మావల్లే ఇరాన్ అణ్వాయుధ కల చెదిరింది.. ట్రంప్

Publish Date:May 28, 2026

Advertisement

అంతర్జాతీయ రాజకీయాల్లోనూ, ప్రపంచ చమురు వాణిజ్యంలోనూ అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి ఎవడబ్బ సొత్తూ కాదంటూ అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ హుంకరించారు. హర్మేజ్ జలసంధి వేదికగా అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు మరోసారి పీక్స్‌కు చేరాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ దేశానికి  ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు.  హర్మూజ్ జలసంధి  అంతర్జాతీయ జలాశయమని, దీనిపై ఏ ఒక్క దేశానికీ  పూర్తి నియంత్రణ ఉండటానికి వీల్లేదని కుండబద్దలు కొట్టారు. వైట్ హౌస్ లో జరిగిన క్యాబినెట్ సమావేశంలో  మాట్లాడిన డొనాల్డ్ ట్రంప్..  ఇరాన్ గనుక ఈ జలసంధిని అడ్డుకోవాలని చూస్తే..  తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని  హెచ్చరించారు. ఈ జలసంధిని ప్రపంచ దేశాలన్నింటికీ అందుబాటులో ఉంచేలా అమెరికా పర్యవేక్షిస్తుందని స్పష్టం చేశారు.  ఏ దేశం కూడా  హర్మూజ్ జలసంధిని తమ గుత్తాధిపత్యంగా మార్చుకోలేదన్నారు. 

ప్రపంచ ఇంధన సరఫరాలో   20 శాతానికి పైగా ముడి చమురు ఈ మార్గం గుండానే రవాణా అవుతుంది. అందుకే ఈ ప్రాంతంపై పట్టు సాధించేందుకు ఇరాన్ ప్రయత్నిస్తుండగా.. అమెరికా   తీవ్రంగా నిరోధిస్తోంది.  ఇరాన్ నౌకాదళం ఇప్పటికే పర్షియన్ గల్ఫ్ అడుగుభాగానికి చేరుకుందని, వారి వైమానిక దళం, వైమానిక రక్షణ వ్యవస్థలు, రక్షణ పారిశ్రామిక కేంద్రాలు అమెరికా దాడుల వల్ల భారీగా దెబ్బతిన్నాయని ట్రంప్ ఈ సందర్భంగా గుర్తుచేశారు.

ఇరాన్ వద్ద క్షిపణులు ఉండొచ్చు కానీ..  ప్రస్తుతం వారు కొత్తగా క్షిపణులను గానీ, డ్రోన్లను గానీ లేదా యుద్ధ నౌకలను గానీ నిర్మించలేని స్థితిలో ఉన్నారన్న ట్రంప్..  ఇరాన్‌తో శాంతి ఒప్పందాలు లేదా ఇతర చర్చలు జరుగుతున్నాయనే వార్తల నడుమ.. ఇరాన్‌పై ఉన్న ఆంక్షలను ఎత్తివేసే ప్రసక్తే లేదని  ఖరాఖండిగా చెప్పారు. 

ఇరాన్‌కు ఎటువంటి ఆర్థిక మినహాయింపులు,  నిధుల విడుదల ఉండబోదని, వారు పద్ధతిగా ప్రవర్తించి సరైన నిర్ణయాలు తీసుకున్నప్పుడే ఆ విషయం గురించి ఆలోచిస్తామని పేర్కొన్నారు. ఒకవేళ అమెరికా గనుక గతంలో  బాంబర్లతో ఇరాన్ మిలిటరీ స్థావరాలపై దాడులు చేయకపోయి ఉంటే..  కేవలం రెండు వారాల వ్యవధిలోనే ఇరాన్ అణుబాంబును తయారు చేసి ఉండేదని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా సైనిక చర్యల వల్లే ఇరాన్ అణ్వాయుధ కల చెదిరిపోయిందని ట్రంప్ చెప్పుకొచ్చారు.   మరోవైపు..  ఇరాన్ మీడియా ప్రచారం చేస్తున్న కొత్త శాంతి ప్రతిపాదనల ముసాయిదాను శ్వేతసౌధం పూర్తిగా తోసిపుచ్చింది.

అది కేవలం ఒక కల్పిత కథనం అని కొట్టిపారేసింది. హర్మూజ్ జలసంధి ద్వారా వాణిజ్య రవాణాను పూర్తిగా పునరుద్ధరించడానికి ప్రతిఫలంగా అమెరికా తన సైన్యాన్ని ఇరాన్ సరిహద్దుల నుండి ఉపసంహరించుకుంటుందనే ప్రచారం పూర్తిగా అబద్ధమని ట్రప్ స్పష్టం చేశారు.  అయితే ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ మాత్రం అమెరికాతో మళ్లీ యుద్ధం వచ్చే అవకాశం లేదనీ.. బలహీనత వల్లే వారు వెనకడుగు వేస్తున్నారని  అంటోంది. ఒకవేళ అమెరికా గనుక దురాక్రమణకు పాల్పడితే ఇరాన్ దక్షిణ భూభాగాన్ని శత్రువుల శ్మశాన వాటికగా మారుస్తామని హెచ్చరించింది.  

