Publish Date:Nov 13, 2024
కంచె చేను మేస్తే అన్నట్లుగా ఏకంగా ఒక ట్రాఫిక్ ఏసీపీ మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడ్డారు. మద్యం మత్తులో వాహనం నడుపుతూ అడ్డంగా దొరికిపోయారు. ట్రాఫిక్ రూల్స్ పాటించని వాహనదారులను పట్టుకోవలసిన ట్రాఫిక్ పోలీసు అధికారే స్వయంగా మద్యం సేవించి వాహనం నడుపుతూ పోలీసులకు పట్టుబడటం సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెడితే..
హైదరాబాద్ లోని మధురా నగర్ లో పోలీసులు బుధవారం (నవంబర్ 13) రాత్రి డ్రంక్ అండ్ర్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఆ క్రమంలో సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్ తప్పతాగి వాహనం నడుపుతూ వారికి చిక్కారు. సివిల్ డ్రెస్సులో వాహనం నడుపుతూ వస్తున్నఆయనను పోలీసులు ఆపారు. బ్రీత్ ఎనలైజర్ ముందు ఊదమన్నారు. దానికి ఆయన సహకరించకుండా నిరాకరించారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తాను కూడా పోలీసు అధికారినేనంటూ వారిపై చిందులు తొక్కారు. ఎంతకీ ఆయన బ్రీత్ ఎనలైజర్ ముందు ఊదకపోవడంతో పోలీసులు సుమన్ కుమార్‌ని అదుపులోకి తీసుకున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/traffic-acp-caught-in-drunk-and-drive-25-188347.html
హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది.
గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని చారిత్రాత్మక బాపూఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నివాళులు అర్పించింది.
కనీస ధర రూ.30కి పెంపునకు సిఫార్సు.!
వెబ్‌సిరీస్ ల్లో ఎక్కువగా బ్యాంకులు, బంగారు దుకాణాల్లో దోపిడీలకు సంబంధించిన వీడియోలే చూసేవాడు.. ఆ తర్వాత తనకున్న ఆర్మీ అనుభవాన్ని ఉపయోగించుకోని సికింద్రాబాద్ మద్రాస్ రెజిమెంట్‌ను ఎంచుకున్నాడు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) వ్యవహారశైలిని నిరసిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
హైదరాబాద్ నగరవాసుల ప్రయాణ కష్టాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది.
కొత్త కారు కొనుక్కోవాలని ఎన్నో రోజులుగా కలలు కంటారు.. ఆ కల నెరవేరిన రోజు ఆ ఆనందమే వేరు! ఎంతో ఇష్టపడి కొత్త బీఎండబ్ల్యూ కారు కొనుగోలు చేసిన ఓ వ్యక్తి..
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త వాతావరణం నెలకొంది.
మహారాష్ట్రలోని ప్రఖ్యాత హిందూ హృదయసమ్రాట్ బాలాసాహెబ్ థాకరే మహారాష్ట్ర సమృద్ధి మహామార్గ్‌పై జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి కెప్టెన్‌పై జరిగిన కత్తిదాడి అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలను దేశవ్యాప్తంగా అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు వేగవంతమైంది.