కేటీఆర్ ట్వీట్లపై తెరాసలో ఆందోళన

Publish Date:Jun 8, 2022

Advertisement

తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు, తెరాస అధ్యక్షుడు ఆయనే...అయినా,ఈరోజున అటు ప్రభుత్వం, ఇటు పార్టీ కూడా, ఐటీ మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారక రామా రావు, కనుసన్నల్లో పనిచేస్తున్నాయనే అభిప్రాయం రోజు రోజుకు బలపడుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర నాయకులు ఆయనే ముఖ్యమంత్రి, ఆయనే పార్టీ అధ్యక్షుడు అన్న విధంగా, ప్రవర్తించిన సందర్భాలు చాలనే ఉన్నాయి.

అలాగే, ఇటు మంత్రులు, అటు అధికారులకు అయన ట్విటర్’ పైనే ఆదేశాలు ఇవ్వడంపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తపరుస్తున్నాయి.  ఒక విధంగా చూస్తే, కేటీఆర్ తెలంగాణ డిఫ్యాక్టో ముఖ్యమంత్రి, తెరాస డిఫ్యాక్టో అధ్యక్షుడు అన్నా, ఎవరూ అభ్యంతరం చెప్పే పరిస్థితి లేదని, అటు ప్రతిపక్షాలే కాదు, స్వపక్ష నాయకుకులుం చివరకు అధికారులు కూడా అంగీకరిస్తున్నారు.సరే, అది ప్రస్తుతానికి అప్రస్తుత చర్చ, అధికార పార్టీ అంతర్గత వ్యవహారం. అయితే, ఒకప్పుడు ప్రామిసింగ్ లీడర్’ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఇప్పడు, ఎందుకనో,, ఏమైందో కానీ, ఇటు పార్టీకి, అటు ప్రభుత్వానికి సమస్యలు తెచ్చిపెడుతున్నారని, విపక్షాలకు అస్త్రాలను ఆయనే సప్లై చేస్తున్నారనే మాట, పార్టీలోనే వినిపిస్తోంది. ఒక విధంగా కేటీఆర్ సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నారనే రాజకీయ విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. 

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, గ్రేటర్‌ హైదరాబాద్‌ బీజేపీ కార్పొరేటర్లు, నగరానికి చెందిన ఇతర నేతలను ప్రత్యేకంగా ఢిల్లీకి ఆహ్వానించి, తమ అధికార నివాసంలో వారితో సమావేసమయ్యారు. గతంలో ప్రధాని హైదరాబాద్ వచ్చిన సమయంలో, జీహెచ్ఎంసి కార్పొరేటర్లు,ఇతర నగర నేతలను కలవవలసి ఉన్నా అప్పుడు సమయాభావం వల్లనో ఏమో అందరినీ కలవలేక పోయారు. ఈ నేపధ్యంలో, కార్పొరేటర్లు ఇతర నేతలను ఢిల్లీకి పిలిపించుకుని వారితో, సుమారు గంటన్నర సేపు సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా  ప్రతి ఒక్కరినీ ప్రధాని పరిచయం చేసుకొని వారి కుటుంబ పరిస్థితులు, పిల్లల చదువులు, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పార్టీ పటిష్టత కోసం కృషి చేయాలని వారికి సూచించారు. రాష్ట్రంలో బీజేపీకి సానుకూల పవనాలు వీస్తున్నాయని, ఈ దశలో మరింత కష్టపడితే సునాయాసంగా అధికారంలోకి వస్తామని చెప్పారు.

నిజానికి ఇది, బీజేపీ అంతర్గత వ్యవహారం. ప్రభుత్వానికి సంబందించిన విషయం కానే కాదు. అయితే, మంత్రి కేటీఆర్ బీజేపీ పుట్టలో వేలు పెట్టారు. కార్పొరేటర్లు కమ్యూనిటీ సేవ చేయాలన్న ప్రధాని వ్యాఖ్యలను, ఎక్కడ నుంచి పట్టుకున్నారో, ఏమోకానీ, పట్టుకున్నారు. అదేదో మహాపరాధం అయినట్లు తప్పుబట్టారు. మోడీజీ మీరు ప్రభుత్వాన్ని నడుపుతున్నారా? లేక ఎన్జీవోనా?   అంటూ ట్విటర్ వేదికగా ప్రశ్నించారు.హైదరాబాద్‌ గతంలో ఎన్నడూలేని రీతిలో భారీ వరదలను ఎదుర్కొందని, కానీ ప్రధాని మోడీ ఒక్క రూపాయి కూడా ఆర్థిక సాయం చేయలేదని కుడా మంత్రి ప్రశ్నించారు.అఫ్కోర్స్, ఇతర విషయాలు కూడా ప్రస్తవించారు అనుకోండి అది వేరే విషయం. 

