించరు. నామినేటెడ్ పదవుల పందారానికి శ్రీకారం చుట్టారు. అదే క్రమంలో మత్రివర్గ విస్తరణ కూడా ఉంటుందని ప్రచారం కూడా జరిగింది. అలాగే, కడియం, కవిత సహా మరి కొన్ని పేర్లు కూడా ప్రముఖంగా వినిపించాయి. అయితే, ఎందుకనో, ఆ ముహూర్తం వెనక్కి పోయింది. కానీ, ఇప్పుడు పక్కాగా మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, అది కూడా మరో పక్షం రోజుల్లోగా ఉంటుంది విశ్వసనీయ వర్గాలు ఘంటాపథంగా చెపుతున్నాయి. మోస్ట్ ప్రాబబ్లీ, ఏప్రిల్ 2 ఉగాది రోజున మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని అంటున్నారు. 

అదలా ఉంటే, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ బృందం జరిపిన సర్వేలో అనేక మంది మంత్రులకు నెగటివ్ మార్కులు వచ్చినట్లు సమాచరం. మంత్రుల ప్రవర్తన ప్రభుత్వ వ్యతిరికేతకు మరింతగా పెంచే విధంగా ఉందని, అదే విధంగా  మంత్రులు సొంత జిల్లాల్లో ఎదుర్కుంటున్న ప్రజా వ్యతిరేకత ఎన్నికల ఫలితాలపై తీవ్ర ప్రభావం ఉంటుందని, పీకే టీమ్’గుర్తించింది. ఈ నేపధ్యంలో మచ్చ తెచ్చే మంత్రులకు ఉద్వాసన చెప్పాలని, ముఖ్యమంత్రి నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో, తప్పుడు ఎన్నికల అఫిడవిట్’  సహా ఇతర ఆరోపణలు ఎదుర్కుంటున్న మంత్రి శ్రీనివాస గౌడ్, గ్రానైడ్ కేసులో ఈడీ విచరణను ఎదుర్కుంటున్న గంగుల కమలాకర్’తో పాటు మరి కొందరు మంత్రుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వ్యవసాయ శాఖ మంత్రి ప్రశాంత రెడ్డి పేరు కూడా ఉద్వాసన జాబితాలో ఉందని అంటున్నారు. అలాగే, 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్, తో పాటుగా ప్రమాణ స్వీకారం చేసిన హోమ్ మంత్రి మహ్మూద్ ఆలీని కూడా మంత్రి వర్గం నుంచి తప్పిస్తున్నట్లు సమాచారం. అయితే, ముఖ్యమంత్రి కేసేఅర్ వీరవిధేయుడిగా పేరొందిన,మంత్రి వర్గంలో ఉన్న ఒకే ఒక్క ముస్లిం ఫేస్, మహ్మూద్ ఆలీని తప్పించడానికి స్పష్టమైన కారణం ఏదీ కనిపించక పోయినా , రాజకీయ వ్యూహంలో భాగంగానే ఆయనకు, విశ్రాంతి ఇవ్వాలని ముఖ్యమత్రి నిర్ణయించినట్లు సమాచారం.అదే విధంగా, మంత్రివర్గంలో ఉద్యమ వ్యతిరేకులకు పెద్ద పీట వేశారనే ఆరోపణ బలంగా వినవస్తున్న నేపధ్యంలో, ‘ఫిరాయింపు’ మంత్రులో ఒకరిద్దరికి ఉద్వాసన తప్పదాని అంటున్నారు. 

కాగా, గతంలో మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌కు గురైన ఈటల రాజేందర్‌ స్థానంలో అదే ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన బండా ప్రకాశ్‌కు చోటు దక్కటం ఖాయమనేది పార్టీ వర్గాల అంచనా. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండాను, మండలికి తీసుకొచ్చేందే, అందుకని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, కల్వకుంట్ల కవిత ఆశావహుల జాబితాలో ఉన్నారు. ఇక, తెలంగాణలో మారుతున్న రాజకీయ సమీకరణాల్లో భాగంగా.. ముఖ్యమంత్రి కేసీఆర్ పక్కాగా ప్రాంతీయ- సామాజిక సమీకరణాలను అమలు చేయటం ఖాయంగా కనిపిస్తోందని అంటునారు. అలాగే, ఇక ముఖ్యమంత్రి జాతీయ రాజకీయాలు ఇతరేతర కార్యక్రమాలను పక్కన పెట్టి పూర్తిగా రాష్ట్రం’ పైనే దృష్టి పెడతారని అంటున్నారు.

By
en-us Political News

  
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.