మద్యం కుంభకోణం జగన్ కు బిగుస్తున్న ఉచ్చు!?

Publish Date:Jun 13, 2026

Advertisement

తెలుగువన్ స్పెషల్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఈ తుఫాను రేపుతోంది. జగన్ ప్రభుత్వ హయాంలో జరిగినట్లుగా చెప్తున్న మద్యం కుంభకోణం వ్యవహారం ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో ఈడీ ఎంట్రీ ఇవ్వడమే కాకుండా, శరవేగంగా అరెస్టుల పర్వం వైపు అడుగులు వేయడం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది.   ఐటీ సలహాదారుగా పనిచేసిన రాజ్ కేసిరెడ్డిని, అలాగే ఏపీబీసీఎల్ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డిని ఈడీ అధికారులు మనీ లాండరింగ్ ఆరోపణలపై అరెస్ట్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఇద్దరి అరెస్టుతో ఈ కుంభకోణం తాలూకు మూలాలు ఎక్కడికి దారితీస్తున్నాయి, అంతిమంగా దీని ప్రభావం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పడబోతోందా అనే  విషయంపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో  విశ్లేషించారు. సాధారణంగా లోకల్ పోలీసులు లేదా సిట్ చేసే విచారణకు, కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన ఈడీ చేసే పరిశోధనకు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ ఈ కేసుపై సుమారు నాలుగు చార్జ్‌షీట్లు దాఖలు చేసి, 33 మందిపై అభియోగాలు నమోదు చేసింది. విచారణ ముగిసిందని సిట్ ప్రకటించినప్పటికీ..  అక్కడితో కథ ఆగిలేదు. ఆ నివేదికల ఆధారంగా ఈడీ రంగంలోకి దిగి కొత్తగా ఈసీఆర్ నమోదు చేసి లోతైన దర్యాప్తు ప్రారంభించింది. ఈడీ ఒకరిని అరెస్ట్ చేసిందంటేనే 80 శాతం కేసు నిర్ధారణ అయినట్లేనని రామకృష్ణ అన్నారు. మనీ లాండరింగ్ జరిగినట్లు పక్కా ఆధారాలు, డాక్యుమెంట్లు, డిజిటల్ ఎవిడెన్స్ లభిస్తేనే ఈడీ ఈ స్థాయి దూకుడు ప్రదర్శిస్తుందని వివరించారు.

ఈ కుంభకోణం తాలూకు ఆర్థిక మూలాలను పరిశీలిస్తే విస్తుపోయే నిజాలు వెలుగుచూస్తున్నాయన్నారు. గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 2014 నుండి 2019 మధ్య ఒక మద్యం కార్టన్ రవాణా చేయడానికి కాంట్రాక్ట్ ధర 13 రూపాయలుగా ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక సంపూర్ణ మద్యపాన నిషేధం అంటూనే..  మద్యం పాలసీని పూర్తిగా మార్చేశారు. కేవలం రవాణా చార్జీలనే ఏకపక్షంగా 13 రూపాయల నుండి  32 రూపాయలకు పెంచేశారు. అంటే ప్రతి కార్టన్‌పై 21 రూపాయల అదనపు భారాన్ని మోపారు. ఈ రవాణా గోల్‌మాల్ వల్లే ప్రభుత్వ ఖజానాకు సుమారు 400 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందని ఈడీ, సిట్ ప్రాథమికంగా లెక్క తేల్చాయి. అయితే ఇది కేవలం  పిల్ల స్కామ్  మాత్రమేనని, అసలు  పెద్ద స్కామ్ అయిన మొత్తం మద్యం కుంభకోణం విలువ సుమారు 3500 కోట్ల రూపాయల పైచిలుకే ఉంటుందని అంటున్నారు.  బలంగా ఆరోపిస్తున్నాయి. ఈ భారీ స్కామ్‌లో కేవలం ముడుపుల రూపంలోనే వేల కోట్ల రూపాయలు చేతులు మారాయని తెలుస్తోంది.

ఈ మొత్తం వ్యవహారంలో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే..  సిట్ దాఖలు చేసిన రెండవ చార్జ్‌షీట్‌లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరును ఐదు నుండి ఏడు సార్లు   ప్రస్తావించారు. అక్రమంగా ఆర్జించిన ఈ 3500 కోట్ల రూపాయల అవినీతి సొమ్ములో దాదాపు 70 శాతం మేర తాడేపల్లి ప్యాలెస్‌కే చేరిందని, ఆయనే దీనికి అంతిమ లబ్దిదారు,  అంతిమ దోపిడీదారు అని కేసులోని కొందరు ముద్దాయిలు వాంగ్మూలం ఇచ్చినట్లు తెలుస్తోంది. విజయసాయి రెడ్డి, మిధున్ రెడ్డి వంటి కీలక నేతల పేర్లు కూడా ఈ 33 మంది జాబితాలో వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో  హైదరాబాద్‌తో పాటు దాదాపు 15 చోట్ల ఈడీ ఏకకాలంలో సోదాలు నిర్వహించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. ముద్దాయిలుగా ఉన్న కొందరు అధికారులు అప్రూవర్లుగా మారి సమాచారం ఇస్తున్నట్లు సమాచారం. ఈ విషయాలను ప్రస్తావిస్తూ..   మాజీ జడ్జి రామకృష్ణ   నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికలు అందరూ అనుకుంటున్నట్లు 2029లో కాకుండా, ముందస్తు వ్యూహంలో భాగంగా 2028 చివరిలోనే, అంటే తెలంగాణతో పాటే ఆంధ్రప్రదేశ్‌లోనూ వచ్చే అవకాశం ఉందన్నారు. అంతే కాదు, ఈ మద్యం కుంభకోణం తీవ్రత దృష్ట్యా రాబోయే ఆరు నెలలు లేదా ఏడాది కాలంలో జగన్మోహన్ రెడ్డి  జైలుకు వెళ్లడం ఖాయమని, వైఎస్ జగన్ జైల్లో ఉండగానే రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయని రామకృష్ణ విశ్లేషించారు. గతంలో ఉన్నట్లు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిపై ప్రజల్లో ఎలాంటి సానుభూతి  వర్కవుట్ కాదని, ఐదేళ్ల పరిపాలన చూశాక ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్న ఆయన,  ఒకవేళ ఈడీ అరెస్టులు గనుక జగన్ వరకు వెళ్తే, వైసీపీ తరపున ప్రచారం చేయడానికి కూడా  నాయకుడు మిగలడని, పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందని  అభిప్రాయపడ్డారు.  

