పిల్లలను టార్చర్ చేస్తే నేరస్తులౌతారు

Publish Date:Nov 9, 2024

Advertisement

జాఫర్ బాయ్ కొడుకు ఫజల్ బాబా డ్రగ్స్ కు అలవాటయ్యాడు. ఆందోళన చెందిన జాఫర్ భాయ్ కొడుకును ప్రతీరోజు చితకబాదేవాడు. ఫజల్ బాబా తల్లి జాఫర్ భాయ్ ను వెంటపెట్టుకుని ఒక రోజు మౌలానా దగ్గరికి వచ్చింది. డ్రగ్స్ కు అలవాటుపడ్డ  నా  కొడుకును సన్మార్గంలో ఎలా పెట్టాలి అని మౌలానాను అడుగుతుంది
ఫజల్ బాబా తల్లి: సలాం వాలేకూం మౌలానా సాబ్. మేరా బేటా డ్రగ్స్ కా షికార్ బన్ గయా, హర్ దిన్  బాప్ సే మేరా బేటాకా పిటాయ్ హోరా 
 మౌలానా: వాలేకుం సలాం... తల్లిదండ్రులు పిల్లలను సన్మార్గంలో పెట్టే ప్రయత్నంలో హింసించకూడదు. ప్రేమతో నచ్చజెప్పాలి. ఫజల్ బాబా ప్రెండ్స్ అనేక సార్లు  డ్రగ్స్ రాకెట్ లో పట్టు బడ్డారు. మీరు అప్పుడే కంట్రోల్ చేస్తే ఈ సమస్య వచ్చేది కాదు.పిల్లలను చులకన చేసే అధికారం తల్లిదండ్రులకు  కూడా లేదు.  సరిగ్గా  చదవడం లేదని తల్లిదండ్రులు  పిల్లల మీద ఒత్తిడి చేస్తున్నారు. ఇది మంచిది కాదు.  చెడు వ్యసనాలకు అలవాటుపడిన పిల్లలను ప్రేమతో నచ్చజెప్పాలి. పిల్లలను అవమానపరచడం సరికాదు. ఇంట్లో కుటుంబ సభ్యులందరూ మౌనంగా ఉండాలి. ఎక్కువగా వాదులాడుకోవద్దు. అప్పుడే పిల్లలు అరవడం చేయరు. సంస్కారం అతి ముఖ్యం. పిల్లలు చెడిపోవడానికి తల్లిదండ్రులే ముఖ్యభూమిక వహిస్తారు. నోరు మంచిదైతే ఊరు మంచిదౌతుంది. ప్రతీ ఒక్కరితో సంస్కారవంతంగా మాట్లాడాలి.ఈ విషయాలను పిల్లలకు చిన్నప్పటి నుంచే నేర్పించాలి.  నా కొడుకు ఈ తప్పు చేశాడు. ఆ తప్పు చేశాడు అని ఫిర్యాదులు చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల పిల్లలు నొచ్చుకుంటారు. తండ్రి మీద పిల్లలకు ఎక్స్ పెక్టేషన్ ఎక్కువ ఉంటుంది. పిల్లల మీద ఫిర్యాదులు చేయడం వల్ల నిరాశావాదం వచ్చేస్తుంది. పిల్లలకు గౌరవం ఇవ్వాలి. పిల్లలను అమితంగా ప్రేమించాలి. పిల్లలకోసం టైం కేటాయించాలి.
 పిల్లలను పెంచడంలో తల్లిదండ్రులకు బాధ్యత ఉన్నప్పటికీ కూతురు పెళ్లి చేసే బాధ్యత పూర్తిగా తండ్రికే ఉంటుంది. పిల్లలకు రెండేళ్ల వరకు పాలివ్వడం తల్లి పూర్తి బాధ్యత. ఖురాన్  ప్రకారం రెండేళ్లవరకు పిల్లలకు పాలు పట్టడం  తల్లి బాధ్యత.  పిల్లల విషయంలో తండ్రి స్నేహితుడి మాదిరిగా ఉండాలి గౌరవం ఏ మాత్రం తగ్గకూడదు. అదే తల్లి ప్రేమను ఎక్కువ పంచుతుంది. నవమాసాలు మోస్తుంది అంతే కాదు ప్రసవం సమయంలో అనేక నొప్పులు భరిస్తుంది. రెండేళ్లవరకు పిల్లలకు పాలివ్వడం అన్నీ కలిపి 30 నెలలు తల్లి బాధ్యత తీసుకుంటుంది. తండ్రి మాత్రం పిల్లలను ప్రయోజకులను చేసే వరకు పోషణ బాధ్యతలు తీసుకుంటాడు. కూతుళ్ల పెళ్లిళ్లు చేసే వరకు తండ్రి బాధ్యత ఎక్కువగా ఉంటుంది. పిల్లలను టార్చర్ చేసే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. కానీ పర్సెంటేజ్ తక్కువ అని చెప్పాలి. పిల్లలను మార్చే ప్రయత్నంలో తల్లిదండ్రులు వేధింపులకు  గురి చేస్తున్నారు. స్నేహితుల వల్ల ఎక్కువగా చెడిపోయే అవకాశం ఉంది. కాబట్టి వారిపై నిఘా పెట్టాలి.  డబ్బు సంపాదించిన తండ్రి  కంటే ఇస్లాంను అమలు చేస్తున్న వ్యక్తులే మహనీయులు అని చెప్పాలి. 

