ప్రచార కమిటి చైర్మెన్ గా పాదయాత్ర! రాహుల్ , రేవంత్ ప్లాన్ ఇదేనా ?

Publish Date:Jan 5, 2021

Advertisement

తెలంగాణ కాంగ్రెస్ కమిటి కూర్పు ఎట్టకేలకు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. నెలరోజుల మంత్రాంగం తర్వాత టీపీసీసీ పగ్గాలపై కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. అయితే కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారానికి భిన్నంగా ఎవరూ ఊహించని ట్విస్ట్ టీపీసీసీ ఎంపికలో కనిపిస్తోంది. ఎంపీలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలలో ఎవరో ఒకరికి పీసీసీ పగ్గాలు ఇస్తారని భావించినా.. హైకమాండ్ మాత్రం ఎమ్మెల్సీ, మాజీ మంత్రి టీ జీవన్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా ఖరారు చేశారని తెలుస్తోంది.  పీసీసీ చీఫ్ ఖాయమనుకున్న రేవంత్ రెడ్డిని ప్రచార కమిటీ చైర్మన్‌గా , రేసులో నిలిచిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని వర్కింగ్ ప్రెసిడెంట్‌గా,  సీఎల్పీ నేతగా దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, సమన్వయ కమిటీ చైర్మన్‌గా మల్లు భట్టి విక్రమార్కను నియమించారని సమాచారం. పీసీసీ పగ్గాల కోసం తీవ్ర పోటీ ఉండటం, నేతల మధ్య ఏకాభిప్రాయం రాకపోవడంతో మధ్యే మార్గంగా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా జీవన్ రెడ్డి ఎంపిక చేశారని భావిస్తున్నారు.  

 టీపీసీసీ కూర్పు వెనక హైకమాండ్ భారీ వ్యూహమే ఉన్నట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి డైరెక్షన్ లోనే ఇదంతా జరిగిందనే చర్చ జరుగుతోంది. పీసీసీ చీఫ్ పదవి కోసం రేవంత్ రెడ్డి ప్రయత్నించినా.. 
సొంత పార్టీ నేతలే తనను వ్యతిరేకించడంతో  ఒక దశలో ఆయన అసంతృప్తి లోనయ్యారని చెబుతున్నారు. అయితే రేవంత్ రెడ్డిని తమ తురుపు ముక్కగా భావిస్తున్న మరో ఐడియా వేసిందని చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నందున... కొన్ని రోజుల వరకు జీవన్ రెడ్డిని పీసీసీగా కొనసాగించి.. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డికి అ బాధ్యత అప్పగించాలని నిర్ణయించిందని తెలుస్తోంది. పీసీసీ పదవి వస్తే తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని గతంలో రేవంత్ ప్రకటించారు. ఇప్పుడు ప్రచార కమిటి చైర్మెన్ గా రేవంత్ రెడ్డితో పాదయాత్ర చేయించే యోచనలో హైకమాండ్ ఉందట. వయసు రిత్యా ఎలాగూ జీవన్ రెడ్డి పాదయాత్ర చేయలేరు కాబట్టి.. రేవంత్ కు ఇక్కడ వచ్చిన ఇబ్బందేమి ఉండదు.  

 తెలంగాణ మొత్తం రేవంత్ రెడ్డి పాదయాత్ర ముగిసే సరికి .. అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతుంది. ఆ సమయంలో రేవంత్ రెడ్డికి పీసీసీ పగ్గాలు ఇచ్చి... ఆయనే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నికలు ఎదుర్కొవాలనే ఆలోచనతోనే హైకమాండ్ తాజా పీసీసీ కూర్పు చేసిందనే చర్చ గాంధీభవన్ లోనే జరుగుతోంది. అందుకే రేవంత్ రెడ్డి తనంతట తానుగా జీవన్‌రెడ్డి పేరును పరిగణనలోకి తీసుకోవాలని అధిష్ఠానానికి ప్రతిపాదించారని సమాచారం.  పీసీసీ రేసులో నిలిచిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి వర్కింగ్ ప్రెసిడెంట్ , శ్రీధర్ బాబుకు సీఎల్పీ, మల్లు భట్టి విక్రమార్కకు సమన్వయ కమిటి చైర్మెన్ పదవులు ఇచ్చినందున ఎవరిలోనూ నిరాశ ఉండదని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తుందట.  

