తెలంగాణలో త్రిముఖ పోరు పక్కా.. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల్లో గెలుపు ధీమా!

Publish Date:May 14, 2022

Advertisement

వచ్చే ఏడాది జరగాల్సిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో త్రిముఖ పోరు పక్కా అని పరిశీలకులు చెబుతున్నారు. వచ్చే ఎన్నికలలో విజయంపై టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలలో ధీమా వ్యక్తమౌతున్నది. చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలే తమ పార్టీకి ముచ్చటగా మూడోసారీ అధికార పీఠానని దక్కిస్తాయని టీఆర్ఎస్ లో ధీమా వ్యక్తం అవుతుంటే.. తెలంగాణ మౌలిక ఆశయాలను తుంగలో తొక్కి అన్న వర్గాలకూ అన్యాయం చేసిన టీఆర్ఎస్ కు గుణపాఠం చెప్పాలన్న తెలంగాణ ప్రజ ఎన్నో త్యాగాలకు సిద్ధమై తెలంగాణ సాకారం చేసిన సోనియా గాంధీ పట్ల అభిమానం చాటుకునేందుకు కాంగ్రెస్ కే పట్టం కడతారని కాంగ్రెస్ విశ్వసిస్తున్నది. ఇక మోడీ నేతృత్వంలో గత ఎనిమిదేళ్లలో దేశం సాధించిన విజయాలు, అభివృద్ధే తెలంగాణలో   ప్రజలు తమకే పట్టం గట్టేలా చేస్తుందని బీజేపీ నమ్మకంతో ఉంది. 

 అధికార టీఆర్ఎస్ పార్టీలో వచ్చే ఎన్నికలలో విజయం పట్ల నమ్మకమూ, అప నమ్మకమూ సమపాళ్లలో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పార్టీలో రెండవ శ్రేణి నాయకత్వం కరవైన విషయం ప్రస్ఫుటంగా తెలుస్తోంది. మొత్తం పార్టీ అంతా వన్ మేన్ షో లేదా వన్ పార్టీ షోగా నడుస్తోంది. టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుదే పార్టీలో మొత్తం షో.. ఆయన తరువాత  స్థానాలలో వరుసగా కేటీఆర్, హరీష్ రావు, కల్వకుంట్ల కవితలు ఉంటారు. పార్టీకి ఇదే బలం, బలహీనతా అయ్యింది.  ఈ నలుగురినీ మినహాయిస్తే పార్టీలో పెద్దగా ప్రాముఖ్యత ఉన్న నేతలు కానీ, ప్రజలను ప్రభావితం చేసేలా ప్రసంగించగలిగే నాయకులు కానీ ఉన్నట్లు కనిపించరు. ఇక మహిళా నేతలలో  మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ లు అడపాదడపా ప్రెస్ మీట్లతో మెరిసినా ప్రజలలో పెద్దగా పట్టున్న నేతలు కారు. ఇక ఎమ్మెల్యేలు, మిగిలిన మంత్రుల పాత్ర పార్టీలో పార్టీ వ్యవహారాలలో నామమాత్రమే. తెరాస ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఇంకా ప్రజలలో పూర్తిగా చెరిగిపోని సెంటి మెంట్ పైనే తెరాస విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. అలాగే తెరాస శ్రేణుల్లో కేసీఆర్ ఏం చేసైనా పార్టీని గెలుపు బాట పట్టిస్తారన్న విశ్వాసం ఉంది.

ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే.. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న ఆ పార్టీలో కార్యకర్తల కంటే నాయకుల సంఖ్యే అధికం. అదే ఆ పార్టీకి బలహీనతగా మారింది. నేతలలో ఆధిపత్య పోరు కారణంగానే క్షేత్ర స్థాయిలో పార్టీకి బలమైన క్యాడర్, నిర్మాణం ఉన్నా వరుస పరాజయాలను ఎదుర్కొంటోది. ఇటీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తరువాత నేతలలో అమస్మతి పెరిగింది. కానీ క్యాడర్ లో ఉత్సాహం నిండింది. అదే రాష్ట్రంలో కాంగ్రెస్ చేపడుతున్న కార్యక్రమాలకు ఆదరణ పెరిగేలా చేసింది. రాహుల్ గాంధీ వరంగల్ సభలో నేతల మధ్య గ్యాప్ విషయంలో స్పష్టమైన హెచ్చరిక లాంటి సంకేతాలు వెళ్లడంతో ప్రస్తుతానికి ఆ పార్టీలో ఐక్యత కనిపిస్తున్నది. ఒకరిద్దరు బహిరంగంగా అసమ్మతి రాగాలు వినిపిస్తున్నా పెద్దగా పట్టించుకోనవసరం లేదన్న ధీమా పార్టీలో కనిపిస్తున్నది.  

ఇక బీజేపీ విషయానికి వస్తే.. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఆ పార్టీలో ప్రజలను ప్రభావితం చేయగలిగేలా ప్రసంగించే నేతలు మిగిలిన పార్టీలలో కన్నా ఎక్కువగా ఉన్నారు. అలాగే ఈటల, రఘునందనరావుల చేరికతో ఆ పార్టీకి ఒకింత బలం పెరిగిందని పరిశీలకులు భావిస్తున్నారు.    రెండేండ్ల క్రితం కేవలం రాష్ట్ర బీజేపీలో మీడియా సమావేశాలు పెట్టి పార్టీ విధానాలను వివరించగలిగే స్థాయి ఉన్న నేతలు ఒకరిద్దరు మాత్రమే కనిపించేవారు. అయితే ఇప్పుడు  వారి సంఖ్య పెరిగింది. అధికార పార్టీ కంటే, విపక్ష కాంగ్రెస్ కంటే.. బీజేపీలో ప్రజాకర్షక ప్రసంగాలు చేసే నేతల సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో ఇప్పటి వరకూ పట్టణాలకే పరిమితం అన్న ముద్ర పడిన బీజేపీ గ్రామ స్థాయిలో కూడా చెప్పుకోదగినట్లుగా బలోపేతం అయ్యింది. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నకలలో విజయాలే దీనికి నిదర్శనంగా పరిశీలకులు చెబుతున్నారు. దీనికి తోడు జాతీయ నాయకులు జెపి నడ్డా, అమిత్ షా, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు తెలంగాణలో తరచూ పర్యటనలు చేస్తూ క్యాడర్ లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. తెరాస పట్ల వ్యతిరేకత, కాంగ్రెస్ బలహీనత, మోడీ ఛరిష్మాతో వచ్చే ఎన్నికలలో విజయం సాధించి తెలంగాణలో అధికారం చేపట్టగలమన్న ధీమా కమలం పార్టీలో వ్యక్తమౌతున్నది. మొత్తం మీద వచ్చే ఎన్నికలలో త్రిముఖ పోరు తీవ్రంగా ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

By
en-us Political News

  
దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో ఖాళీగా ఉన్న స్థానాలను భర్తీ చేసేందుకు కొలీజియం కీలక నిర్ణయం తీసుకుంది.
సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రి ప్రాంగణంలో ఓ మానసిక రోగి హల్‌చల్‌ చేయడంతో కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
దేశ రాజకీయాల్లో ప్రాంతీయ అసమానతలు, ఉత్తరాది ప్రాబల్యంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి తన గళాన్ని గట్టిగా వినిపించారు.
జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత యువ షూటర్, తెలంగాణ ముద్దుబిడ్డ ఈషా సింగ్ అద్భుత ప్రతిభ కనబరిచారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు సంబంధించి ప్రభుత్వం అధికారిక ప్రకటన జారీ చేసింది.
హైదరాబాద్ నగరంలో మహిళల భద్రతను ప్రశ్నార్థకం చేస్తూ మరో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది.
బాలీవుడ్‌లో మరోసారి ఆదాయపు పన్ను శాఖ దూకుడు పెంచింది.
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త సంక్షేమ అధ్యాయానికి తెరలేచింది.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
శంషాబాద్ వద్ద హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై ఊహించని ఘటన చోటుచేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.