Publish Date:Nov 30, 2022
సినిమాలలో ట్రయాంగ్యులర్ లవ్ స్టోరీలు చాలానే చూశాం. ఒకే అబ్బాయిని ఇద్దరమ్మాయిలు ప్రేమించడం.. ఒకరి కోసం ఒకరు త్యాగాలకు సిద్ధపడటం సినిమాలలో చాలా కామన్. దసరాబుల్లోడు నుంచి అంతకు ముందూ, తరువాతా కూడా బోలెడన్ని ట్రయాంగ్యులర్ లవ్ సినిమాలు వచ్చాయి. సెంటిమెంట్ పండి విజయవంతమైన ఫార్ములా ఇది.
అయితే.. వాస్తవంలో ఇలాంటి ట్రయాంగ్యులర్ లవ్ స్టోరీ ఎంత వయలెంట్ గా ఉంటుందో తెలుసా.. ఒకే అబ్బాయిని ప్రేమించిన ఇద్దరు అమ్మాయిలు ఆ అబ్బాయి కోసం రోడ్డున పడి కొట్టుకున్న ఈ సంఘటన వీళ్లసలు అమ్మాయిలేనా.. అసలు మనుషులేనా అనిపించేలా ఉంది. ఈ ఘటన బీహార్ లోని సోనేపూర్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే సోనేపూర్ లో సంత జరుగుతోంది. అబాల గోపాలం ఆ సంతకు వచ్చారు. ఈ సంతకు వచ్చిన ఒక అమ్మాయికి తన ప్రియుడు మరో అమ్మాయితో కలిసి రావడం చూసింద. అంతే ఆగ్రహం పట్టలేక నా లవర్ తో తిరుగుతావా అంటే ఆమెతో గొడవకు దిగింది.
నీ లవరేంటి నా లవర్ అంటూ ఆ అబ్బాయితో వచ్చిన అమ్మాయి కూడా గొడవకు సై అంది. అక్కడ నుంచీ మొదలైంది రచ్చ. అమ్మాయిల మధ్య గొడవ అలా ఇలా జరగలేదు. రచ్చ రచ్చ చేశారు ఇద్దరూ కలిసిజుట్లు పట్టుకుని కొట్టుకున్నారు. బట్టలు చింపేసుకున్నారు. కాళ్లతో తన్నుకున్నారు.
సంతలో ఉన్నవారందరికీ మంచి వినోదం పంచారు. అంతేనా ఒక అబ్బాయి కోసం ఇంత చేటు కొట్టుకుంటున్నారా అని జనం షాక్ అయ్యేలా చేశారు. ఇంతకీ ఆ ఇద్దరు అమ్మాయిల ముద్దుల ప్రేమికుడు కూడా వారి దెబ్బలాటకు భయపడి జారుకున్నాడు. చివరాఖరికి పోలీసులు రంగ ప్రవేశం చేస్తే కాని వారి గొడవ ఆగలేదు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/triangular-love-fight-in-sonopur-two-girls-fuoght-for-one-boy-25-147904.html
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.