బాణోత్ చంద్రావ‌తికి టీఆర్ ఎస్ పెద్ద‌ల మ‌ద్ద‌తు ?!

Publish Date:Jul 10, 2022

Advertisement

రాజ‌కీయాల్లో చిత్ర‌విచిత్రాలు జ‌రుగుతుంటాయి. కొంద‌రు ప‌నిగ‌ట్టుకుని వ‌స్తారు. కొంద‌రు త‌ప్ప‌నిస్థితిలో వ‌స్తారు. ఇంకొంద‌రు సీనియ‌ర్ల స్పూర్తితో వ‌స్తారు. బాణోత్ చంద్రావ‌తి త‌ప్పని స్థితిలో రాజ‌కీయ‌రంగ ప్ర‌వేశం చేశారు. ఆమె మెడిసిన్ చ‌దివారు. ప్రాక్టీస్ కూడా ఆరంభించాక వూహించ‌ని విధంగా ఆమె రాజకీయాల్లోకి వ‌చ్చారు. 2009లో సీపీఐ అభ్య‌ర్ధిగా ఖ‌మ్మం జిల్లా వైరా నుంచి పోటీ చేసి గెలిచారు. అప్ప‌ట్లో విద్యాధికురాలుగా అంద‌రి అభిమానం చూరగొన్నారు. అందువ‌ల్ల సునాయాసంగానే గెలిచారామె. త‌ర్వాత తెలం గాణా ఏర్ప‌డిన‌పుడు ఆమె టిఆర్ ఎస్‌లో చేరారు. తెలంగాణా ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ స‌భ్యురాలయ్యారు. 

 2014లో వైసీపీ నుంచి వైరా అభ్యర్థిగా పోటీ చేసిన మదన్‌లాల్‌ విజయం సాధించిన అనంతరం తెరాసలో చేరారు. ఇక 2018 డిసెంబర్‌ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన రాములునాయక్‌ అనూహ్యంగా విజయం సాధించి అనంతరం తెరాసలో చేరారు. ఇలా మాజీలు అందరూ ఒకే గూటికి చేరి, టికెట్‌ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి. గత జూన్‌ 11న ఖమ్మంలో పర్యటించిన తెరాస కార్య నిర్వహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ వచ్చే ఎన్నికల్లో చాలా మంది సిట్టింగ్‌లకు టికెట్‌ దక్కదన్న విషయాన్ని కుండబద్ధలు కొట్టినట్టు చెప్పారు. దీంతో తీవ్రమైన నిరాశా నిస్ఫృహలకు గురైన ఎమ్మెల్యే రాములునాయక్‌ , అనంతరం జరిగిన పలు సభల్లో కాంగ్రెస్‌ పార్టీని, పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డిని పొగడ్తల్లో ముంచెత్తారు. తనకు టిఆర్ ఎస్ టికెట్‌  దక్క దన్న ఆవేదన రాములు నాయక్‌ మాటల్లో వ్యక్తమైంది. దీంతో పాటు మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్‌ సైతం అనుకున్నంత ఉత్సా హంగానూ కనిపించడం లేదు.

 మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరునిగా 2014లో వైసీపీ టికెట్‌ సంపాదించి, అనంతరం జరిగిన ఎన్నికల్లో గెలిచారు. అయితే టీఆర్ ఎస్‌లో చేరాక తనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి రాజకీయంగా అండగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డికి దూరమయ్యా రు. అదే సమయంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు సన్నిహితునిగా మారారు. ఓటమి పాలైనప్పటికీ నియోజక వర్గంలో చురుగ్గా పర్యటిస్తూ వచ్చే ఎన్నికల్లో తెరాస టికెట్‌ తనదేనని, తన గెలుపు నల్లేరుపైన నడకేనని ఆయన చెబుతున్నా రు. దీంతో ఈసారి వైరా అసెంబ్లీ స్థానానికి తెరాస తరపున ముగ్గురు పోటీపడే పరిస్థితి ఉంది. మరి ఎవరికి టికెట్‌ లభిస్తుందో,  ఎవరు మరోసారి ఎమ్మెల్యేగా శాసనసభలోకి అడుగుపెడతారో తేలాల్సి ఉంది.ఈ మధ్య కాలంలో తరచుగా నియోజకవర్గంలో చురుగ్గా కార్యక్రమాల్లో పాల్గొంటున్న బాణోత్‌ చంద్రావతి టిఆర్ ఎస్‌ తరపున వచ్చే ఎన్నికల్లో తానే అభ్యర్థిని అని చెప్పుకుంటున్నారు.

ఈమేరకు మంత్రి కేటీఆర్‌ స్పష్టమైన హామీ ఇచ్చినట్టు ఆమె చెప్పుకుంటున్నారు.   దీన్లో భాగంగానే ఆమె తన పర్యటినలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. స్వతహాగా సీపీఐ ఫ్యామిలీగా ముద్రపడిన చంద్రావతి కుటుంబం మాజీ ఎమ్మెల్యే, సీపీఐ సీనియర్‌ నేత పువ్వాడ నాగేశ్వర్​రావుకు సన్నిహితంగా ఉంటూ వస్తోంది.

దీంతో జిల్లాకు చెందిన మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ మద్దతు సైతం చంద్రవతికి దక్కే అవకాశం ఉంది. బహుశా ఆ ధీమా తోనే చంద్రవతి ఉండవ‌చ్చు.  పార్టీ తరపున ప‌నిచేస్తున్న పీకే ఇటీవల నిర్వహించిన సర్వేలో సుమారు నలభై మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు ఓడిపోయే అవకాశం ఉందన్న నివేదికలు పార్టీ అధినేతకు వెళ్లాయి. ఫలితంగా పార్టీకి భారంగా పరిణమించిన ఆయా ఎమ్మెల్యేలకు అక్కడ  స్థానికంగా సరైన ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు చెబుతున్నారు. ఆ ధీమాతోనే చంద్రవతి తన పని తాను చేసుకునిపోతున్నారు. ఇలా ఒకే స్థానం నుంచి ముగ్గురు ఆశావహులు బరిలోకి దిగేందుకు ఏర్పాట్లు చేసుకోవడం టిఆర్ ఎస్ కు తలనొప్పిగా మారే పరిస్థితి ఉంది.

By
en-us Political News

  
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.