ఉగ్ర దేశాల జాబితా నుండి సిరియాను తొలగించిన ట్రంప్.!
Publish Date:Jul 9, 2026
Advertisement
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉగ్రదేశాల జాబితానుంచి సిరియాను తొలగించారు. దీర్ఘ కాలంగా తీవ్ర ఆంక్షలతో నలిగిపోతున్న సిరియా దేశానికి అగ్రరాజ్యాధినేత ఉపశమనాన్ని ప్రకటించారు. ఉగ్రవాదానికి మద్దతునిచ్చే దేశాల బ్లాక్‌లిస్ట్ జాబితా నుండి సిరియాను అధికారికంగా తొలగించాలని ట్రంప్ నిర్ణయించారు. దశాబ్దాలుగా అంతర్జాతీయ సమాజంలో ఒంటరైపోయిన డమాస్కస్‌తో దౌత్య సంబంధాలను మళ్లీ సాధారణ స్థితికి తీసుకురావడానికి.. యుద్ధంతో కుదేలైన ఆ దేశ ఆర్థిక రంగాన్ని పునరుద్ధరించడానికి ట్రాంప్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన 45 రోజుల ముందస్తు నోటీసు వ్యవధి ప్రక్రియను అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఇప్పటికే అధికారికంగా కాంగ్రెస్‌కు సమర్పించారు. సిరియా ప్రజలు దశాబ్దాల చీకటి నుండి విముక్తి పొంది, ఉన్నత స్థానానికి ఎదగడానికి డొనాల్డ్ ట్రంప్ తీసుకున్ననిర్ణయమిదని చెప్పారు. నాటో సదస్సు సందర్భంగా బుధవారం (జులై 8) అంకారాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్-షరా ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ భేటీ ముగిసిన వెంటనే ట్రంప్ స్వయంగా అల్-షరాకు అందించిన లేఖలో మీ దేశ పునర్నిర్మాణానికి, పురోభివృద్ధికి అడ్డుగా ఉన్న అన్ని రకాల అడ్డంకులను పూర్తిగా తొలగిస్తానని గతంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నట్లు పేర్కొన్నారు. సిరియా గడ్డపై భారీగా పెట్టుబడులు పెట్టడానికి.. దేశాన్ని ఆర్థికంగా సంపన్నంగా మార్చడానికి అమెరికా కంపెనీలు పూర్తి సన్నద్ధతతో సిద్ధంగా ఉన్నాయంటూ.. ట్రంప్ ఆ లేఖలో స్పష్టమైన భరోసా ఇచ్చారు. Syria terrorist list removal, Donald Trump Syria decision, Syria economic sanctions lifted
http://www.teluguone.com/news/content/trump-removes-syria-from-the-list-of-state-sponsors-of-terrorism-36-225463.html





