ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి వ్యవహారంలో కొత్త ట్విస్ట్...!

Publish Date:Jul 21, 2026

Advertisement

 

ఆమెతో ఏడాది నుంచి రిలేషన్‌లో ఉన్న..సూసైడ్‌ నోట్‌లో ఉదయ్ కృష్ణారెడ్డి..!

ట్రైనీ ఐపీఎస్  ఉదయ్ కృష్ణా రెడ్డి ఆత్మహత్యాయత్నం చేశారనే ప్రచారంలో కీలక పరిణామాలు చోటుచేసు కున్నాయి. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులకు ఇప్పటివరకు లభించిన ఆధారాల ప్రకారం ఉదయ్ అసలు ఆత్మహత్యాయత్నమే చేయలేదని  నిర్ధారణకు వచ్చినట్లు పోలీస్ వర్గాలు వెల్లడించాయి. ప్రారంభంలో విషపూరిత ద్రవపదార్థం సేవించి ఆత్మహత్యకు యత్నించారనే వార్తలు విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. అయితే వైద్యులు నిర్వహించిన పరీక్షల్లో అలాంటి ఆధారాలు ఏవీ లభించలేదని సమాచారం. వైద్య పరీక్షల నివేదికల్లో ఆయన శరీరంలో విషపూరిత రసాయనాలు లేదా ఆత్మహత్యకు ఉపయోగించే పదార్థాల ఆనవాళ్లు కనిపించలేదని అధికారులు చెబుతున్నారు.

దర్యాప్తులో మరో కీలక విషయం కూడా వెలుగులోకి వచ్చింది. ఉదయ్ కృష్ణా రెడ్డి అతిగా మద్యం సేవించడం వల్లే అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు వైద్యులు నిర్ధారించినట్లు తెలుస్తోంది. అదే కారణంగా ఆయనకు అస్వస్థత ఏర్పడగా, వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారని సమాచారం. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, ఈ ఘటనకు సంబంధించి వెలుగులోకి వచ్చిన సూసైడ్ నోట్‌పై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. 

ఆ నోట్ నిజంగా ఉదయ్ కృష్ణా రెడ్డి రాసిందా? లేక మరెవరైనా సృష్టించారా? అది ఎప్పుడు రాయబడింది? అనే అంశాలను ఫోరెన్సిక్ నిపుణుల సహాయంతో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అవసరమైతే చేతిరాత నిపుణులతో కూడా పరీక్షలు నిర్వహించే అవకాశమున్నట్లు సమాచారం. పోలీస్ వర్గాల ప్రకారం, ఆత్మహత్యాయత్నం జరిగిందనే ప్రచారం వాస్తవాలకు భిన్నంగా ఉండొచ్చని అనుమానిస్తు న్నారు. సానుభూతి పొందేందుకు లేదా ఇతర కారణాలతో ఈ ప్రచారం జరిగి ఉండొచ్చనే కోణంలో కూడా విచారణ కొనసాగుతోంది. 

ఘటనకు దారితీసిన పరిస్థితులు, ఆ సమయంలో ఆయనతో సంబంధం ఉన్న వ్యక్తులు, ఫోన్ కాల్స్, డిజిటల్ ఆధారాలు, ఇతర పరిస్థి తులన్నింటినీ అధికారులు పరిశీలిస్తున్నారు. అయితే, ఈ వ్యవహారంపై తుది నిర్ధారణకు రావాలంటే ఫోరెన్సిక్ నివేదికలు, సూసైడ్ నోట్‌పై విశ్లేషణ, ఇతర సాంకేతిక ఆధారాలన్నీ అందాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. పూర్తి స్థాయి దర్యాప్తు అనంతరం మాత్రమే ఈ ఘటనకు సంబంధించిన వాస్తవాలను అధికారికంగా వెల్లడించే అవకాశం ఉందని పోలీస్ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఉదయ్ కృష్ణారెడ్డి సూసైడ్ లేఖలో పలు కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా బయటకు వచ్చిన లేఖలో, తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన ట్రైనీ మహిళా ఐపీఎస్ అధికారిణితో తాను ఏడాది పాటు రిలేషన్‌లో ఉన్నానని ఉదయ్ కృష్ణారెడ్డి పేర్కొన్నాడు.

ఆమె మరో వ్యక్తిని వివాహం చేసుకున్న తర్వాత కూడా తిరిగి తన వద్దకు వచ్చిందని, అనంతరం తమ మధ్య మళ్లీ సంబంధం కొనసాగిందని లేఖలో రాశాడు. ఈ విషయాలకు సంబంధించిన వీడియో ఆధారాలు కూడా తన వద్ద ఉన్నాయని పేర్కొన్నాడు. అలాగే, తన మరణానికి నలుగురు వ్యక్తులు కారణమని సూసైడ్ నోట్‌లో ఆరోపించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

ట్రైనీ ఐపీఎస్ అధికారిణి ఫిర్యాదులో ఏముంది?

