Publish Date:Jan 29, 2025
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దూకుడు చూస్తుంటే అమెరికా అగ్రరాజ్య హోదాకు ఆశలు వదిలేసుకోకతప్పదా అనిపిస్తున్నది. ఆయన వలసదారుల కబంధ హస్తాల నుంచి అమెరికాను విముక్తి చేస్తానంటూ ఎడాపెడా జారీ చేస్తున్న ఉత్తర్వులు, ఎగ్జిక్యుటివ్ ఆర్డర్లు ప్రపంచ దేశాలలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. జన్మతహ పౌరసత్వం విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయం కానీ, హెచ్1బి వీసాల విషయంలో అమలు చేస్తున్న ఆంక్షలు కానీ, ఇంకెంత మాత్రం ఇతర దేశాల నుంచి డాలర్ డ్రీమ్స్ తో అమెరికాకు వద్దామనుకునే వాళ్లను ఒకటికి పది సార్లు ఆలోచించేలా చేస్తున్నదనడంలో సందేహం లేదు.
ఇక తాజాగా ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికా పౌరులు ఆదాయపన్ను చెల్లించనవసరం లేదనీ, వారి ఆదాయపన్ను రద్దు చేస్తున్నాననీ ప్రకటించారు. అయితే అందువల్ల ఉత్పన్నమయ్యే ఆర్థిక లోటును భర్తీ చేయడానికి ఆయన ఎంచుకున్న మార్గమే.. ఇతర దేశాలు అనివార్యంగా అమెరికాకు దూరం జరగక తప్పని పరిస్థితిలోకి వాటిని నెట్టేస్తున్నది. ఇంతకీ ఆ అమెరికన్లకు ఆదాయపన్ను రద్దు చేసి.. ఆ నష్టాన్ని పూడ్చుకునేందుకు ట్రంప్ తీసుకున్న నిర్ణయమేంటంటే ఇతర దేశాలపై భారీగా సుంకం వసూలు చేయాలని. అమెరికా అలా అధిక సుంకం వసూలు చేయాలని నిర్ణయించుకున్న దేశాలలో ప్రధానంగా చైనా, ఇండియా, బ్రెజిల్ ఉన్నాయి.
భారత్ పట్ల ఆయన అక్కసు గతం నుంచీ తెలిసిందే. ఇటీవలి ఎన్నికలలో విజయం సాధించి ఇంకా అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టక ముందే ట్రంప్ భారత్ పై అక్కసు వెళ్లగక్కారు. అమెరికా దిగుమతులపై భారత్ అధికంగా పన్నులు వసూలు చేస్తోందంటూ ఆయన నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. విదేశాలపై పన్నులు విధించి అమెరికన్లకు ఆదాయపన్ను రద్దు చేయడం ద్వారా అమెరికా దేశస్థులను సంపన్నులుగా చేయడమే తన లక్ష్యంగా ట్రంప్ లక్ష్యంగా చెప్పుకుంటున్నారు. ఇందు కోసం ఆయన ఎక్స్ టర్నల్ రెవెన్యూ సర్వీస్ ప్రారంభించినట్లు కూడా ప్రకటించారు. ఇండియా నుంచి అమెరికా వెళ్లే ఉత్పత్తులపై భారీగా సుంకాలు పెంచడం వల్ల అమెరికా మార్కెట్ ను లక్ష్యంగా వ్యాపారం చేసే భారతీయులు తీవ్రంగా నష్టపోతారు. విదేశీయులపై కూడా సుంకం పెంచడమంటే అమెరికా లోని ఎన్నారైలు కూడా రిస్కు లో పడినట్లే.
ఇక ట్రంప్ నిర్ణయాలు చదువు కోసం అమెరికా వెళ్లిన, వెళ్లాలనకుంటున్న భారతీయులకు గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పాలి. ఇప్పటికే చదువుకోవడానికి అమెరికా వెళ్లిన భారతీయులు బయటకు రావడానికి భయపడుతున్నారు. పార్ట్ టైం జాబులు చేస్తే తమను అక్రమ వలసదారులంటూ దేశం నుంచి పంపించేస్తారని భయపడుతున్నారు. చదువుకోసం వెళ్లినవారు చదువు పూర్తికాగానే స్వదేశా లకు వెళ్లాలని హెచ్చరిస్తున్నారు. చదువుకుంటూ పార్ట్ టైమ్ జాబ్ లు చేయడం నిబంధనలకు వ్యతిరేకమంటూ వారిపై కొరడా ఝుళిపిస్తున్నారు. ఇక యూరోపియన్ దేశాలపైనా ట్రంప్ తన ప్రతాపం చూపుతున్నారు. డాలర్ ను కాదని యూరో కరెన్సీ అనే దేశాలపై వంద శాతం పన్నులు విధిస్తామని హెచ్చరించారు. ఇక చైనాకు అయితే గట్టి ఝలకే ఇచ్చారు. ట్రంప్ దూకుడు అమెరికాకు మేలు చేస్తుందా? నష్టం చేకూరుస్తుందా అన్న చర్చ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా జోరుగా సాగుతోంది. ఏది ఏమైనా ట్రంప్ నిర్వాకం వల్ల తొందరలోనే అమెరికా అగ్రరాజ్యం హోదా కోల్పోయే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/trump-attitude-put-america-in-trouble-39-192030.html
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.