మళ్లీ కస్టడీకి ట్రైనీ ఐపీఎస్‌.. విచారణలో నోరు మెదపని ఉదయ్ కృష్ణారెడ్డి..!

Publish Date:Aug 7, 2026

Advertisement

 

హైదరాబాదు నగరంలో తీవ్ర సంచలనం సృష్టించిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. రెండు రోజుల పోలీస్ కస్టడీ ముగిసినా.. కేసుకు సంబంధించిన పలు కీలక ప్రశ్నలకు ఉదయ్ కృష్ణారెడ్డి సమాధానాలు ఇవ్వలేదని పోలీసులు భావిస్తున్నారు. దీంతో ఆయనను మరోసారి కస్టడీలోకి తీసుకుని విచారించాలని అత్తాపూర్ పోలీసులు నిర్ణయించారు. కస్టడీలో భాగంగా పోలీసులు అడిగిన అనేక ప్రశ్నలకు ఉదయ్ కృష్ణా రెడ్డి సమాధానం చెప్పేందుకు నిరాకరించినట్లు సమాచారం. ముఖ్యంగా కేసులో కీలకంగా మారిన ఐఫోన్ ఆచూకీ, కత్తి, మహిళా ట్రైనీ ఐపీఎస్‌తో పరిచయం తదితర అంశాలపై పోలీసులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. 

అయితే విచారణలో ఆశించిన స్థాయిలో సమాచారం రాకపోవడం తో.. మరిన్ని వివరాలు రాబట్టేందుకు మరోసారి కస్టడీకి అనుమతించాలని కోరుతూ పోలీసులు ఉప్పరపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై రేపు ఉప్పరపల్లి కోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది. కోర్టు నిర్ణయం అనంతరం ఉదయ్ కృష్ణారెడ్డిని మరోసారి పోలీసుల కస్టడీకి అప్పగిస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. రెండు రోజుల పోలీస్ కస్టడీ పూర్తయిన అనంతరం ఉప్పరపల్లి మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచిన సమయంలో ఆయన సైబరాబాద్ సీపీ సజ్జనార్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తూ రాతపూర్వక ఫిర్యాదు అందించినట్లు తెలుస్తోంది.

Trainee IPS Uday Krishna Reddy, CP Sajjanar Encounter Threats, Upparapally Court Show Cause Notice, SVPNPA Trainee IPS Controversy, Telangana Police Legal News 

