జూబ్లీ బరిలో టీఆర్ఎస్.. బీఆర్ఎస్ కు షాక్!

Publish Date:Oct 13, 2025

Advertisement

జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో విజయం సాధించి, సిట్టింగ్ సీటును నిలుపుకుని రాష్ట్ర రాజకీయాలలో తన సత్తా చాటడానికి సర్వశక్తులూ ఒడ్డి సమాయత్తమవ్వడానికి సిద్ధమౌతున్న బీఆర్ఎస్ కు గట్టి షాక్ ఇవ్వడానికి టీఆర్ఎస్ రంగంలోకి దిగింది. అదేంటి టీఆర్ఎస్ పేరు మార్చుకుని బీఆర్ఎస్ అయ్యింది కదా? మళ్లీ టీఆర్ఎస్ బరిలోకి దిగడమేంటని అనుకుంటున్నారా? ఔను తెలంగాణ రాజకీయాలలో తెలంగాణ రక్షణ సమితి-డెమొక్రట్ (టీఆర్ఎస్-డి)అనే పార్టీ జూబ్లీ బరిలో అభ్యర్థిని నిలబెట్టబోతున్నది. 

బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు జాతీయ రాజకీయాలలోకి ప్రవేశించే లక్ష్యంతో టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చిన సంగతి తెలిసిందే. అయతే పార్టీలోంచి తెలంగాణ పేరును అయితే తీసేశారు కానీ, ఆయన రాజకీయాలు మాత్రం తెలంగాణను దాటి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. కానీ తెలంగాణ పేరును పార్టీ పేరు లోంచి తీసేసిన తరువాత కేసీఆర్ జాతీయ రాజకీయ ఆకాంక్షల సంగతి పక్కన పెడితే.. తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రాజకీయాలకూ దూరమయ్యారు. 2023 ఎన్నికలలో ఓటమి తరువాత ఆయన జనం ముందుకు వచ్చి మాట్లాడిన సందర్భాలను వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. 

 సరే ఇప్పుడు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, మరో మాజీ మంత్రి హరీష్ రావులు.. బీఆర్ఎస్ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని రాష్ట్రంలో బీఆర్ఎస్ ను ముందుకు తీసుకుపోవడానికి, ప్రజలలో పార్టీ పట్టును పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు.  జూబ్లీ ఉప ఎన్నికలో విజయం లక్ష్యంగా పార్టీని సమాయత్తం చేస్తున్నారు.   ఈ పరిస్థితుల్లో జూబ్లీ ఎన్నికలో అభ్యర్దిని నిలబెట్టడానికి టీఆర్ఎస్ -డి  రెడీ అవ్వడం బీఆర్ఎస్ కు మింగుడు పడటం లేదు.   

అవును జూబ్లీ బైపోల్ లో టీఆర్ఎస్-డి రంగంలోకి దిగుతోంది. పార్టీ అభ్యర్థిగా కంచర్ల మంజూష అనే మహిళను రంగంలోకి దింపబోతున్నది. ఈ విషయాన్ని టీఆర్ఎస్-డి అధ్యక్షుడు నరాల సత్యనారాయణ సోమవారం (అక్టోబర్ 13) ప్రెస్ క్లబ్ లో పార్టీ జెండాను, వెబ్ సైట్ ను ఆవిష్కరించి, మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ ప్రకటించారు.   తెలంగాణ ప్రజల ఆశయాలకు ఆకాంక్షలకు అనుగుణంగా టీఆర్ఎ్ -డి లోగో రూపకల్పన చేశామన్న సత్యనారాయణ   జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో టీఆర్ఎస్-డి అభ్యర్థిగా తమ  పార్టీ  కార్యనిర్వాహక అధ్యక్షురాలు   కంచర్ల మంజూషను ప్రకటించారు. 

