Publish Date:Jun 10, 2026
హైదరాబాద్‌లోని నారాయ ణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. మామిడి పండ్లు తిన్న అనంతరం అస్వస్థతకు గురైన ఇద్దరు అక్కాచెల్లెళ్లు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల వివరాల ప్రకారం.. బీదర్‌కు చెందిన వైజినాథ్, ఇందుమతి దంపతులు ఉపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చి విఠల్‌వాడిలో నివసిస్తున్నారు. ఇటీవల వారి బంధువు రేణుక ఇంటికి వస్తూ నారాయణగూడ జలమండలి సమీపంలో మామిడి పండ్లు కొనుగోలు చేసి తీసుకొచ్చింది. ఆ పండ్లను తల్లి ఇందుమతితో పాటు నలుగురు కుమార్తెలు తిన్నారు.ఆదివారం సాయం త్రం నుంచి ఐదుగురికీ వాంతులు, విరేచనాలు ప్రారంభమవడంతో కాచిగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో పెద్ద కుమార్తె భువనేశ్వరి (17) సోమవారం మృతి చెందగా, చెల్లెలు సంధ్య (10) మంగళవారం కన్నుమూసింది.
ఈ ఘటనతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. మరో ఇద్దరు బాలికలు, తల్లి ఇంకా చికిత్స పొందుతున్నారు. మామిడి పండ్లు తినడం వల్లే ఈ ఘటన జరిగిందా? లేక మరేదైనా కారణమా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నివేదికలు, వైద్య పరీక్షల అనంతరం అసలు కారణం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. రెండు రోజుల్లో ఇద్దరు కుమార్తెలను కోల్పోయిన తల్లిదండ్రుల ఆవేదన స్థానికులను కలచివేస్తోంది. ప్రస్తుతం ఈ ఘటనపై నారాయణగూడ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/tragedy-in-narayanaguda-36-222515.html
మునుగోడు ఎమ్మెల్యే కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల కాలంలో సోషల్ మీడియా వేదికగా సామాన్య ప్రజల సమస్యలపై నాయకులు స్పందించే తీరు మారుతోంది.
ఆధునిక రాజకీయాల్లో ఎలక్షన్ స్ట్రాటజిస్ట్‌లు (ఎన్నికల వ్యూహకర్తలు), పొలిటికల్ మేనేజ్‌మెంట్ కంపెనీల హవా నడుస్తోంది.
సినీ నటుడు ప్రకాష్ రాజ్‌పై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని బీజేపీ సీనియర్ నాయకుడు ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు.
తెలియని వయసులో ప్రేమ.. భర్త వేధింపులు..!
పూణెకు చెందిన వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్యతో తీవ్ర విషాదంలో ఉన్న ఆ కుటుంబాన్ని మరో దుఃఖం వెంటాడింది.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన డీఎస్పీ భీమ్ రెడ్డి వ్యవహారంలో దర్యాప్తు వేగం పెంచిన ఏసీబీకి కీలక ఆధారాలు లభించాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది.
కోస్టుగార్డు, నేవీ నౌకలతో గాలింపు చర్యలకు సీఎం చంద్రబాబు ఆదేశాలు..!
నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి సమీపంలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది
భారీ వర్షాలకు దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరం చిగురుటాకులా వణికి పోతున్నది. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల ధాటికి దేశ ఆర్థిక రాజధాని జలమయమైంది. ఆకాశానికి చిల్లు పడిందా అనే రీతిలో కుండపోత వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. నగరంలోని ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు సముద్రాన్ని తలపిస్తున్నాయి.
కాగా వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతైన వారిని విజయనగరం జిల్లా ముక్కాం గ్రామానికి చెందిన చిన్న, గరగయ్య, అప్పలరాజు, కె.చిన్నయ్య, సీతోడు, అలాగే.. భీమిలి మండలం పెదనగమయ్యపాలేనికి చెందిన బండయ్య, విశాఖపట్నానికి చెందిన చిన్న అమ్మోరుగా గుర్తించారు.