Publish Date:Apr 27, 2022
అనుకున్నట్టే అయింది. టీఆర్ఎస్ ప్లీనరీ వేదికగా సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ప్రస్తావన చేశారు. అయితే, నేరుగా ఆ విషయం చెప్పకుండా పరోక్షంగా కాస్త క్లారిటీ ఇచ్చారు. భవిష్యత్తులో TRS పార్టీ BRS అయ్యే అవకాశం ఉన్నట్టు ఇండికేషన్ ఇచ్చారు.
పార్టీ ప్లీనరీలో సుదీర్ఘంగా మాట్లాడిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. వ్యూహాత్మకంగా BRS ప్రస్తావన తీసుకొచ్చారు. కారు పార్టీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ ఓ న్యూస్ పేపర్లో రాసిన వ్యాసాన్ని కోట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి-TRS ను.. భారతీయ రాష్ట్ర సమితి-BRS గా చేయాలని ఆ ఆర్టికల్‌లో ఎమ్మెల్యే కిశోర్ ప్రతిపాదించారని కేసీఆర్ గుర్తు చేశారు. ఇలాంటి అనేక ప్రతిపాదనలు వస్తున్నాయంటూ.. కావాలనే BRS పేరును కేసీఆర్ బహిరంగ వేదికగా ప్రస్తావించి చర్చకు తెర తీశారు.
కేసీఆర్ మదిలో కొత్త జాతీయ పార్టీ తీసుకురావాలనే ఆలోచన ఉంది కాబట్టే.. పార్టీ పేరు భారతీయ రాష్ట్ర సమితి-BRS గా ఉండే అవకాశం ఉందనేలా.. ముందస్తు లీకులు ఇచ్చారని అంటున్నారు. లేదంటే, ఓ ఎమ్మెల్యే ఏదో పేపర్లో చేసిన BRS ప్రతిపాదనను కేసీఆర్.. ప్లీనరీలో ప్రస్తావించే వారు కాదని అభిప్రాయపడుతున్నారు. అంటే.. త్వరలోనే కొత్త జాతీయ పార్టీ పెట్టడం ఖాయమని.. ఆ పార్టీ పేరు భారతీయ రాష్ట్ర సమితి-BRS గా ఉంటుందనే చర్చ మొదలైపోయింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/trs-as-brs-25-135053.html
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్
చేతిలో రూ.3 లక్షలు.. ఇప్పుడు రూ.100 కోట్ల బిజినెస్.!
కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ ప్రణాళికల్లో కీలక మార్పులు.. .!
కొందరు దుండగులు ఏకంగా జ్యువెలరీ షాప్‌నే టార్గెట్ చేశారు.
తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా అద్వైత్ కుమార్ సింగ్ ఐఏఎస్ పూర్తి అదనపు బాధ్యతలు (FAC) స్వీకరించారు