ఇప్పుడు కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలపై, బీజేపీ నాయకులు విరుచుకు పడుతున్నారు. తెరాసలోనూ చర్చ మొదలైంది. నగర కార్పొరేటర్లు, ప్రజా ప్రతినిధులు కమ్యూనిటీ సేవ చేయాలనడం ఏ విధంగా తప్పని ప్రశ్నిస్తున్నారు. రాజకీయ నాయకులు  ప్రజను దోచుకోవాలే కానీ, ప్రజలకు సేవ చేయ రాదా? అని ప్రశ్నిస్తున్నారు. ప్రతి విషయాన్ని రాజకీయ, వ్యాపార దృక్పథంతో చూడడం, అన్నిటికీ అదే మందు ‘జిందా తిలస్మాత్’ అన్నట్లుగా, కేద్రంపై విరుచు పడడం చూస్తుంటే, ఆయనకు, బీజేపీ, మోడీ ఫోబియా  పట్టుకుందని అనిపిస్తోందని, బీజేపీ నాయకులు అంటున్నారు. మరోవంక, కేటీఆర్ చేస్తున్న తొందరపాటు ట్వీట్లు, తమకు తలనొప్పులు తెస్తున్నాయని తెరాస నాయకులు కూడా తలలు పట్టుకుంటున్నారు. కేంద్ర, రాష్ట్ర సంబంధాలంటే కేవలం నిధులు ఇచ్చిపుచుకోవడమేనా, అని ప్రశ్నిస్తున్నారు. విషయం ఏదైనా కేంద్రం ఏమీ చేయలేదు, ఏమీ  ఇవ్వలేదు, చిప్పలో చిల్లిగవ్వ రాల్చలేదు అని విరుచుకు పడడం, వాపోవడం రాష్ట్ర ప్రభుత్వ డొల్లతనాన్ని బయట పెడుతోందని సొంత పార్టీ నేతలే చిరాకు పడుతున్నారు. 

అలాగే, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సిఎస్ఆర్) గురించి అనేక సందర్భాలలో స్వయంగా కేటేఆర్ మాట్లాడారు.అంతేకాదు, ఆయనే స్వయంగా ఎమ్మెల్యేలు, ఎపీలు ఇతర పార్టీ నాయకులను ప్రోత్సహించి, అంబులెన్సులలని విరాళంగా సేకరించారు. అదే విధంగా, కొవిడ్ సమయంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఒకటి రెండు నెలల జీతాలను ముఖ్యమంత్రి, ప్రధాని సహాయ నిధిని విరాళంగా ప్రకటించారు.

అదే విధంగా ప్రధానమంత్రి తమ పార్టీ కార్పొరేటర్లు సేవా భావంతో పని చేయాలని చెపితే చెప్పారేమో, అందులో తప్పేముందని, తెరాస నాయకులు కూడా విస్మయం వ్యక్తపరుస్తున్నారు. ఈమధ్య కేటీఆర్, తొందరపడి చేస్తున్న ట్వీట్లు తమకు తల నొప్పులు తెస్తున్నాయని అంటున్నారు. 

మరోవంక నిజానికి ప్రధాన మంత్రి కార్పొరేటర్లతో ఏమి మాట్లాడారు, ఏమి మాట్లాడలేదు అనే విషయాన్ని, పక్కన పెట్టి, దేశ ప్రధాని నగర కార్పొరేటర్లకు అంత సమయం కేటాయించడం నుంచి తెరాస నాయకత్వం నేర్చుకోవలసింది చాలా ఉందని రాజకీయ విశ్లేషుకులు అంటున్నారు. ముఖ్యమంత్రి మంత్రులకు కూడా అప్పాయింట్మెంట్ ఇవ్వరని, ప్రగతి భవన్’ గేట్లు కూడా తెరుచుకోక, తానూ. హరీష్ రావు సహా మరి కొందరు   మంత్రులు గేటు వద్ద ఏడ్చిన సందర్బాలు ఉన్నాయని. గతంలో  ఈటల చేసిన విమర్శలు హుజురాబాద్ ఉప ఎన్నికలలో ప్రభావం  చూపిన విషయాన్ని మరిచి పోరాదని అంటున్నారు. నిజానికి, ప్రస్తుతం రాష్ట్రంలో వీస్తున్న తెరాస వ్యతిరేక పవనాలకు, ఇది కూడా ఒక కారణమని, విశ్లేషకులు పేర్కొంటున్నారు.

By
en-us Political News

  
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.