హాట్ టాపిక్ గా ట్రంప్ రోడ్డు.. శిలాఫలకం ఆవిష్కరించిన బట్టి పేరే లేదు!

Publish Date:Jun 25, 2026

Advertisement

హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నానక్‌రామ్‌గూడలో ఉన్న అమెరికా కాన్సులేట్ రోడ్డుకు  డొనాల్డ్ ట్రంప్ అవెన్యూగా నామకరణం చేయడం ఇప్పుడు  రాజకీయ వర్గాల్లో  చర్చనీయాంశంగా మారింది. అగ్రరాజ్యం అమెరికాకు స్వాతంత్య్రం వచ్చి 250 ఏళ్లు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రత్యేక గౌరవాన్ని కల్పించింది.  ఫ్రీడమ్ 250 పేరిట   నిర్వహించిన  వేడుకకు అమెరికా అంబాసిడర్ సెర్జియో గోర్, తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.  వీరిద్దరూ కలిసి  ఆ రోడ్డు  డొనాల్డ్ ట్రంప్ అవెన్యూకు సంబంధించిన  శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక బంధాన్ని పటిష్టం చేసే వేదికగా ఈ కార్యక్రమం నిలిచింది.

అయితే..  ఈ శిలాఫలకంపై  ఉపముఖ్యమంత్రి  భట్టి విక్రమార్క పేరు ఎక్కడా కనిపించలేదు. ఈ వింత పరిస్థితిని గమనించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆశ్చర్యానికి గురయ్యారు. ఎంతో ఉత్సాహంగా కార్యక్రమానికి వచ్చిన ఆయన, ఆ శిలాఫలకంపై తన పేరు లేకపోవడంతో  నిరాశకు లోనయ్యారు. 

మరోవైపు, ఈ రోడ్డు నామకరణంపై రాజకీయంగా కూడా పెద్ద దుమారమే రేగుతోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గతంలో డొనాల్డ్ ట్రంప్ విధానాలను, ముఖ్యంగా భారత్‌పై విధిస్తున్న వాణిజ్య సుంకాలను తీవ్రంగా విమర్శించారని బీజేపీ జాతీయ ప్రతినిధి షెహజాద్ పూనావాలా గుర్తు చేశారు. రాహుల్ గాంధీ అమెరికా అధ్యక్షుడిని భారత వ్యతిరేకిగా చిత్రీకరిస్తుంటే..  తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఆయన పేరు  ఏకంగా ఒక రోడ్డుకు పెట్టి అత్యున్నత గౌరవాన్ని ఇవ్వడం ఏంటని నిలదీశారు. రాహుల్ హిపోక్రసీ ప్రో మాక్స్ అని ఎద్దేవా చేశారు. గతంలో అదానీ గ్రూపుపై రాహుల్ విమర్శలు చేసినప్పటికీ..  సీఎం రేవంత్ రెడ్డి అదానీతో ఒప్పందాలు చేసుకున్నారని, ఇప్పుడు ట్రంప్ విషయంలోనూ రేవంత్ రెడ్డి అసలు రాహుల్ గాంధీ మాటలను ఏమాత్రం లెక్కచేయడం లేదని బీజేపీ విమర్శలు గుప్పించింది. కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

ఈ వివాదాలు ఎలా ఉన్నప్పటికీ, తెలంగాణ , అమెరికా మధ్య వాణిజ్య, సాంకేతిక సంబంధాలు కొత్త శిఖరాలకు చేరుతున్నాయని ఈ వేడుక స్పష్టం చేసింది. ఈ ప్రాంతం నుంచి జరుగుతున్న ఐటీ, ఏరోస్పేస్,  డిఫెన్స్ రంగాలు ద్వైపాక్షిక సంబంధాలను శాసిస్తున్నాయని అమెరికా అంబాసిడర్ సెర్జియో గోర్ ప్రశంసించారు. మిషన్ ఇండియా' చొరవ,  తాత్కాలిక వాణిజ్య ఒప్పందాల ద్వారా అమెరికాలోకి ఏకంగా 20 బిలియన్ డాలర్లు, అంటే భారత కరెన్సీలో  1.66 లక్షల కోట్ల రూపాయలు కొత్త పెట్టుబడులు రాబోతున్నాయని ఆయన ఈ సందర్భంగా  వెల్లడించారు.  అమెరికా ఫస్ట్ అంటే అమెరికా ఒంటరిగా ఉండటం కాదన్నారు. ట్రంప్ పేరు పెట్టడంపై హర్షం వ్యక్తం చేస్తూ..  తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ విధంగా ఒకవైపు అంతర్జాతీయ పెట్టుబడుల జోరు, మరోవైపు ప్రోటోకాల్ వివాదాలు,  రాజకీయ విమర్శలతో  డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ   రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా నిలిచింది.