By
en-us Political News

  
అమరావతి గ్రోత్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏజీఐసీఎల్)  ఈ ఐకానిక్ సిగ్నేచర్ బ్రిడ్జికి  సంబంధించిన ఫీజిబిలిటీ, డీపీఆర్,  కన్సల్టెన్సీ కోసం టెండర్ల ప్రక్రియను చేపట్టింది. 
ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రతిపాదనలు, నియామక ప్రక్రియకు సంబంధించిన పనులు జరుగుతున్నాయన్న ఆయన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతోందన్నారు.
క్యాన్సర్ మందుల విపరీతమైన ధరలపై కేంద్ర ప్రభుత్వ వివరణను పార్లమెంటరీ స్థాయి సంఘం తోసిపుచ్చింది. ట్రేడ్ మార్జిన్లపై తక్షణమే పరిమితులు విధించి, ప్రాణరక్షణ ఔషధాల ధరలను సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించింది. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి!
కామన్వెల్త్ గేమ్స్ 2026లో మహిళల షాట్‌పుట్ F57 విభాగంలో 9.81 మీటర్ల త్రోతో పసిడి పతకం గెలిచి చరిత్ర సృష్టించిన పారా అథ్లెట్ షర్మిలా ధన్కర్ స్ఫూర్తిదాయక జీవిత కథ మరియు పోరాట విశేషాలు.
తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన బంగారం ధరలు! హైదరాబాద్, విజయవాడ, విశాఖ సహా ప్రధాన నగరాల్లో నేటి 18, 22, 24 క్యారెట్ల తులం పసిడి రేట్ల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
పిరమల్ ఫైనాన్స్ మరియు బైన్ క్యాపిటల్ మద్దతుగల ఇండియాఆర్‌ఎఫ్, బెలగావికి చెందిన అశోక్ ఐరన్ వర్క్స్ యూనిట్ ఫైన్ ఎడ్జ్ ఇంజనీరింగ్ లో దాదాపు ₹2,000 కోట్లతో మెజారిటీ వాటాను కొనుగోలు చేసింది. ఈ బిగ్ డీల్ విశేషాలు మరియు భవిష్యత్తు ప్రణాళికలను ఇక్కడ తెలుసుకోండి!
అమెరికా సెనెట్‌లో ఇటీవల జరిగిన ఓటింగ్ లో శాంశనింగ్ రష్యా, ఇరాన్ యాక్ట్ 2026 బిల్లుపై చర్చ జరిగింది. చర్చ అనంతరం జరిగిన ఓటింగ్ లో ఈ బిల్లు 86-11 ఓట్ల తేడాతో ఆమోదం పొందింది. సెనెట్‌లో ఆమోదం పొందిన ఈ బిల్లుఈ నెల 31న అమెరికా ప్రతినిధుల సభ ముందుకు రానుంది. లోయర్ హౌస్‌లో కూడా ఆ బిల్లు ఆమోదం పొందితే.. ఆ వెంటనే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంతకంతో చట్టంగా మారి అమల్లోకి వస్తుంది.
లైనక్స్ వినియోగదారుల కోసం NordVPN వర్షన్ 5.3.0 నూతన అప్‌డేట్‌ను విడుదల చేసింది. ఆటోమేటిక్ GUI యాప్ ఇన్స్టాలేషన్, కొత్త డయాగ్నోస్టిక్స్ కమాండ్ మరియు సిస్టమ్ సపోర్ట్ వివరాలు పూర్తి స్థాయిలో తెలుసుకోండి.
అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పై దాడులకు విరామం ఇచ్చి చర్చలకు మార్గం సుగమం చేసినా.. దిగి రావడానికి ఇరాన్ ససేమిరా అంటోంది.
దశాబ్దాల నాటి పాత ఎస్‌క్యుఎల్ ఇంజెక్షన్ లోపం మరియు ఒరాకిల్ డేటాబేస్ ట్రిక్ ఉపయోగించి హ్యాకర్లు విండోస్ సర్వర్లను ఎలా హైజాక్ చేస్తున్నారో తెలుసుకోండి. ఖంట్ టూల్‌కిట్ ప్రమాదం మరియు సెక్యూరిటీ రక్షణ చిట్కాలు ఇక్కడ చూడండి.
ఒకప్పుడు గార్డెన్ సిటీగా పేరుగాంచిన బెంగళూరులో పచ్చదనాన్ని పునరుద్ధరించేందుకు డీకే శివకుమార్ 3 కొత్త భారీ పార్కులను ప్రకటించారు. 452 ఎకరాల వైమానిక దళ స్థలంతో పాటు నగర అటవీ ప్రాంతాల్లో లాల్‌బాగ్ తరహా పార్కుల ఏర్పాటుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో ఐకియా, డెలాయిట్ సమీపంలోని రూ. 2,000 కోట్ల విలువైన 10 ఎకరాల స్థలం కోర్టు వివాదాల వల్ల 15 లక్షల టన్నుల అక్రమ డంపింగ్ యార్డ్‌గా మారిన పూర్తి కథనం.
హైదరాబాద్ బస్తీల నుంచి టీమిండియా స్టార్ బౌలర్‌గా, తెలంగాణ డీఎస్పీగా ఎదిగిన మహమ్మద్ సిరాజ్ స్ఫూర్తిదాయక సక్సెస్ స్టోరీ, ఆస్తుల విలువ, ఐపీఎల్ సంపాదన మరియు బ్రాండ్ డీల్స్ వివరాలు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.