అమెరికా పాస్‌పోర్టులపై ట్రంప్ ఫోటో...జగన్ నిర్వాకాలు గుర్తు చేసుకుంటూ సెటైర్లు
Publish Date:Apr 29, 2026
Advertisement
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ .. పబ్లిసిటీ పిచ్చి ప్రపంచం మొత్తానికి తెలిసిందే. 8 యుద్దాలు ఆపాను, నోబెల్ శాంతి బహుమతికి తన కంటే అర్హులెవరని , నానా హడావుడి చేసి నవ్వులు పాలయ్యారు. ఇక ఎవరో తనను గుర్తించేది ఏంటి? అన్నట్లు .. చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోవడానికి సొంత అజెండా అమలుకు ప్రయత్నిస్తూ.. యావత్తు ప్రపంచాన్ని హతాశుల్ని చేస్తున్నారు. ఆ క్రమంలో యూఎస్ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారి తీస్తోంది. అమెరికా పాస్‌పోర్ట్‌లలో ట్రంప్ ఫోటోను ముద్రించాలని నిర్ణయించడం సంచలనంగా మారింది. అయితే ఈ పాస్‌పోర్ట్‌లను పరిమిత సంఖ్యలోనే ముద్రించనున్నారు. అమెరికా 250వ స్వాతంత్ర్య వేడుకలకు గుర్తుగా వీటిని జారీ చేయబోతున్నారు. ట్రంప్ ఫొటోతో అమెరికా పాస్‌పోర్ట్‌లను ముద్రించబోతున్నట్టు మొదట మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ వార్తలను అమెరికా విదేశాంగ శాఖ ధృవీకరించింది. ఈ పాస్ట్‌పోర్ట్‌లలో ట్రంప్ ఫోటోతో పాటు అమెరికా స్వాతంత్ర్య ప్రకటనకు సంబంధించిన చిత్రాలు, జెండా రూపకల్పన వంటి అంశాలు కూడా ఉంటాయి.అదే కాకుండా.. 250వ స్వాతంత్ర్య వేడుకలకు గుర్తుగా ట్రంప్ సంతకం ఉన్న కరెన్సీ నోట్లను విడుదల చేయబోతున్నట్టు అమెరికా ట్రెజరీ శాఖ ఇటీవల ప్రకటించింది. ఆ దేశ కరెన్సీ నోట్లపై సంతకం చేయబోతున్న తొలి అధ్యక్షుడిగా ట్రంప్ చరిత్ర సృష్టించబోతున్నారు. ఇక ట్రంప్ చిత్రంతో నాణెలు కూడా విడుదల కానున్నాయి. ఈ నిర్ణయాలపై అమెరికాలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా చర్చలు మొదలయ్యాయి. ట్రంప్ పబ్లిసిటీ వ్యవహారం చూస్తున్న తెలుగు ప్రజలు మాజీ ముఖ్యమంత్రి జగన్ నిర్వాకాలను గుర్తు చేసుకుంటూ రకరకాలుగా చర్చించుకుంటున్నారు. విద్యార్థులకు ఇచ్చే పుస్తకాల బ్యాగులు, ఎమ్మార్వో జారీ చేసే సర్టిఫికేట్లు, రైతుల పట్టా పాస్ పుస్తకాలు, చివరికి సరిహద్దు రాళ్లపై కూడా జగన్ ఫొటో ముద్రించి వైసీపీ హయాంలో తెగ ప్రచారం చేసుకున్నారు. దానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే.. తర్వాత వాటిని తొలగించడానికి వందల కోట్లు ఖర్చయ్యాయి. ఇప్పుడు ట్రంప్ ట్రెండ్ చూస్తూ.. జగన్ మామ ఎపిసోడ్లు మళ్లీ వైరల్ అవుతున్నాయి. పబ్లిసిటీ పిచ్చ పీక్ స్టేజ్‌కి చేరడం అంటే ఇదేనేమో?
http://www.teluguone.com/news/content/trumps-photo-on-us-passports-36-218555.html





