ముందస్తు ఎన్నికలకు కొద్ది రోజుల్లో నగారా మోగనుండగా, జగిత్యాలలో మాత్రం అప్పుడే జగడం మొదలైంది. తెరాస, కాంగ్రెస్ నాయకుల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఇరు పార్టీలు గెలుపే లక్ష్యంగా నువ్వానేనా అంటూ పోటీకి సిద్ధమయ్యాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం 13 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. గత ఎన్నికల్లో తెరాస 12 స్థానాల్లో విజయం సాధించింది. జగిత్యాలలో మాత్రం ఓటమి పాలైంది. దీంతో తెరాస జగిత్యాల మీద ప్రత్యేక దృష్టి పెట్టింది. పలు అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేసింది. ఎన్నికల సమీపిస్తుండంతో జీవన్‌రెడ్డి మీద విమర్శలు గుప్పించడంతో పాటు.. జగిత్యాలలో ఎలాగైనా పాగా వేయాలని తెరాస వ్యూహాలు రచిస్తోంది. అయితే జీవన్‌రెడ్డి తెరాసకు ధీటుగా మాటకు మాట సమాధానం చెప్తున్నారు. మరోవైపు ఆయన గెలుపై ధీమాగా ఉన్నారు.
గత ఎన్నికల్లో జగిత్యాలలో జీవన్‌రెడ్డి గెలుపొందగా.. తెరాస రెండవ స్థానంలో నిలిచింది. ఇక టీడీపీ అభ్యర్థి ఎల్.రమణ మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. మహాకూటమి పేరుతో కాంగ్రెస్, టీడీపీ దగ్గరయ్యాయి. దీంతో మరింత బలం పెరిగింది. ఇప్పుడు జీవన్‌రెడ్డి మహాకూటమి అభ్యర్థిగా బరిలోకి దిగుతుండటంతో.. మళ్ళీ ఆయనే గెలిచే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే తెరాస మాత్రం జీవన్‌రెడ్డికి చెక్ పెట్టాలని పావులు కదుపుతోంది. నాలుగేళ్లుగా జగిత్యాలలో ఎంపీ కవిత అన్నీ తానై తెరాస పార్టీని నడిపిస్తూ వస్తున్నారు. దీంతో ఆమె జీవన్‌రెడ్డిని ఎలాగైనా ఓడించి తెరాస జెండా ఎగరేయాలని చూస్తున్నారు. మరి తెరాస వ్యూహాలు తట్టుకొని జీవన్‌రెడ్డి మళ్ళీ జగిత్యాలలో విజయం సాధిస్తారో లేదో చూడాలి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/trs-targets-jeevan-reddy-in-2019-elections-39-83678.html
ప్రజాసమస్యలపై అధికారులతో చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు.
ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో శుక్రవారం జరగనున్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.
తెలుగువన్ ఎండి రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ లు తాజాగా వ్యవస్థల పతనం, అందుకు కారణాలపై తమ ఆవేదనను సూటిగా ఎలాంటి శషబిషలూ లేకుండా వ్యక్త పరిచారు.
మోకిల నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ కారు మీర్జాగూడ వద్ద అదుపు తప్పి తొలుత డివైడర్ ను ఆ తరువాత చెట్టును ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతులు, క్షతగాత్రులు అందరూ విద్యార్థులే.
ఇటీవల అనారోగ్యంతో మరణించిన టీడీపీ నేత అప్పలనాయుడు కుటుంబాన్ని మంత్రి లోకేష్ పరామర్శించారు.
ఐదేళ్ల పాటు ఢిల్లీలో చక్రం తిప్పారు. కవిత ఎడ్యుకేటెడ్ కావడం, హిందీ కూడా బాగానే మాట్లాడగలగడంతో జాతీయ స్థాయి ప్రతినిథిగా ఉండేవారు. అయితే కవిత రెండో సారి ఎంపీగా గెలవలేక పోయారు
ఖమ్మంలో బీఆర్‌ఎస్‌కు భారీ షాక్ తగిలింది.
పైరసీ, కాపీ రైట్ ఉల్లంఘనలు, అక్రమ ప్రసారాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పలు అంశాలు విచారణలో వెలుగు చూసిన నేపథ్యంలో ఐబోమ్మ రవికి బెయిలు మంజూరు చేయవద్దంటూ పోలీసులు కోర్టుకు తెలిపారు.
ఈ విమానాశ్రయం కోసం పార్లమెంటులో తాను పలుమార్లు గట్టిగా గళమెత్తానని చెప్పుకున్నారు. ఇప్పుడూ విమానాశ్రయం దాదాపుగా పూర్తై.. త్వరలో ఆపరేషన్స్ ప్రారంభం కావడానికి రెడీ అవుతుండటం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే తప్ప ఈ విమానాశ్రయం విషయంలో జరుగుతున్న రాజకీయ రచ్చ గురించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. అలాగే ఈ విమానాశ్రయానికి రెండో సారి శంకుస్థాపన చేసిన జగన్ ఊసెత్తలేదు.
తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతోంది.
ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార డీఎంకే, బీజేపీతో పొత్తు ఉపయోగించుకుని రాష్ట్రంలో అధికారపగ్గాలు చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీ స్థాపించి సినీ రంగం నుంచి రాజకీయరంగంలోకి దూకిన హీరో విజయ్ తన టివీకే పార్టీ తరఫున ఒంటరిగా ఎన్నికల రణరంగంలోకి దిగనున్నారు.
రండవాణేలోని కల్మాడీ హౌస్‌లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత సాయంత్రం మూడున్నర గంటలకు పుణెలోని వైకుంఠ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.