తనతో పాటు శిక్షణ పొందుతున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి ఈ ఏడాది జూన్ 23 నుంచి తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఓ ట్రైనీ మహిళా ఐపీఎస్ అధికారిణి అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

వాట్సాప్ ద్వారా అసభ్యకర సందేశాలు పంపుతూ దూషిస్తున్నాడని, రహస్యంగా తన వ్యక్తిగత ప్రైవేట్ వీడియోలను చిత్రీకరించి వాటితో బెదిరిస్తున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాకుండా, ఆ వీడియోలను తన భర్తకు పంపి మానసికంగా వేధించడంతో పాటు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తానంటూ బ్లాక్‌మెయిల్ చేశాడని ఆరోపించింది.

Trainee IPS Uday Krishna Reddy, Suicide note, Attapur Police Station, National Police Academy Hyderabad, Trainee IPS Suicide Attempt Drama, Hyderabad Police Investigation
 

By
en-us Political News

  
అలాగే బహ్రెయిన్‌లోని దిగ్గజ సంస్థ అయిన అమెజాన్ ప్రధాన డేటా సెంటర్‌ను కూడా ధ్వంసం చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. తమ దేశ పౌర వసతులపై అమెరికా దళాలు జరిపిన దాడులకు తగిన రీతిలో జవాబు చెప్పడానికే ఈ సాంకేతిక కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు పేర్కొంది. అయితే ఈ ఆరోపణలు, క్షిపణి దాడి ఘటనను అమెజాన్ కానీ, బహ్రెయిన్ ప్రభుత్వం కానీ ధ్రువీకరించలేదు.
బాబాయ్ త్వరగా కోలుకోవాలంటూ జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియాలో చేసిన పోస్టు క్షణాల్లో వైరల్ అయ్యింది. బాబాయ్ పట్ల ఎన్టీఆర్ చూపించిన ఈ ప్రేమాభిమానాల పట్ల నందమూరి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఏడాది దావోస్ లోని ప్రపంచ ఆర్ధిక సదస్సులో కుదుర్చుకున్న మరో ఒప్పందం ఇవాళ సాకారమైంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో గత కొన్ని నెలలుగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్న ముంబై నటి కాదంబరి జత్వాని వ్యవహారం
తన ఆరోగ్యం, ఆసుపత్రి అనుభవాల గురించి తాజాగా నెట్టింట షేర్ చేసిన పోస్టు ఆయన అభిమానులను, సినీ వర్గాలనూ కలవరానికి గురి చేసింది. ఆసుపత్రి వాతావరణం, శస్త్రచికిత్స, అనంతరం ఐసీయూలో వైద్యుల నిరంతర పర్యవేక్షణ వంటి కష్టతరమైన దశలను ఆయన తన పోస్టులో పేర్కొన్నారు.
హైదరాబాద్‌లోని గోల్కొండ కోటలో జరుగుతున్న శ్రీ జగదాంబికా అమ్మవారి బోనాల మహోత్సవాల సందర్భంగా హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసులు విస్తృత స్థాయిలో ట్రాఫిక్ బందోబస్తు చేపట్టారు.
ప్రధాని ఇంటి ఎదుట బైఠాయించిన రాహుల్, ఖర్గే..!
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో జాతీయ రాజకీయం అత్యంత ఆసక్తికరమైన మలుపు తిరిగింది.
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఛలో సంసద్ పార్లమెంట్ మార్చ్ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
ఉత్తరాంధ్ర ప్రాంత ప్రగతికి ఊపిరి పోసేందుకు తమ జీవనాధారమైన భూములను ప్రభుత్వం సేకరించడానికి సహకరించిన రైతులకు కృతజ్ఞతగా, గౌరవంగా భోగాపురం విమానాశ్రయం నుంచి ఉచితంగా ఒకసారి విమానంలో ప్రయాణించే అవకాశం కల్పించారు. ఈ మేరకు ఆయన అధికార యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలిచ్చారు.
కాకినాడలో జరుగుతున్న NBK111 సినిమా షూటింగ్ సందర్భంగా గాయపడిన ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నంద మూరి బాలకృష్ణను రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఫోన్‌లో పరామర్శిం చారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పొగాకు రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ముడి పొగాకు (HSN 2401)పై ప్రస్తుతం అమలులో ఉన్న 40 శాతం జీఎస్టీని 28 శాతానికి తగ్గించాలని
ట్రైనీ ఐపీఎస్‌కి న్యాయం జరగాలి..విచారణ పూర్తికాకముందే దోషిగా ప్రకటించడం సరికాదు..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.