By
en-us Political News

  
సాయికృష్ణ మిస్సింగ్ కేసును రాజకీయం చేయాలని వైసీపీ చూస్తోందనీ., కానీ ఈ కేసులో నిందితుడైన సీఐ నాగరాజు కూడా కాపు సామాజిక వర్గానికి చెందినవాడేనని గుర్తుచేశారు. తప్పు చేసిన వాడు ఏ కులానికి చెందినవాడైనా తప్పేనని, దానికి కులాన్ని అంటగట్టడం సరికాదని హితవు పలికారు.
ఆ అమ్మాయి నోట జగన్ సార్ అనే మాట రాగానే.. అది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డేనంటూ వైఎసీపీ సోషల్ మీడియా విభాగం పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారానికి తెరలేపింది. ఆ అమ్మాయి ప్రాణాలు కాపాడింది వైఎస్ జగనేనంటూ ఫోటోలు మార్ఫింగ్ చేసి నెట్టింట పోస్టులు పెట్టారు. ఈ క్రెడిట్ చోరీపై కిరాక్ ఆర్పీ సాక్ష్యాలను చూపిస్తూ గట్టి కౌంటర్ ఇచ్చారు.
బాధిత తల్లితో సిఐ నాగరాజు మాట్లాడిన ఆడియో సంభాషణలు, ఆయన ప్రదర్శించిన దురుసు ప్రవర్తన ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో బహిర్గతమై ప్రపంచమంతటా సంచలనం సృష్టించాయన్నారు.
కాంగ్రెస్ నేతల పనితీరుపై ముఖ్యమంత్రి అసంతృప్తి..
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఎప్పుడూ ఊహించని మలుపులు చోటుచేసుకుంటూనే ఉంటాయి
తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో మాజీ మంత్రి తోట త్రిమూర్తులు నేతృత్వంలో జరిగిన వైసీపీ కాపు సామాజిక వర్గాల నాయకుల సమావేశం రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పుట్టించింది. ఈ సమావేశంలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో పాల్గొని భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు.
పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యల వెనుక ఒక బలమైన రాజకీయ వ్యూహం కనిపిస్తోందన్నారు. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఇటీవల జరిగిన సుదీర్ఘ భేటీ తర్వాత పవన్ టోన్ పూర్తిగా మారినట్లు స్పష్టమవుతోంది. తాను కేవలం 21 సీట్లు గెలిచిన ఒక ప్రాంతీయ పార్టీ నేతగా మాత్రమే కాకుండా.. కేంద్రంలోని పెద్దల అండదండలు ఉన్న సుపీరియర్ పొజిషన్‌లో ఉన్నాననే సంకేతాన్ని పవన్ పంపించారన్నారు.
కూటమి ప్రభుత్వంలో పరిపాలనా లోపాలు, రాజకీయ సమన్వయ లేమి స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. గతంలో ఆర్టీజీఎస్ వంటి డిజిటల్ వ్యవస్థల ద్వారా లభించిన 80 శాతం ప్రజా సంతృప్తి కేవలం కాగితాలకే పరిమితమైందనీ.. డిజిటల్ కనెక్టివిటీ పెరిగి భౌతిక సంబంధాలు దెబ్బతినడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని తమ సర్వేలో తేలిందని చెప్పారు.
ఎన్నికల బరిలో కేసీఆర్, బీఆర్ఎస్ కూటమిని ఢీకొట్టడం ఎవరికైనా పెద్ద సవాలే. గతంలో కేసీఆర్ వాడే ఘాటైన రాజకీయ విమర్శలు, వ్యంగ్యాస్త్రాలపై ఆయనకు మాత్రమే పేటెంట్ హక్కు ఉందనే భావన ఉండేది. కానీ రేవంత్ రెడ్డి రాకతో.. ఆ ముద్రను పూర్తిగా చెరిపివేశారు. కేసీఆర్, కేటీఆర్ ల కంటే మరింత దూకుడుగా, ఘాటుగా రేవంత్ ప్రజల్లోకి వెళ్లారు.
కేంద్ర ప్రభుత్వం పాలసీలు లేదా ప్రాజెక్టులను ఏ ఒక్కరి కోసమో కాకుండా దేశ ప్రజలందరి కోసమే ప్రవేశపెడుతుందని బదులిచ్చారు. అయితే.. ఆ ప్రాజెక్టులను అందుకోవడంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎంత వేగంగా, సానుకూలంగా స్పందిస్తుందనే దానిపైనే వాటి రాక ఆధారపడి ఉంటుందని చెప్పారు.
చంద్రబాబు నాయుడు కుమారుడిగా, ఐటీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న నేతగా మాత్రమే గుర్తింపు ఉన్న యువకుడు నారా లోకేష్. అదే నారా లోకేష్ ఇప్పుడు ప్రజా క్షేత్రంలో తిరుగులేని నాయకుడిగా ట్రాన్స్ ఫార్మ్ అయ్యారు.
ఈ చర్చోపచర్చలు, ఊహాగాన సభలపై ఏపీ మంత్రి నారా లోకేష్ ఎక్స్ ప్రెస్ అడ్డా వేదికగా క్లారిటీ ఇచ్చారు. దేశానికి నరేంద్ర మోదీ రూపంలో ఒక బలమైన ప్రధానమంత్రి ఉన్నారన్న లోకేష్.. చంద్రబాబు ప్రధాని అన్న చర్చకు, వదంతులకు ఫుల్ స్టాప్ పెట్టేశారు.
ఆయనకు పార్టీ నేతల నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు లభించడం లేదన్న చర్చ గత కొంత కాలంగా జనసేనలో అంతర్గతంగా సాగుతోంది. ముఖ్యంగా ప్రతిపక్షాలు సోషల్ మీడియా వేదికగా, మీడియా ముఖంగా చేస్తున్న విమర్శలను, తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టడంలో జనసేన ద్వితీయ శ్రేణి నాయకత్వం వెనుకబడిందన్న భావన సర్వత్రా వ్యక్తమౌతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.