తగ్గని ట్రంప్ యుద్ధోన్మాదం.!
Publish Date:Jul 5, 2026
Advertisement
అగ్రదేశాధినేత డొనాల్డ్ ట్రంప్ యుద్ధోన్మాదం ఇసుమంతైనా తగ్గలేదు. ఓ వైపు నాలుగు నెలల తరువాత ఇప్పుడిప్పుడే పశ్చిమాసియాలో యుద్ధజ్వాలలు చల్లారి, ఉద్రిక్తతలు సడలుతున్న వేళ.. ట్రంప్ మరోసారి రణన్నినాదం చేశారు. నాటో సభ్య దేశాలు తగ్గించడానికి వీల్లేదనీ, ఆయా దేశాలు తమ రక్ణణ వ్యయాన్ని తమ జీడీపీలో 5శాతానికి పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వారంలో టర్కీ క్యాపిట్ అంకారా వేదికగా జరగనున్న నాటో శిఖరాగ్ర సమావేశంలో ట్రంప్ ఎజెండా ఇదేనని వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి. రక్షణ విషయంలో నాటో సభ్య దేశాలు అమెరికాపై అతిగా ఆధారపడే విధానానికి స్వస్తి పలకడం కోసమే ట్రంప్ ఈ డిమాండ్ తెరపైకి తీసుకువచ్చారని శ్వేత సౌధ సీనియర్ అధికారులు చెబుతున్నారు. కాగా నాటో సభ్య దేశాల శిఖరాగ్ర సమావేశం కోసం సోమవారం (జులై6) వాషింగ్టన్ నుంచి అంకారాకుబయలు దేరారు. మంగళవారం (జులై 7) అంకారాకు చేరుకుంటారు. అంకారాలో తొలుత టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్‌తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఆ తర్వాత బుధవారం (జులై 8) నాటో దేశాల నేతల అత్యున్నత స్థాయి సమావేశాల్లో పాల్గొంటారు. ఈ పర్యటనలో భాగంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ, సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్-షారాలతో కూడా ట్రంప్ ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఇక రక్షణ బడ్జెట్ పెంపు విషయంలో పోలాండ్, నార్డిక్, బాల్టిక్ దేశాలు ఇప్పటికే సంసిద్ధత వ్యక్తం చేశాయి. యూరప్‌లోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన జర్మనీ కూడా 2029 నాటికి తన రక్షణ వ్యయ లక్ష్యాన్ని చేరుకునేందుకు చర్యలు తీసుకుంటున్నది. ఇవే కాకుండా నాటో సభ్య దేశాలన్నీ కూడా రక్షణ బడ్జెట్ పెంపు విషయంలో వేగంగా చర్యలు తీసుకోవాలని అమెరికా పట్టుబడుతోంది. NATO Summit Turkey, Defense Spending Ultimatum, White House Foreign Policy, US Weapons Purchase, Global Defense Budget
http://www.teluguone.com/news/content/trumps-war-hysteria-shows-no-signs-of-abating-36-225133.html





