Publish Date:Jun 14, 2022
‘ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్లు’ ఉందట తెలంగాణ సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ తీరు. తెలంగాణలో టీఆర్ఎస్ విజయావకాశాలు అంతంత మాత్రంగా ఉన్నాయని నివేదికలు స్పష్టం చేస్తుంటే.. దేశ రాజకీయాలలో చక్రం తిప్పుతానంటూ జాతీయ పార్టీ ఏర్పాటుకు కేసీఆర్ సన్నాహాలు చేయడంపై సొంత పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమౌతోంది. రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ఎదురు గాలి వీస్తోందన్న నివేదికలు స్వయంగా కేసీఆర్ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అటియాస్ పీకే బృందం రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేసి మరీ సమర్పించినవే.
ప్రశాంత్ కిశోర్ గత ఏడాది డిసెంబర్ నుంచి వరుసగా ఏడు దఫాలు సర్వే చేసి మరీ నివేదిక రూపొందించారు. ఆసర్వేలో కేసీఆర్ పార్టీకి వచ్చే ఎన్నికలలో గట్టి ఝలక్ తప్పదని తేలిందంటున్నారు. ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో టీఆర్ఎస్ పార్టీకి ఒక్కటంటే ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదని పీకే సర్వేలలో తేలిందని నివేదిక స్పష్టం చేసింది. పీకే తన బృందం చేసిన సర్వేల ఆధారంగా రూపిందించిన నివేదికను స్వయంగా కేసీఆర్ కు సమర్పించడమే కాకుండా.. పార్టీ బలా బలాలపై పూసగుచ్చినట్లు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించినట్లు ప్రగతి భవన్ వర్గాల భోగట్టా. ఆ నివేదిక ప్రకారం కేసీఆర్ కేబినెట్ లో కనీసం 11 మంది మంత్రులకు వచ్చే ఎన్నికల్లో పరాజయం తప్పదు. అన్నిటి కంటే టీఆర్ఎస్ ను, ఆ పార్టీ అధినేత కేసీఆర్ ను కలవరపెట్టే అంశమేమిటంటే మెజారిటీ స్థానాలలో పోటీ విపక్షాల మధ్యే ఉంటుందన్నది.
అంటే మెజారిటీ స్థానాలలో విజయం కోసం కాంగ్రెస్, బీజేపీలు హోరాహోరీ తలపడనున్నాయనీ, టీఆర్ఎస్ ది మూడో స్థానమేననీ పీకే నివేదిక స్పష్టం చేసిందని పార్టీ వర్గాల సమాచారం. కాగా రాష్ట్రంలో కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకుందనీ, బీజేపీ కంటే కాంగ్రెస్ పార్టీయే టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇస్తుందని ఇప్పటికే పరిశీలకులు పలు మార్లు విశ్లేషణలు చేశారు.
సిట్టింగ్ లను పక్కన పెట్టి కొత్త వారిని తెరమీదకు తీసుకువచ్చినా పెద్దగా ఫలితం ఉండదని పీకే సర్వే విస్పష్టంగా తేల్చేసింది. ఏతావాతా పీకే సర్వే సారాంశమేమిటంటే.. వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలో తెరాస మూడో స్థానానికి పరిమితమౌతుందని. అధికారం కోసం కాంగ్రెస్,బీజేపీల మధ్య పోటీ హోరాహోరీగా ఉంటుందని. దీంతో టీఆర్ఎస్ శ్రేణులలో కలవరం ప్రారంభమైంది. అందుకే జాతీయ పర్టీ, జాతీయ రాజకీయాలు అంటూ కేసీఆర్ రాష్ట్రాన్ని పట్టించుకోకపోవడంపై అసంతృప్తి పెల్లుబకుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/trs-confine-to-third-place-in-telangana-election-fight-between-congress-and-bjp-25-137649.html
డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఈరోజు మనకు గురువుగా ఉంటే ఏం చెప్పేవారు? విద్య, విలువలు, టెక్నాలజీ, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, దేశ భవిష్యత్తుపై ఆయన ఆలోచనలు ఈరోజు భారతదేశానికి ఎలా మార్గదర్శకంగా నిలుస్తాయి?
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!