కాంగ్రెస్‌లో హ‌రీశ్‌రావు కిరికిరి!.. రేవంత్ దూకుడుకు బ్రేక్స్‌!?

Publish Date:Mar 21, 2022

Advertisement

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఏమి జరుగుతోంది?కాంగ్రెస్ పార్టీలో ఎవరిని అడిగినా ఈ ప్రశ్నకు సమాధానం ఇట్టే చెప్పేస్తారు. దేశంలో ఏమి జరుగుతోందో, రాష్ట్రంలోనూ అదే జరుగుతోంది. ఇంకో అడుగు ముందుకేస్తే, పంజాబ్’లో ఏమి జరిగిందో, తెలంగాణలోనూ అదే జరుగుతుందనే సమాధానమే వస్తోంది. జాతీయ కాంగ్రెస్ పార్టీలో, సుమారు రెండు సంవత్సరాల క్రితం రాజుకున్న జీ 21 అసమ్మతి కుంపటి ఇంకా, అలా రగులుతూనే వుంది. నిజానికి, కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి కొత్త కాదు. అసమ్మతి లేని కాంగ్రెస్ పార్టీని ఉహించుకోవడం కూడా అయ్యే పనికాదని రాజకీయ పండితులు ఎప్పుడోనే తేల్చి చెప్పారు. సో . కాంగ్రెస్ ప్రతిలో అసమ్మతి అంత పెద్ద ఇష్యూ కాదు. నిజానికి, రాష్ట్రాల్లో అసమ్మతి కత్తిరించడంఅధిష్టానానికి పేద పని కాదు. గతంలో ఇందిరా గాంధీ, హయాంలో మహామహులు అనుకున్న అమ్మత్తి నేతలనే అధిష్టానం సర్కస్’లో రింగ్ మాస్టర్ పులులు, సింహలను ఆడించినట్లు ఆడించిన సందర్బాలు చాలానే ఉన్నాయి.   

అయితే, ఇప్పుడు జాతీయ స్థాయిలో నాయకత్వం బలహీనమైన నేపధ్యంలో పరిస్థితి మరింతగా దిగాజరినట్లు కనిపిస్తోందని, సుదీర్ఘ కాలంలో పార్టీలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నిజమే, కాంగ్రెస్ పార్టీ ఇంత కంటే గొప్ప ఉపద్రవాలనే చూసింది. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కుంది. అయితే,  అప్పటికీ ఇప్పటికీ రాజకీయం, పూర్తిగా మారి పోయింది. ప్రత్యర్ధి బలం రోజురోజుకు పెరుగుతోంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో నాలుగు రాష్ట్రాలలో విజయం సాధించిన బీజేపీ, మోడీ బలం మరింతగా పెరిగింది.కాంగ్రెస్, పరిస్థితి ఏమిటో ప్రత్యేకించి చెప్పవలసిన పని లేదు.అధికారంలో ఉన్న  పంజాబ్ రాష్ట్రాన్ని వదులుకుని, మరింతగా బలహీనమైంది. మరో వంక దిద్దుబాటు చర్యలు కూడా  కనిపించడం లేదని, అందుకే, ప్రస్తుత సంక్షోభం నుంచి కాంగ్రెస్ పార్టీ బయట పడుతుందా , మళ్ళీ పూర్వ వైభవం పొందుతుందా అన్న సదేహం అందరినీ వెంటాడుతోందని విశ్లేషకులు అంటున్నారు.   

ఈ నేపద్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో తలెత్తిన సంక్షోభం పార్టీలో కలకలం రేపుతోంది. నిజానికి రేవంతి రెడ్డి పీసీసీ చీఫ్’ గా వచ్చినప్పటి నుంచి  పార్టీ సీనియర్లు అసమ్మతి స్వరం వినిపిస్తూనే ఉన్నారు. రేవంత్ రెడ్డికి అడుగడుగున సంక్షోభాలు ఎదురవుతూనే ఉన్నాయి. అయినా, ఇరు పక్షాలు తెగేవేరకు లాగకుండా జాగ్రత్త పడడం వలననైతే నేమి, ఇతరత్రా కారణాల వలన చేతనైతేనేమి టీపీసీసీలో తలెత్తిన సంక్షోభాలు, ఇంతవరకు,  టీ కప్పులో  తుపానులా సమసి పోతూ వచ్చాయి. అయితే ఇప్పుడు పార్టీ సీనియర్లు వరసగా నిర్వహిస్తున్న, ‘విదేయ’ సమావేశాలు మాత్రం అలా సులభంగా సమసిపోయే సంకేతాలు కనిపించడం లేదని అంటున్నారు. అగ్నికి ఆజ్యం తోడైనట్లుగా, కాంగ్రెస్ అంతర్గత కలహాలకు, తెరాస అవసరాలు ఆజ్యం పోస్తున్నాయి. 

కాంగ్రెస్ పార్టీలోని విబేధాలను మొదటి నుంచి చాల చక్కగా వినియోగించుకుంటున్న అధికార తెరాస, ఎన్నికల ముందు కాంగ్రెస్’ పార్టీని మరింతగా నిర్వీర్యం చేసేందుకు పావులు కదుపుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ టికెట్ మీద గెలిచిన 18 మంది ఎమ్మెల్యేలలో, 12 మందిని తమ వైపుకు తిప్పుకున్న తెరాస ఇప్పుడు మిగిలిన ఆరుగురిలో సగం మందిని అసమ్మతి పంచన చేర్చి తమాషా చూస్తోంది.  
ఇందులో భాగంగానే, మంత్రి హరీష్ రావును కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీహెచ్’ కలిశారని అదే విధంగా, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్’ జగ్గారెడ్డి కూడా, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులతో టచ్’ లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. నిజానికి, కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేసేందుకు, తెరాస కుట్రలు చేస్తోందని, రేవంత్ రెడ్డి వర్గం, బహిరంగంగానే ఆరోపిస్తున్నాయి.  ఇటీవల జగ్గారెడ్డి, వీహెచ్‌లతో హరీష్ రావు సీక్రెట్ మీటింగ్ నిర్వహించారని ఆ తర్వాతే వారు సొంత పార్టీపై వారు యుద్ధం ప్రకటించారన్న అభిప్రాయం వినిపిస్తోంది. అంతేకాకుండా ఓ వంక ఎల్లారెడ్డి పేటలో రేవంత్‌కు సభ జరుగుతున్న సమయంలోనే, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సమావేశం కావడం, రేవంత్ టార్గెట్’గా వ్యాఖ్యలు చేయడం, సవాళ్ళు విసరడం మరిన్ని అనుమానాలకు ఆస్కారం కల్పిస్తోందని అంటున్నారు. అయితే, ఈ అన్నిటికీ మూల కారణం  కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఎదుర్కుంటున్న సంక్షోభమే ఈ అన్నిటికీ మూల కారణమని అంటునారు. సో..  ఈ సంక్షోభం ఇప్పట్లో చల్లారదని, పార్టీ వర్గాలలో ఆందోళన వ్యక్త మవుతోంది.
 

By
en-us Political News

  
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.