తెరాసకు కాల్పుల సరదా జాడ్యమేమిటో?

Publish Date:Aug 15, 2022

Advertisement

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా నిర్వహించిన ఫ్రీడమ్ ర్యాలీ సందర్భంగా మంత్రి శ్రీనివాస గౌడ్ గాలిలోకి కాల్పులు జరిపిన సంఘటన సృష్టించిన వివాదం సద్దుమణగక ముందే టీఆర్ఎస్వీ నాయకులు గన్ తో గాలిలో కాల్పులు జరిపిన సంఘటన సంచలనం రేపింది.

ఈ సంఘటన ఎప్పుడు జరిగిందనేది స్పష్టం కాకపోయినా.. టీఆర్ఎస్వీ నాయకుడు ఆ కాల్పుల దృశ్యాలను తమ వాట్సప్ స్టేటస్ గా పెట్టుకోవడంతో వెలుగులోకి వచ్చింది. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిథిలోని మీర్ ఖాన్ పేట్ గెస్ట్ హౌస్ లో ఈ సంఘటన జరిగింది. టీఆర్ఎస్వీ నాయకులు విఘ్నేశ్వర్ రెడ్డి, విక్రమ్ రెడ్డిలు గాల్లోకి కాల్పులు జరిపి, వాటిని చిత్రీకరించి తమ వాట్సప్ స్టేటస్ గా పెట్టుకున్నారు.  

టీఆర్ఎస్ వీ నాయకులు అంతకు ముందు గెస్ట్ హౌస్ లో వేడుక చేసుకున్నారు. ఆ తర్వాత గన్ తో గాల్లోకి కాల్పులు జరిపారు. అయితే ఈ కాల్పుల సంఘటన ఎప్పుడు జరిగింద. వారు కాల్చింది ఎయిర్ గన్నా?  ఒరిజినల్ గన్నా? అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఇదంతా అధికార పార్టీకి చెందిన ఓ నేత గెస్ట్ హౌస్ లో నిర్వహించిన బర్త్ డే వేడుకలో జరిగినట్టు పోలీసులు గుర్తించడమే కాకుండా, ఆ దిశగా ఆధారాలు  సేకరించారు.  కాగా శ్రీనివాసగౌడ్ గాలిలోకి కాల్పులు జరిపిన ఉదంతం సృష్టించిన వివాదం సద్దుమణగక ముందే అటువంటిదే మరో సంఘటన వెలుగులోకి రావడంతో టీఆర్ఎస్ నేతలకు ఈ కాల్పుల సరదా జాడ్యమేమిటని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ పార్టీ అధికారంలో ఉంటే ఏం చేసినా చెల్లుబాటు అయిపోతుందన్న అహంకారమా అని ప్రశ్నిస్తున్నారు. కాల్సులు జరిపిన మంత్రి శ్రీనివాసగౌడ్ తో పాటు, టీఆర్ఎస్వీ నాయకులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

By
en-us Political News

  
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.