ఇక టీఆర్ఎస్-డి పార్టీ లోగో, జెండా అన్నీ బీఆర్ఎస్ ను పోలి ఉన్నాయి. గులాబి రంగు, జెండా, గుర్తు అన్నీ బీఆర్ఎస్ ను పోలి ఉండటంతో బీఆర్ఎస్ క్యాడర్ లో ఆందోళన వ్యక్తం అవుతోంది. టీఆర్ఎస్ -డి అభ్యర్థి జూబ్లీ బైపోల్ లో రంగంలోకి దిగితే తమ విజయావకాశాలకు గండి పడటం ఖాయమన్న ఆందోళన బీఆర్ఎస్ వర్గాలలో వ్యక్తం అవుతోంది.    

By
en-us Political News

  
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.
ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అని కుండబద్దలు కొట్టారు. ఆ విషయాన్నే తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష  నాయకురాలు తారాహై కత్‌బర్ట్  మరింత క్లారిటీ ఇస్తూ.. విజయ్ ప్రధాని అవుతారంటూ కొందరు ప్రచారం చేయడం కేవలం టీవీకే శ్రేణుల ఉత్సాహం వల్ల జరుగుతున్న ప్రచారమే తప్ప, అది ఆ పార్టీ అధికారిక వైఖరి కాదన్నారు.
రాజకీయ క్షేత్రంలో ముందస్తు ఊహాగానాలు, భవిష్యత్ ఎన్నికల అంచనాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి. ఈ నేపథ్యంలో సపోజ్ ఫర్ సపోజ్  ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందన్న చర్చ జోరందుకుంది. రానున్న  రాజకీయ సమీకరణాలపై   చర్చోపచర్చలు మొదలయ్యాయి.
కొండా సురేఖపై వేటు తప్పదనీ, ఆమెకు క్యాబినెట్ నుంచి ఉద్వాసన తప్పదన్న ప్రచారం జోరుగా సాధింది. ఒక దశలో రేవంత్ కేబినెట్ లోకి సురేఖ స్థానంలో మరో ఫైర్ బ్రాండ్ నాయకురాలు విజయశాంతిని తీసుకోనున్నట్లు కూడా వార్తలు వినిపించాయి. 
 ప్రభుత్వ మద్దతుతో జరిగే ఏకగ్రీవ ఎన్నికలు ఉంటాయన్న ఆయన రాజకీయ పార్టీ కోణంలో ఏకగ్రీవాలు ఉండకూడదని జగన్ అన్నారంటూ బొత్స  వివరణపై వైసీపీ నేతలు పెదవి విరుస్తున్నారు.
బహదూర్‌పురా నియోజకవర్గ ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్‌ను రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) నియమించింది.
ఇండియా టుడే-సి ఓటర్ సర్వే అంచనాల ప్రకారం.. మొత్తం 25 లోక్‌సభ స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి  20 పార్లమెంట్ స్థానాలను దక్కించుకుంటుంది.
 దువ్వాడ కుటుంబ వ్యవహారం రచ్చకెక్కి పార్టీ ప్రతిష్ఠ మసకబారే పరిస్థితి రావడంతో వైసీపీ అధినేత జగన్ తప్పని సరిపరిస్థితుల్లో  దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు వేశారు.   అయితే పేరుకే సస్పెన్షన్ తప్ప ఆయన ఇప్పటికీ వైసీపీ ఎమ్మెల్సీగానే చెలామణి అవుతున్నారు.
తెలుగుదేశం కూటమి సునాయాసంగా 20 స్థానాలను కైవసం చేసుకుంటుంది.   2024 ఎన్నికల ఫలితాలు పునరావృతమౌతాయిని ఇండియా టుడే సర్వే పేర్కొంది.
సొంత పార్టీ శాసనమండలి సభ్యుడిపై  మహిళల పట్ల అసభ్యకర ప్రవర్తన మరియు వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తడంతో, ఎమ్మెల్సీ రహమత్ బేగ్‌పై వేటు వేశారు.
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్  రాజకీయ సన్యాసం స్వీకరించబోతున్నారా? అంటే ఔనన్న సమాధానమే వస్తున్నది.   ప్రత్యర్థులపై విమర్శలతో విరుచుకుపడే అనిల్ కుమార్ యాదవ్, తాజాగా చేసిన వ్యాఖ్యలను బట్టి రాజకీయవర్గాలలో ఆయన పొలిటికల్ రిటైర్మెంట్ ప్రకటించబోతున్నారా అన్న చర్చ జోరందుకుంది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.