                                                                               బదనపల్లి శ్రీనివాసాచారి

By
en-us Political News

  
రాష్ట్రం వెనుకబాటుతనం నుంచి బయటపడాలంటే..  క్షేత్రస్థాయిలో ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.  దశాబ్దాలుగా బీహార్ యువత ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి నెలకొందనీ, ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం సంక్షేమ పథకాలు, రాజకీయ పొత్తులతో కాలక్షేపం చేస్తే రాష్ట్ర భవిష్యత్ అంధకారం అవుతుందన్నారు.
రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లు, నిధుల కొరత నడుమ ఈ బడ్జెట్‌ను రూపకల్పన చేయడం ప్రభుత్వానికి సవాలుగా మారింది. ఒకవైపు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం, మరొకవైపు అభివృద్ధి లక్ష్యాలను సమర్థవంతంగా సాధించడం మధ్య సమతుల్యత పాటించాల్సి ఉంది. పరిమితమైన ఆర్థిక వనరులను దృష్టిలో ఉంచుకుని, ఏ రంగాలకు ఎంత మేరకు నిధుల కేటాయింపులు చేయనున్నారనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
దేశంలో ఇటీవల వెలువడిన ఉప ఎన్నికల ఫలితాలు భారత రాజకీయ యవనికపై కొత్త సమీకరణాలకు నాంది పలుకుతున్నాయి.
వైసీపీలో నెలకొన్న నిస్తేజాన్నీ, నిరుత్సాహాన్నీ ఆసరాగా చేసుకుని, ఆ పార్టీకి పట్టు ఉన్న ప్రాంతాలలో కూడా తెలుగుదేశం కూటమి పాగా వేస్తోంది. ప్రధానంగా వైసీపీకి కంచుకోటగా భావించే రాయలసీమలో వైసీపీ బలాన్ని ఛేదిస్తూ, అభివృద్ధి మంత్రంతో క్షేత్రస్థాయిలో బలం పెంచుకుంటోంది.
తెలంగాణలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఇకపై టీ-ఫైబర్‌ ద్వారానే ఇంటర్నెట్‌ సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
 ఈ ఫలితాలు మోదీ బ్రాండ్ ను మసకబార్చాయి.  మోడీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతకు నిదర్శనంగా నిలిచాయి.  ఈ ఫలితాలు కేవలం  ఉప ఎన్నికలో తగిలిన ఎదురుదెబ్బగా కంటే బీజేపీపై ప్రజా వ్యతిరేకత పెచ్చరిల్లుతుందన్న భావననే ఎక్కువగా ఆవిష్కరించాయి. 
అమెరికాలోని బోస్టన్ విశ్వవిద్యాలయంలో అభిజీత్ విద్య ఎలా అభ్యసించాడనే అంశంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సూరత్‌కు చెందిన ఆర్‌టీఐ కార్యకర్త అమిత్ తివారీ కేంద్ర ఎన్నికల సంఘం, పన్నుల శాఖతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. అలాగే.. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సమకూర్చిన 1 కోటి రూపాయ నిధులపై అనుమానాలు వ్యక్తం చేశారు.
ఎటువంటి ఆధారాలు లేకుండా, కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇటువంటి అసత్య, అవమానకర, ద్వంద్వార్థ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. సామాజిక మాధ్యమాల్లో సైతం ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా సినిమా, రాజకీయ రంగాల నుంచి ఉదయనిధి శైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
నీళ్లు ఎక్కడికి చేరినా చేరకపోయినా.. అక్కడికి మాత్రం తప్పకుండా చేరాలంటూ వ్యాఖ్యానించారు. ఆ వెంటనే తాను మాట్లాడింది కావేరీ జలాల గురించేనని చెప్పినా, ఉదయనిథి స్టాలిన్ వ్యాఖ్యలు నటి త్రిషను ఉద్దేశించి చేసినవేనంటూ విమర్శలు వెల్లువెత్తాయి.
పీకే తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాపై 20 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ నియోజకవర్గం నుంచి 1995 నుంచీ వరుసగా బీజేపీయే విజయం సాధిస్తూ వస్తోంది. నవీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా వరుసగా నాలుగు సార్లు విజయం సాధించగా, ఆ తరువాత ఇదే నియోజకవర్గం నుంచి ఆయన కుమారుడు, ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వరుసగా విజయం సాధిస్తూ వచ్చారు.
పాలనాపరమైన కఠిన నిర్ణయాలే కాకుండా.. రాష్ట్ర ఆర్థిక, సాంకేతిక వృద్ధి కోసం విజయ్ ప్రభుత్వం వెట్రి తమిళగం విజన్ పేరుతో వియయ్ కార్యాచరణ ప్రకటించారు. ఈ విజన్ కింద 50 వేల కోట్ల రాష్ట్ర పెట్టుబడి నిధి ఏర్పాటుకు ప్రతిపాదించడమే కాకుండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీకండక్టర్ల రంగాలలో ప్రభుత్వం నేరుగా కో ఇన్వెస్టర్ గా భాగస్వామ్యం వహించేలా నిర్ణయించారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం క్రెడిట్ విషయంలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేస్తున్నవన్నీ డ్రామాలేనని కేంద్ర మంత్రి పెమ్మసాని విమర్శించారు. 2015లోనే నాటి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు, అప్పటి కేంద్ర మంత్రిఅశోక్ గజపతిరాజు చొరవతో భోగాపురం ఎయిర్‌పోర్టుకు రూపకల్పన చేసిందనీ, 2 వేల 200 ఎకరాల భూసేకరణ కూడా పూర్తి చేసిందని స్పష్టం చేశారు.
గత తప్పిదాల కారణంగా వైసీపీ నేతలు ఒకరి వెంట ఒకరు అన్నట్లుగా కేసుల ఉచ్చుల్లో చిక్కుతున్నారు. ఇక  తెలుగుదేశం కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో  అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతుండటంతో వైసీపీ నేతలలో నిరాశ నిస్ఫృహలు అలుముకుంటున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.