బార్ అండ్ రెస్టారెంట్ పార్టీయేనా?.. బీఆర్ఎస్ ను స్వాగతిస్తూ మద్యం పంపిణీ చేసిన టీఆర్ఎస్ నేత

Publish Date:Oct 4, 2022

Advertisement

సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలలోకి ప్రవేశించనున్న వేళ.. టీఆర్ఎస్  నేతలలో ఉత్సాహం ఉరకలేస్తున్నది. దసరా రోజు అంటే బుధవారం (అక్టోబర్ 5)న కేసీఆర్ కొత్త జాతీయ పార్టీని ప్రకటించనున్న సంగతి తెలిసిందే. దీంతో టీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. ఆయన జాతీయ రాజకీయాలలోకి ఎంట్రీ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా సంబరాలు జరుగుతున్నాయి.  కేసీఆర్ నిర్ణయానికి మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ సంబరాలు చేసుకుంటున్నారు. పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే కొన్ని చోట్ల ఈ ఆనందం వెర్రితలలు వేసింది. ఈ ఉత్సాహం గతి తప్పింది.

వరంగల్ లో ఒక టీఆర్ఎస్ నేత కేసీఆర్ జాతీయ రాజకీయ ప్రవేశానికి ఆనందంతో ఉబ్బితబ్బిబైపోయి ఏకంగా మద్యం బాటిళ్లు పంచారు. ఈ పని ఆయనేం రహస్యంగా చేయలేదు.  ఒక ట్రాక్టర్ ట్రాలీలో మద్యం సీసాలను తీసుకువచ్చి  నడి రోడ్డు మీద అదేదో సామాజిక సేవలా.. మద్యం సీసాలను పంచారు. అంతేనా మద్యంలోకి మంచింగ్ కోసం ఇంటికి తీసుకెళ్లి కూరొండుకోండన్నట్లు కోళ్లనూ పంచారు. ఈ పంపిణీ అంతా ఆయన వెనుక రెండు కటౌట్లను పెట్టుకుని మరీ చేశారు. ఇంతకీ ఆ కటౌట్లు ఎవరివో తెలుసా.. ఒకటేమో సీఎం కేసీఆర్ ది. రెండోది ఆయన కుమారుడు మంత్రి కేటీఆర్ ది. ఆయన పంపిణీ చేస్తున్న మద్యం బాటిళ్లు, కోళ్లను తీసుకోవడం కోసం జనం క్యూలో నిలుచున్నారు.  ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతోంది.

ఈ మద్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిన టీఆర్ఎస్ నేత పేరు  రాజనాల శ్రీహరి. వరంగ్ కు చెందిన టీఆర్ఎస్ నేత.  తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెడు సందర్భంగా వరంగల్‌కు చెందిన టీఆర్ఎస్‌ నేత రాజనాల శ్రీహరి.. తమ నేత కేసీఆర్‌ ప్రధాని కావాలని ఆకాంక్షిస్తూ వరంగల్ చౌరస్తాలో సుమారు 200 మంది హమాలీ కార్మికులకు కోళ్లు, మద్యం సీసాలను ఉచితంగా పంపిణీ చేశారు.

అధికార పార్టీ నేతే మద్యం పంపిణీ చేయడం సర్వత్రా విమర్శలకు దారి తీస్తోంది. అయితే   టీఆర్ఎస్‌ నేతలు మాత్రం రాజనాల శ్రీహరి చర్యను సమర్ధిస్తున్నారు.  రాజనాల శ్రీహరి దసరా కానుకగా హమాలీలకు కోళ్లు, లిక్కర్ బాటిల్స్ ఇచ్చారని వెనకేసుకొస్తున్నారు.  

అయితే విపక్షాలు, స్థానికులు మాత్రం రాజనాల శ్రీహరి చర్యను తప్పుపడుతూ.. కేసీఆర్ జాతీయ పార్టీ బీఆర్ఎస్ ను వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల బార్ అండ్ రెస్టారెంట్ పార్టీ అనడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. మద్యం పంపిణీ ఘటనతో ఆమె విమర్శలు సరైనవేననిపిస్తోందని అంటున్నారు.

By
en-us Political News

  
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
రా బిడ్డా.. అసెంబ్లీకి’.. KTRకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్.!
భారతీయ రైల్వేలో ప్రయాణం చేయడానికి ప్రయాణికులు చాలా కాలం ముందే టికెట్లను రిజర్వ్ చేసుకుంటూ ఉంటారు.
తండ్రి అంటే పిల్లలకు ఉండే ప్రాణం, ఆప్యాయత ఎంతో గొప్పవి. కానీ ఆ ప్రేమ కొన్నిసార్లు ఊహకందని వింత నిర్ణయాలకు దారితీస్తుంది.
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో తీవ్ర కలకలం రేపిన ఉదంతంలో ఒకరు దారుణ హత్యకు గురయ్యారు.
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
జమ్మూకశ్మీర్‌‌లోని కతువా జిల్లాలో అత్యంత విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది.
హైదరాబాద్‌ నగరంలోని నిమ్స్‌ అదనపు మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నోరి లక్ష్మీ భాస్కర్‌పై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దర్యాప్తును ముమ్మరం చేసింది.
హైదరాబాద్‌లోని టెక్ హబ్ మాదాపూర్‌లో జరిగిన ఒక సంచలన ఘటన కలకలం రేపింది.
దేశవ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక కీలక ప్రకటన చేసింది
డేటింగ్ యాప్ ద్వారా పరిచయం.. పబ్‌కు తీసుకెళ్లి రూ.29 వేల బిల్లు.!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.