తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం టీవీకే పార్టీ సంచలన విజయానికి చేరువలో ఉంది. తాజా ట్రెండ్స్ ప్రకారం.. తమిళనాట దశాబ్దాల ద్రవిడ రాజకీయాలకు గండి కొడుతూ విజయ్ పార్టీ మ్యాజిక్ ఫిగర్‌కు చేరువ అవుతోంది. ఒక వేళ మ్యాజిక్ ఫిగర్ చేరకపోయినా.. రాష్ట్రంలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించడం ఖాయం. చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
విజయ్, త్రిషల మధ్య ఉన్న స్నేహం.. వారి ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విజయ్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించినప్పటి నుండి త్రిష ఆయనకు మద్దతుగా నిలుస్తూ వచ్చారు. ఇప్పుడు టీవీకే పార్టీ ఘనవిజయాన్ని త్రిష ఎలా సెలబ్రేట్ చేసుకుంటారనే ఆసక్తి నెటిజన్లలో పెరిగింది. వీరిద్దరూ కలిసి నటించిన గిల్లి , లియో'చిత్రాల క్లిప్పింగ్స్‌ను విజయ్ ఫ్యాన్స్ షేర్ చేస్తూ, రియల్ లైఫ్ విజయానికి రీల్ లైఫ్ జోడీ మద్దతు అంటూ పోస్టులు పెడుతున్నారు. త్రిష కూడా విజయ్ విజయానికి సంబంధించి ఏదైనా పోస్ట్ పెడతారేమోనని నెటిజన్లు ఆతృతగా గాలిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/trisha-is-trendingsocialmedia-25-218920.html
భారతీయ రాజకీయ రంగంలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
దసరా పండుగ సెలవులు ప్రారంభం కావడంతో భాగ్యనగరంలో ప్రయాణికుల రద్దీ తారాస్థాయికి చేరింది.
దేశ రాజధాని న్యూఢిల్లీలో రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రముఖ జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం లైంగిక వేధింపుల ఉదంతంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్ అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి హసిరాణి రథ్ భారీ విజయం సాధించారు.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏవియేషన్ రంగానికి సంబంధించి అత్యంత కీలకమైన చారిత్రాత్మక పరిణామం చోటుచేసుకుంది.
ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి ప్రకటన అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గాదె సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కీలక ఛార్జిషీట్‌ను కోర్టుకు సమర్పించింది.
ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే అత్యున్నత పురస్కారాలలో ఒకటైన 2026 సంవత్సరపు నోబెల్ శాంతి బహుమతిని భారత సంతతికి చెందిన ప్రముఖ న్యాయకోవిదురాలు నవనీతం నవి పిళ్లై గెలుచుకున్నారు.
అర్ధరాత్రి వేళ రోడ్లపై పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ నగరవాసులకు విజ్ఞప్తి చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు.
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.