By
en-us Political News

  
ఇంగ్లాండ్‌లోని టెల్‌ఫోర్డ్‌లో సిక్కు బస్సు డ్రైవర్‌పై దాడి చేసి, బస్సును అపహరించి రాంగ్ రూట్‌లో బీభత్సం సృష్టించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. వైరల్ అవుతున్న వీడియో పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
నిజామాబాద్ ఆర్‌ఆర్ చౌరస్తాలో వైష్ణవి భర్త హరిబాబు దారుణ హత్య కేసులో ప్రధాన నిందితుడు సంతోష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. చెల్లెలి హత్యకు 6 నెలల తర్వాత పక్కా ప్లాన్‌తో 10 సెకన్లలో 9 సార్లు కత్తితో నరికి చంపిన ఘటన తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ రిベンజ్ మర్డర్ కేసు పూర్తి వివరాలు తెలుసుకోండి.
కర్ణాటక ఐపీఎస్ అధికారిణి డి. రూపా 20 ఏళ్ల సర్వీస్‌లో 40 బదిలీలు ఎదుర్కొన్నా భయపడకుండా అవినీతిపై పోరాడుతున్నారు. శశికళ జైలు కుంభకోణం, రాజకీయ ఒత్తిళ్లను తట్టుకుని నిలిచిన ఆమె నిజాయితీ సాహస గాథ ఇక్కడ చదవండి.
ఐపీఎస్ అధికారిణి సంజుక్తా పరాశర్ సీఆర్‌పీఎఫ్ ప్రత్యేక కమాండో విభాగం కోబ్రా (CoBRA)కు తొలి మహిళా ఇన్‌స్పెక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు.
పెళ్లయిన కేవలం రెండు వారాల్లోనే అమెరికాలోని మాసాచుసెట్స్‌లో హైదరాబాద్‌కు చెందిన 27 ఏళ్ల ఇంజనీర్ జాబీర్ హుస్సేన్ నిద్రలోనే కన్నుమూశారు. ఉదయం తల్లితో మాట్లాడిన కొద్ది గంటలకే చోటుచేసుకున్న ఈ విషాద సంఘటన వివరాలు, కుటుంబ సభ్యుల ఆవేదన మరియు పార్థివదేహం రప్పించేందుకు చేస్తున్న ప్రయత్నాలపై పూర్తి కథనం.
నల్లమలలో సోదాలు.. కౌకూర్‌, యాప్రాల్‌, అచ్చంపేటలో ఆయుధాల కోసం గాలింపు..!
హైదరాబాద్ గచ్చిబౌలి అంజయ్యనగర్‌లోని హరిహర మెన్ హాస్టల్‌లో దారుణ హత్య చోటుచేసుకుంది. తోటి పనివాడు ప్రమోద్ జరిపిన కత్తిపోట్లకు కుక్ శశిధర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.
ఢిల్లీ ఎర్రకోట బాంబు పేలుడు కేసులో ఎన్ఐఏ సంచలన చార్జ్‌షీట్ దాఖలు చేసింది. 11 మంది ప్రాణాలు తీసిన ఈ ఘటన వెనుక లాల్ మందిర్ దాడి కుట్ర, మూత్రం నుంచి బాంబు తయారీ, 12 సార్లు రెక్కీ నిర్వహించిన విస్తుపోయే వివరాలు వెలుగులోకి వచ్చాయి.
అమెరికాలోని పెన్సిల్వేనియా ల్యాంకాస్టర్ కౌంటీలో ఎఫ్రాతా పోలీసులు చేపట్టిన కీలక అరెస్ట్ వివరాలు. క్రైమ్‌వాచ్ నిఘా మరియు తాజా క్రైమ్ అప్‌డేట్స్ కోసం చదవండి.
ఒడిశా కోరాపుట్ పరిధిలోని బాలిపేట సేవాశ్రమం హాస్టల్‌లో 9వ తరగతి విద్యార్థి సీయారా తాడింగిపై సహవిద్యార్థి తీవ్రంగా దాడి చేశాడు. మత్తు పదార్థాల ప్రభావంతోనే ఈ దాడి జరిగిందని, ర్యాగింగ్ అనుమానాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
ఆయుధాలు చోరీ అయ్యాయి అంటూ సీన్ క్రియేట్ చేసిన ఇంటి దొంగలు..!
లండన్ వీసాలు, ఉద్యోగాల పేరిట మోసాల ఆరోపణలతో యూట్యూబర్ నందూస్ వరల్డ్ నందనను విజయవాడ పోలీసులు 4 గంటల పాటు విచారించారు. బిగ్ బాస్ తెలుగు 10 ఎంట్రీ ప్రచారం, రూ. 15 లక్షల ఫిర్యాదు మరియు పోలీసులకు ఆమె ఇచ్చిన షాకింగ్ స్టేట్‌మెంట్ పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
సంగారెడ్డి జిల్లా కంది మండలంలో అక్రమ ఇసుక దందాపై మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు సంయుక్త దాడులు నిర్వహించారు. ఎర్ధనూర్ సర్వే నెంబర్ 134లోని నక్క వాగు పరివాహక ప్రాంతంలో ఉన్న 6 ఇసుక ఫిల్టర్లను ధ్వంసం చేశారు. వాల్టా చట్టం ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు పెడతామని అధికారులు హెచ్చరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.