ప్రాథమిక విచారణలో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి నేరం నిర్ధారణ అయ్యింది.!

Publish Date:Jul 30, 2026

Advertisement

మహిళా ఐపీఎస్ అధికారిణిని లైంగికంగా వేధించిన ఆరోపణలపై ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసు వివరాలను  హైదరాబాద్ సీపీ  కమిషనర్ వీసీ సజ్జనార్  వెల్లడించారు.  బాధితురాలి ఫిర్యాదు మేరకు క్షుణ్ణంగా విచారించిన తరువాతనే పోలీసులు నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు. సజ్జనార్ కథనం ప్రకారం కేసు పూర్వాపరాలిలా ఉన్నాయి. 

 ఉదయ్ కృష్ణారెడ్డి గతంలో పోలీస్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించారు. ఆ తర్వాత పట్టుదలతో యూపీఎస్సీ పరీక్షల్లో విజయం సాధించి, 2025 బ్యాచ్ ఐపీఎస్ అధికారిగా ఎంపికయ్యారు. అదే ఏడాది డిసెంబర్ నెల నుంచి హైదరాబాద్ శివరాంపల్లిలోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్నారు.

నిందితుడికి బాధితురాలితో ఇన్‌స్టాగ్రామ్  ద్వారా పరిచయం ఏర్పడింది. సివిల్స్ సాధించిన తన ప్రయాణంపై ఉదయ్ కృష్ణారెడ్డి చేసిన ఒక పోస్ట్‌ను చూసి ఆమె స్పందించడంతో వారి సంభాషణలు మొదలయ్యాయి. సదరు మహిళ కూడా 2024 బ్యాచ్ ఐపీఎస్ అధికారిణిగా ఎంపికై, ప్రత్యేక సెలవులో ఉండటంతో 2025 బ్యాచ్‌తో కలిసే శిక్షణలో చేరారు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య  ఏర్పడిన స్నేహం ఏర్పడి  ప్రేమగా మారింది.

పోలీస్ అకాడమీలో శిక్షణ సమయానికి  వీరిరువురి మధ్యా   మనస్పర్థలు తలెత్తాయి. దీంతో  ఉదయ్ కృష్ణారెడ్డి ఆమెను మానసికంగా వేధించడం ప్రారంభించాడు.  పలుమార్లు ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు దిగాడు. ఒకానొక సందర్భంలో ఆగ్రహంతో బాధితురాలికి చెందిన ల్యాప్‌టాప్‌ను  ధ్వంసం చేశాడు.

దీంతో ఉదయ్ కృష్ణారెడ్డి ప్రవర్తనతో విసిగిపోయిన బాధితురాలు సామాజిక మాధ్యమాల్లో అతడిని బ్లాక్ చేసింది. దాంతో నిందితుడు నకిలీ సోషల్ మీడియా ఖాతాలను సృష్టించి, వారిద్దరి మధ్య జరిగిన వ్యక్తిగత సంభాషణలను బయటపెడతానని బెదిరించడం మొదలుపెట్టాడు. అంతటితో ఆగకుండా బాధితురాలి అనుమతి లేకుండానే ఆమె కుటుంబ సభ్యులకు, సహచర అధికారులకు ఫోన్లు చేస్తూ  వేధించాడు.

వేధింపులు భరించలేక బాధితురాలు అతడికి పూర్తిగా దూరంగా ఉంటూ, తదనంతరం మరొకరిని వివాహం చేసుకుంది. అయినప్పటికీ ఉదయ్ కృష్ణారెడ్డి ధోరణిలో ఎ  మార్పు రాకపోగా, పెళ్లి తర్వాత కూడా వేధింపులను కొనసాగించాడు. దీనితో బాధితురాలు  పోలీసులను ఆశ్రయించారు.  కేసు నమోదు చేసిన పోలీసులు చేపట్టిన ప్రాథమిక దర్యాప్తులో నిందితుడు నేరానికి పాల్పడినట్లు ఆధారాలు లభించాయి. ఈ క్రమంలో చట్ట నిబంధనల ప్రకారం నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఉప్పరపల్లి న్యాయస్థానంలో హాజరుపరిచి కోర్టు ఆదేశాల మేరకు  చంచల్‌గూడ జైలుకు  రిమాండ్ చేశారు.   

Trainee IPS Uday Krishna Reddy, CP Sajjanar Statement, Sexual Harassment Case, Hyderabad Police, NPA Hyderabad IPS Case

By
en-us Political News

  
భారత స్వాతంత్య్ర సంగ్రామంలో కోట్లాది మంది భారతీయుల్లో దేశభక్తి రగిలించిన అమర గేయం
ఛత్తీస్‌గఢ్ మీదుగా పయనిస్తున్న తీవ్ర వాయుగుండం, చురుగ్గా ఉన్న నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం
విధులు నిర్వర్తిస్తున్న ఎస్సై ప్రవళ్లిక పట్ల దురుసు ప్రవర్తన.. చర్యలకు డిమాండ్..!
జగన్‌కు ములాఖత్‌కు నిరాకరణ.. జైలు వద్ద సీదిరి కుటుంబ సభ్యులను పరామర్శించారు.. !
మానవత్వం మరుగున పడిపోతోందా? కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవాల్సిన చేతులే.. అదను చూసి లూటీకి తెగబడుతున్నాయా?
విధుల్లో ఉన్న మహిళా ఎస్సైపై వైసీపీ నేతలు దురుసు ప్రవర్తన..!
పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్‌లు..!
గచ్చిబౌలిలో నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతంలో మట్టి కుప్పకూలడంతో ముగ్గురు కార్మికులు గాయపడ్డారు.
తెలంగాణలో విద్యా వ్యవస్థ, నిరుద్యోగం, ఉద్యోగ నైపుణ్యాలు (స్కిల్స్) అంశాలపై ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
ఫార్ములా-ఈ కారు రేస్ కేసులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ రేపు నాంపల్లి ఏసీబీ కోర్టుకు హాజరుకానున్నారు.
నాపై జరుగుతున్న ప్రచారాన్ని ఆపండి అంటూ బాధితురాలి విజ్ఞప్తి..!
హైదరాబాద్‌లోని సైబరాబాద్‌ పరిధిలో గురువారం మధ్యాహ్నం నుంచి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకా శం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో
ప్రభుత్వం చేపట్టిన బహుళ ప్రయోజన సాగునీటి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులకు సంబంధించి ఎదురవుతున్న చిక్కులను తొలగిస్తూ సుప్రీంకోర్టు కీలకమైన తీర్పును వెలువరించింది. పాలమూరు, సీతమ్మ సాగర్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతొ ఆ ప్రాజెక్టులపై నెలకొన్న సందిగ్ధత తొలగిపోయింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.