 

By
en-us Political News

  
ఈ మొత్తం స్థలం విలువ బహిరంగ మార్కెట్లో వెయ్యి కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని అంటున్నారు. ఇందులో సింహభాగం అంతా ప్రభుత్వానికి చెందిన భూమి కావడం గమనార్హం. కాగా ఈ వ్యవహారంపై తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రముఖ అనలిస్ట్ భరద్వాజ మాట్లాడారు.
సహజంగా దేశ చరిత్రలో జవహర్‌లాల్ నెహ్రూ 17 సంవత్సరాల పాటు, ఇందిరా గాంధీ 16 సంవత్సరాల పాటు ప్రధానమంత్రులుగా సేవలందించారు. అయినప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీ 12 ఏళ్ల పాలన రికార్డు ఎలా ? అన్న విషయాన్నితెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సీనియర్ జర్నలిస్టు, ప్రముఖ ఎనలిస్టు వివరించారు.
గత సార్వత్రిక ఎన్నికల ముందే వీరిద్దరి మధ్య విభేదాలు తీవ్రమై కేశినేని నాని తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసిన సోదరుడు కేశినేని చిన్ని చేతిలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కేశినేని నాని ఓటమి పాలయ్యారు. ఎన్నికల ముగిసిన తర్వాత నాని వైసీపీకి దూరంగా జరుగుతూ మళ్లీ టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ.. తమ్ముడు కేశినేని చిన్నితో వైరం మాత్రం పెరుగుతూనే ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, వైసిపి శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చాయి. ఈ నిరసనల్లో భాగంగా ఒక ధర్నాలో పాల్గొన్న అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నిరసనల సందర్భంగా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూసేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన సమాజిక మాధ్యవ వేదిక ఎక్స్ లో పెట్టిన పోస్టులో.. ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తూ… రాష్ట్ర భవిష్యత్తుకు బాటలు వేస్తున్నామన్నారు.
ఆమె నామినేషన్ తిరస్కరణను బీజేపీ పక్కా ప్రణాళికతో చేసిన రాజకీయ కుట్రగా అభివర్ణించారు. జాతీయ మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి.. మధ్యప్రదేశ్ లోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌ను పావుగా వాడుకుని, ఉద్దేశపూర్వకంగానే మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ను అడ్డుకుందని ఆరోపించారు.
ఈ ఆందోళన చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధమైన పద్ధతుల్లో, ఎలాంటి హింసకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో జరుగుతుందని నిర్వాహకులు స్పష్టం చేశారు. డిజిటల్ స్క్రీన్‌ల నుండి నేరుగా రోడ్లపైకి వస్తున్న ఈ జెన్-జీ ఉద్యమం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పటికీ, క్షేత్రస్థాయిలో పాలనా పరమైన విధానాలు మరియు లబ్ధిదారుల శైలి మారలేదనే తీవ్ర అసంతృప్తి రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
దేశ రాజకీయాల్లో తెరవెనుక జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవంగా పూర్తయ్యాయి.
దిల్లీలో నీట్ పరీక్షల లీకేజీకి సంబంధించి పక్కా ఆధారాలు బయటపడటంతో అక్కడ కేంద్ర ప్రభుత్వంపై యువత తిరగబడింది. కానీ ఏపీలో మెగా డీఎస్సీ పారదర్శకంగా ముగిసి, నియామక పత్రాలు కూడా అభ్యర్థులకు అందజేశారు. ఏపీ విద్యాశాఖ కూడా విపక్షాలు చేసిన ప్రతి ఆరోపణకూ రికార్డులతో సహా పక్కాగా వివరణ ఇచ్చింది.
కవిత పార్టీ పేరుపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 14 ఏళ్ల తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో టీఆర్ఎస్ అనే పేరు తెలంగాణ ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉందనీ, ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు బీఆర్ఎస్‌ను టీఆర్ఎస్‌గానే గుర్తిస్తున్నారని పేర్కొంటూ ఆ పేరును ఇతరులకు కేటాయించవద్దని ఈసీఐకి అధికారిక ఫిర్యాదు చేసింది.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తరువాత టీఎంసీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఎన్నికల ఫలితాల తరువాత పార్టీలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా రచ్చకెక్కాయి. మమతా బెనర్జీని ధిక్కరిస్తూ ఒక్కరొక్కరుగా కీలక నేతలు పార్టీని వీడుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.