గులాబీ పెద్ద‌లకు ఐటీ రైడ్స్‌ ఫీవర్...

Publish Date:Mar 24, 2022

Advertisement

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విసిరిన సవాలును కేంద్ర దర్యాప్తు సంస్థలు సీరియస్’గా తీసుకున్నాయా? ముఖ్యమంత్రి ఈ మధ్య కాలంలో ఒకటికి పది సార్లు,ఈడీ లేదు బోడీ లేదు ఎవరొస్తారో రండి, మోస్ట్ వెల్కమ్’ అంటూ మీడియా సమావేశాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థలకు స్వాగతం పలికారు. సవాలు విసిరారు. బహుశా, ముఖ్యమత్రి ఇన్విటేషన్ కమ్ ఛాలెంజ్’ ని   ఇన్కమ్ టాక్స్ (ఐటీ) అధికారాలు స్వీకరించారో ఏమో కానీ, గత కొన్ని రోజులుగా, రాష్ట్రంలో, అనేక  కన్స్ట్రక్షన్ కంపెనీలలో సోదాలు జోరుగా సాగుతున్నాయి. నిజమే, కన్స్ట్రక్షన్ కంపెనీలలో ఐటీ అధికార్లు సోదాలు చేయడం సహజమే, అయినా, ఇప్పుడు ఐటీ సోదాలు చాలా సెలెక్టివ్’గా జరుగుతున్నట్లు అధికార తెరాస నాయకులు అనుమానిస్తున్నారు.

ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న కన్స్ట్రక్షన్ కంపెనీలు చాలా వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబానికి సన్నిహితులుగా, ఇంకా చెప్పాలంటే ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల బినామీలుగా అనుమానిస్తున్న వ్యక్తుల కంపెనీలు కావడంతో, తెరాస నాయకులలో వణుకు మొదలైంది. ముఖ్యమంత్రి సవాలును కేంద్ర దర్యాప్తు సంస్థలు సీరియస్’గా తీసుకున్నాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అన్నిటికంటే ముఖ్యంగా, కేఎన్ఆర్ కన్‌స్ట్రక్షన్ కంపెనీలో ఐటీ అధికారులు నిర్వహించిన సోదాల్లో, ‘విలువైన’ ఆధారాలు దొరికినట్లు తెలుస్తోంది. హైదరాబాద్, ఢిల్లీ, వరంగల్ సహా రాష్ట్రంలోపల, రాష్ట్రం వెలుపల ఉన్న కేఎన్ఆర్ కన్‌స్ట్రక్షన్ కార్యాలయాలు అన్నింటిలో ఒకే సారి నిర్వహించిన ఐటీ అధికారాలు  విలువైన డాక్యుమెంట్లు, నగదును సీజ్ చేశారని సమాచారం. ఒక్క కేఎన్ఆర్’ మాత్రమే కాదు, కేఎన్ఆర్’తో పాటుగా నాలుగైదు కంపెనీలపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు.
ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన కన్‌స్ట్రక్షన్ కంపనీలు అన్నీ టీఆర్ఎస్ నేతలు లేదా వారి కుటుంబ బినామీల కంపెనీలు కావడం ఒక  ఆసక్తికర ఫ్లాష్ పాయింట్. 

అయితే, సోదాలు జరిగిన కన్స్ట్రక్షన్ కంపెనీలు అన్నీ, పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని విపక్షాలు ఆరోపిస్తున్న, కాళేశ్వరం, పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టు మిషన్ భగీరధ, మిషన్ కాకతీయ కాంట్రాక్టర్లు, సబ్-కాంట్రాక్టర్లు కావడం మరో ఫ్లాష్’పాయింట్’గా చూస్తున్నారు. రిజర్వాయర్లు, ఎత్తిపోతల కాల్వలు, పైపులైన్లు, టన్నైల్పనులు చేస్తున్న సంస్థలే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. ఒక్కో సంస్థ రూ. రెండు వేల కోట్ల వరకూ పనులు చేస్తున్నారు. ఇందులో కేఎన్ఆర్ ఇన్ఫ్రతో పాటుగా , గజ ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్, ఆర్‌వీఆర్, జీవీఆర్ వంటి కంపెనీల్లో పెద్ద ఎత్తున సోదాలు జరగడంతో ఐటీ అధికారులు పెద్ద చేపకే వలేసినట్లు అనుమనిస్తునారు. నిజానికి రాష్ట్రంలో జరుగతున్న ఐటీ సోదాలకు మీడియాలో పెద్దగా ప్రచారం లేకపోవడం కూడా, ఐటీ అధికారుల టార్గెట్ పే...ద్ద చేపను పట్టుకునేందుకే అనే అనుమానాలకు మరింత బలాన్ని చేకూరుస్తోందని అంటున్నారు. అలాగే, ఇలా సోదాలు మొదలవగానే ముఖ్యనేత‌ దేశం వదిలిపోవడం కూడా అనుమానాలకు బలం చేకురుస్తోందని అంటున్నారు.
 
ముఖ్యమంత్రి కేసీఆర్ ఐటీ సోదాలకు, ఈడీ కేసులకు భయపడేది లేదని, అలా భయపడితే 15 ఏళ్ళు ఉద్యమం ఎలా చేస్తామని అంటున్నారు. అయితే, అప్పుడు కేసీఆర్ ఉద్యమంలో ఉన్నారు. ప్రజలు ఇచ్చిన పదీపరక చందాలతో ఉద్యమం నడుపుతున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో వేల లక్షల కోట్ల ప్రజాధనం ఆయన చేతుల్లో వుంది. అప్పుడు ఉద్యమం ఆయన వెంటుంది. ఇప్పుడు ఆయన వెంట పడుతోంది. వేటాడుతోంది.  అదీగాక, 2014 ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే, కేసీఆర్ స్వహస్తాలతో ఉద్యమ పార్టీని సమాధి చేశారు. ఇక తెరాస ఫక్తు 16 అణాల రాజకీయ పార్టీ అని ప్రకటించారు. గడచిన ఎనిమిదేళ్ళలో పార్టీలో ఉద్యమ ఆనవాళ్ళు కూడా లేకుండా, తలసాని, ఎర్రబెల్లి, సబితమ్మలతో తుడిచేశారు, సో ... ఇంకా ఉద్యమం గురించి మాట్లాడే అర్హతే ఆయనకు లేదని ఉద్యమ నాయకులు అంటున్నారు. ఏదైనా, ఐటీ సోదాలు,తెరాసలో వణుకు పుట్టిస్తున్నాయి, అనేది మాత్రం కాదనలేని నిజం అంటున్నారు.

By
en-us Political News

  
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.