రేవంత్ రెడ్డికి ప్రచార కమిటి చైర్మెన్ పదవి ఇవ్వడానికి మరో లాజిక్ కూడా కనిపిస్తోంది. నరేంద్ర మోడీ ప్రధాని కాక ముందు.. అంటే 2014 పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీజేపీ ప్రచార కమిటి చైర్మెన్ గా పని చేశారు. ఆ పదవితోనే ఆయన దేశ మంతా తిరిగి ఎన్నికల ప్రచారం చేశారు. 2014 ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో.. ప్రచార కమిటి చైర్మెన్ గా పార్టీ బలోపేతానికి పాటుపడిన నరేంద్ర మోడీకే ప్రధానమంత్రి పదవి వరించింది. రేవంత్ కూడా అదే రూట్ ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. పార్టీ ప్రచార కమిటీ చైర్మెన్ గా రాష్ట్ర మంతా పాదయాత్ర చేసి.. ప్రస్తుతం నిరాశలో ఉన్న కాంగ్రెస్ కేడర్ లో జోష్ తేవాలని రేవంత్ ఆలోచన. రేవంత్ ఈ ఆలోచనకు హైకమాండ్ కూడా గ్రీన్ సిగ్నల్  ఇచ్చిందని తెలుస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే.. పాదయాత్రతో పార్టీకి పూర్వ వైభవం తెచ్చిన రేవంత్ రెడ్డికే ముఖ్యమంత్రి పదవి ఖాయమని అతని అనుచరులు కూడా  చెబుతున్నారు. 
 
  అందుకే ప్రచారకమిటీ చైర్మన్ అంటేనే  తనకు చాలా ఇష్టమని చెప్పారు రేవంత్ రెడ్డి.  ఆ పదవి ఇస్తే రాష్ట్రం మొత్తం  పాదయాత్ర చేస్తూ ప్రచారం  చేస్తానంటున్నారు. రాష్ట్రానికి , దేశానికి ప్రచార కమిటీ చైర్మన్ చాలా కీలకమైన పదవులన్న రేవంత్ రెడ్డి.. పీసీసీ పదవి కార్యక్రమాల రూపకల్పన,సమన్వయ చేసేందుకు మాత్రమే పని కొస్తుందన్నారు. రాష్ట్ర మొత్తం తిరగాలంటే ప్రచారకమిటీ చైర్మన్ పదవే కీలకమన్నారు. పీసీసీ పదవి ఎవరికి వచ్చిన సంతోశషంగా అందరితో కలిసి పనిచేస్తానని రేవంత్ క్లారిటీ ఇచ్చారు. టీఆర్ఎస్, బీజేపీ ఉమ్మడి శత్రువు కాంగ్రెస్ అన్నారు. కేసీఆర్ తను తీసుకున్న గోతిలో ఆయనే పడి కొట్టుకుంటున్నారని చెప్పారు. కాంగ్రెస్ ను నాశనం చేద్దామని గోయి తవితే ఆ గోయిలోనే కేసీఆర్ పడిపోయాడరన్నారు రేవంత్ రెడ్డి. బీజేపీ, టీఆర్ఎస్ బొమ్మ బోరుసులాంటివని.. ఆ రెండు పార్టీలను ఓడించడమే తమ లక్ష్యమంటున్నారు రేవంత్ రెడ్డి.

By
en-us Political News

  
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
పోలీసుల హెచ్చరికలు, ఆంక్షలను బేఖాతరు చేస్తూ ఆయన భారీ కాన్వాయ్‌తో అక్కడికి రావడంపై స్థానిక ప్రజలు, తెలుగుదేశం వర్గీయులు  ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఎంపీ కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా  అంకాలమ్మ గూడూరులో ఘర్షణ వాతావరణం నెలకొంది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.