పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మహా సంక్షోభం తలెత్తింది. పదిహేనేళ్ల పాటు రాష్ట్రంలో తిరుగులేని అధికారం చెలాయించిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నిట్టనిలువుగా చీలిపోయే పరిస్థితి ఎదుర్కొంటోంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలై కేవలం 80 స్థానాలకే పరిమితమైన టీఎంసీలో అసంతృప్తి జ్వాలలు భగ్గుమన్నాయి. అసమ్మతి గళాలు రోడ్డెక్కాయి. పార్టీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై మెజారిటీ టీఎంసీ నేతలు తిరుగుబావుటా ఎగురవేశారు. గడిచిన 15 ఏళ్లుగా బెంగాల్‌ను ఏకఛత్రాధిపత్యంగా పాలించిన దీదీ, ఇప్పుడు సొంత పార్టీపై పట్టు కోల్పోయే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
ఈ రాజకీయ హైడ్రామాలో మొత్తం ఉన్న 80 మంది టీఎంసీ ఎమ్మెల్యేలలో ఏకంగా 58 మంది మమతా బెనర్జీకి వ్యతిరేకంగా తిరుగుబాటు పక్షాన నిలిచారు. ఈ రెబెల్ వర్గం అంతా ఏక తాటిపైకి వచ్చి ప్రత్యేక క్యాంప్ నిర్వహించడమే కాకుండా.. శాసనసభలో తామే అసలైన ప్రతిపక్షంగా గుర్తింపు పొందారు. పార్టీ నుంచి బహిష్కృతుడైన ఎమ్మెల్యే రీతబ్రత బెనర్జీకి ఈ 58 మంది శాసనసభ్యుల మద్దతు ఉండటంతో.. అసెంబ్లీ స్పీకర్ రతీంద్ర బోస్ ఆయన్ను అధికారికంగా శాసనసభ ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించారు. 15 ఏళ్లపాటు తిరుగులేని అధికారంలో ఉన్న మమతకు ఇది కోలుకోలేని గట్టి దెబ్బ అనడంలో సందేహం లేదు.
అయితే ఈ తిరుగుబాటు వెనుక అసలు కథ వేరే ఉందనే ప్రచారం గట్టిగా సాగుతోంది. ఈ అసమ్మతి జ్వాలలు మమతా బెనర్జీపై కంటే.. ఆమె మేనల్లుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఒంటెత్తు పోకడలపైనేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. చాలా కాలంగా పార్టీలోని సీనియర్ నేతలను పక్కనపెట్టి.. అభిషేక్ బెనర్జీ సర్వాధికారాలు చెలాయించడంపై పార్టీ నేతల్లో లో తీవ్ర అసంతృప్తి పేరుకుపోయింది. ఎన్నికల ఓటమితో ఆ అసంతృప్తి ఒక్కసారిగా బయటపడింది. రెబెల్స్ క్యాంప్‌లోని మెజారిటీ ఎమ్మెల్యేలు మమతా బెనర్జీపై గౌరవాన్ని ప్రదర్శిస్తూ ఆమెను ప్రధాన సలహాదారు పాత్రకు పరిమితం కావాలంటున్నారు. మరోవైపు 23 మంది టీఎంసీ ఎంపీలు కూడా ఈ తిరుగుబాటు వర్గంతో చేతులు కలిపినట్లు సమాచారం.
ఈ భారీ సంక్షోభం నుంచి పార్టీని కాపాడుకునేందుకు మమతా బెనర్జీ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగానే శుక్రవారం (జూన్ 5) తన నివాసంలో జాతీయ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. రీతబ్రత బెనర్జీని ప్రతిపక్ష నేతగా గుర్తిస్తూ స్పీకర్ తీసుకున్న నిర్ణయం పార్లమెంటరీ నిబంధనలకు పూర్తిగా విరుద్ధమని టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ మండిపడ్డారు. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ సోమవారం (జూన్ 8) నాడు కలకత్తా హైకోర్టును ఆశ్రయించాలని మమత నిర్ణయించారు. అంతేకాకుండా.. పార్టీలో తిరుగుబాటును ఉక్కుపాదంతో అణచివేసేందుకు వీలుగా బెంగాల్‌లోని అన్ని కీలక రాష్ట్ర కమిటీలతో పాటు ఫ్రంటల్ సంస్థలను దీదీ రద్దు చేశారు. గతంలో మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ తరహాలోనే ఇప్పుడు బెంగాల్లో కూడా పార్టీ పేరు, గుర్తు కోసం కోర్టుల్లో న్యాయపోరాటం జరగే పరిస్థితి ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/trinamool-congress-slipping-out-mamatha-hands-39-222008.html
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.