మోడీ ఇమేజ్ డ్యామేజ్.. కారణం ట్రంప్?
Publish Date:Jun 15, 2026
Advertisement
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన ఇండియాకు సుదీర్ఘ కాలం ప్రధానమంత్రిగా వ్యవహరిస్తూ, అఖండమైన ప్రజాదరణతో చరిత్ర సృష్టించిన నాయకుడు నరేంద్ర మోడీ.. అంతర్జాతీయ వేదికలపై కూడా మోడీ తనదైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. అయితే.. ఇప్పడుఆ ఇమేజ్ మసకబారుతోందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధానాలు మోడీ ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తున్నాయంటున్నారు. భారత ప్రధాని ఇమేజ్ ను అమెరికా అధ్యక్షుడి ఇమేజ్ ను డ్యామేజ్ చేయడమేంటా? అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాం.. ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి భారత్‌పై టారిఫ్‌ల మోత మోగించడం వివాదాలకు దారితీసిన సంగతి తెలిసిందే. అలాగే.. ఆపరేషన్ సింధూర్ నిలిపివేతను తన క్రెడిట్ ఖాతాలో వేసుకుంటూ అగ్రరాజ్యాధినేత ట్రంప్ ప్రకటన మోడీ ఇమేజ్ ను డ్యామేజ్ చేసిందంటున్నారు. ట్రంప్ వ్యాఖ్యలను భారత్ నిర్ద్వంద్వంగా ఖండించినప్పటికీ ట్రపంప్ పదేపదేఅవే వ్యాఖ్యలు చేస్తుండటమే ఇందుకు కారణం. ఒక దేశ సార్వభౌమత్వాన్ని ప్రతిబింబించే పలు ప్రధాన నిర్ణయాలను ఇండియన్ గవర్నమెంట్ కంటే ముందే ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్రూత్ సోషల్ ద్వారా ప్రకటించడం భారత ను ఇబ్బందుల్లోకి నెట్టేయడమే కాకుండా.. మోడీ ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తెందంటున్యనారు. అలాగే.. ఇండియా, పాకిస్తాన్ దేశాల మధ్య ఉన్న యుద్ధ వాతావరణాన్ని తానే తన టారిఫ్ ఆంక్షల భయంతో అడ్డుకున్నానని ట్రంప్ చేసిన ప్రకటనలు, అంతర్జాతీయ వేదికలపై మోడీ ప్రతిష్ఠను మసకబార్చేలా ఉన్నాయంటున్నారు. మోడీపై పొగడ్తలు, భారత్ పై టారిఫ్ లతో ట్రంప్ అనుసరిస్తున్న విధానాలు.. ట్రంప్ చేతిలో మోడీ కీలుబొమ్మగా మారిపోయారా అంటూ విపక్షాల విమర్శలకు బలం చేకూర్చేవిగా ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు. రష్యా నుండి ఇండియా చమురు కొనుగోళ్లను తక్షణమే నిలిపివేయాలనీ.. లేనిపక్షంలో భారత్‌పై భారీగా టారిఫ్‌ల భారం పెంచుతామంటూ ట్రంప్ చేసిన హెచ్చరిక, ఆ తరువాత ఇచ్చిన తాత్కాలిక మినహాయింపులు కూడా మోడీని పొలిటికల్ గా డిఫెన్స్ లో పడేసేలాగే ఉననాయని అంటున్నారు. వీటన్నిటినీ మించి.. ఇటీవల ఒమన్ తీరంలో భారత నౌకపై అమెరికా దళాలు జరిపిన దాడి మోడీ ప్రతిష్ఠను మరింత డ్యామేజీ చేసిందంటున్నారు. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఇండియన్ నావికుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకునే విషయంలో భారత దౌత్యాధికారులు ఇంకా స్పందించకపోవడంపై ఆ నౌక కెప్టెన్ విడుదల చేసిన వీడియో మెడీ ప్రతిష్ఠను మసకబార్చేలా ఉందని పరిశీలకులు అంటున్నారు. అమెరికా, అ దేశాధ్యక్షుడు ట్రంప్ చర్యలు, విధానాలపై మోడీ మౌనం ఆయన ఇమేజ్ డ్యామేజ్ కావడానికి కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడిగా ఉన్న డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న కొన్ని వివాదాస్పద విదేశీ విధానాలు, నిర్ణయాల వల్ల ఇండియా ప్రధాని మోడీ ఇమేజ్ సన్నగిల్లుతోందన్న చర్చ రాజకీయవర్గిల్లో జోరుగా సాగుతోంది. ముఖ్యంగా అమెరికా విదేశాంగ విధానాలు, ఆర్థిక ఆంక్షలు మోడీ ప్రభుత్వ వ్యూహాలకు సవాల్‌గా మారుతున్నాయి.
http://www.teluguone.com/news/content/trump-policies-damage-modi-image-36-222944.html





