జ‌య‌హో అమ‌రావ‌తి.. మూడు రాజ‌ధానులే.. కేసీఆర్ ఫ్లాప్ షో.. లేటెస్ట్ టాప్‌న్యూస్

Publish Date:Mar 3, 2022

Advertisement

1. ఎప్పటికైనా ధర్మం, న్యాయం గెలుస్తుందని అమరావతి ఉద్యమాన్ని చూస్తే అర్ధం అవుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఎంతో పకడ్బందీగా, ముందు చూపుతో సీఆర్‌డీఏ చట్టాన్ని తీసుకొచ్చాం.. అందుకే, హైకోర్టులో ఆ చ‌ట్టం నిల‌బ‌డింది.. ప్రజా రాజధానిని కాపాడుకున్నది అమరావతి రైతులు, రాష్ట్ర ప్రజలే. ఈ విజయం 5 కోట్ల ఆంధ్రుల‌ విజయం.. అని అన్నారు. రాజధాని కోసం అలుపెరగని పోరాటం చేసిన రైతులు, మహిళలను చంద్ర‌బాబు అభినందించారు. 

2. తమ ప్రభుత్వ విధానం మూడు రాజధానులేనని మంత్రి బొత్స మ‌రోసారి స్పష్టం చేశారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లాలో లేదో చర్చించి చెబుతాం.. చట్టాలు చేసేందుకే శాసనసభ, పార్లమెంట్‌ ఉన్నాయి. శాసనసభలో చట్టాలు చేయకూడదంటే ఎలా? మూడు నెలల్లో ప్లాట్లు ఇవ్వాలంటే సాధ్యమా లేదా చూడాలని మంత్రి బొత్స అన్నారు.  

3. అమరావతి రాజధానిపై హైకోర్టు 307 పేజీల తీర్పు ఇచ్చింది. అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని హైకోర్టు ఆదేశించింది. సీఆర్డీఏ చట్టం ప్రకారమే ప్రభుత్వం వ్యవహరించాలని ఆదేశించింది. భూములిచ్చిన రైతులకు 3 నెలల్లో ప్లాట్లు అప్పగించాలని.. ఒప్పందం ప్రకారం 6 నెలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, హైకోర్టు పర్యవేక్షణలోనే అభివృద్ధి జరగాలని నిర్దేశించింది. అమరావతి నుంచి ఏ కార్యాలయాన్నీ తరలించకూడదని, అమరావతి భూములను తనఖా పెట్టకూడదని హైకోర్టు ఆదేశించింది. 

4. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమరావతి రైతులకు క్షమాపణ చెప్పాలని జనసేన నేత నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు. ధర్మం గెలుస్తుందని, న్యాయం నిలబడుతుందని నమ్మి ఉద్యమం చేసిన రైతులకు అభినందనలు తెలిపారు. జగన్ మూర్ఖ‌పు పాలనతో.. లక్షన్నర కోట్ల పెట్టుబడులు ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్లాయన్నారు. హైకోర్టు తీర్పును ప్రభుత్వం అమలు పరిచే వరకు జనసేన పోరాడుతుందని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.

5. ఢిల్లీలో సీఎం కేసీఆర్‌తో భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేష్ తికాయత్ భేటీ జ‌రిగింది. కేసీఆర్‌తో ఎలాంటి రాజకీయ చర్చ జరగలేదని తికాయత్‌ తెలిపారు. దేశంలో ఒకే వ్యవసాయ పాలసీ ఉంటే బాగుంటుందన్నారు. వచ్చే ఏడాది హైదరాబాదులో కిసాన్ సమ్మె ఏర్పాటు చేస్తున్నామని తికాయత్ ప్రకటించారు. 

6. తెలంగాణ‌లో ఐఎఎస్, ఐపీఎస్‌ల పోస్టింగ్‌లపై టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి.. సీఎం కేసీఆర్‌కు బ‌హిరంగ లేఖ రాశారు. ఎనిమిదేళ్లుగా ఇంకా పరాయి పాలనలోనే మగ్గుతున్నామన్నారు. కీలకమైన శాఖలు బీహార్ అధికారుల చేతుల్లోనే ఉన్నాయని ఆరోపించారు. ఉద్యమంలో కీలకంగా పనిచేసిన అధికారులు నిరాదరణకు గురవుతున్నారని రేవంత్‌రెడ్డి లేఖ‌లో తెలిపారు. 

7. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌పై హత్యా యత్నం కేసు నమోదైంది. మహబూబ్‌నగర్‌కు చెందిన రాఘవేంద్రరాజు పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2017 నుంచి త‌న‌ను చంపేందుకు ప్రయత్నం చేశారని చెప్పారు. శ్రీనివాస్‌గౌడ్ నుంచి ప్రాణ హాని ఉందని.. వేధింపులు తట్టుకోలేకే మంత్రిని చంపాలనుకున్నాన‌ని చెప్పారు. త‌న‌పై శ్రీనివాస్‌గౌడ్ 30 కేసులు పెట్టించారని.. ఒకే రోజు 10 కేసులు పెట్టార‌ని.. త‌న బార్‌షాప్‌ మూసివేయించి ఇబ్బందిపెట్టారు. ఆర్థికంగా 6 కోట్ల నష్టం చేశారని.. నాకు రావాల్సిన డబ్బులను రాకుండా అడ్డుకున్నారని రాఘవేంద్రరాజు తెలిపారు.

8. అమరావతి రాజధాని అంశంలో తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులకు శిరస్సువంచి పాదాభివందనం చేస్తున్నట్టు తెలిపారు ఎంపీ ర‌ఘురామ‌. అమరావతిని కొంచం కూడా కదపలేరని తాను ముందే చెప్పానని గుర్తు చేశారు. అమరావతి అంశంలో సుప్రీంకోర్టుకు వెళ్తే ఇంకా దెబ్బలు పడతాయని హెచ్చరించారు. మనోవేదనతో మరణించిన రైతుల మ‌ర‌ణాలు అన్నీ ప్రభుత్వ హత్యలుగా పరిగణించాలని డిమాండ్ చేశారు. 

9. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వెళ్లాలా? వద్దా? అనే దానిపై టీడీపీ పొలిట్‌బ్యూరోలో చర్చ జరిగిన‌ట్టు తెలుస్తోంది. టీడీఎల్పీలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని నేతలు చెబుతున్నారు. ఏడాది పాటు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల నిర్వహణ.. హైదరాబాద్‌లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు.. విజయవాడలో మహానాడు జరపాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. 

10. ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షలు వాయిదా ప‌డ్డాయి. ఏప్రిల్‌ 22 నుంచి మే 12 వరకు పరీక్షలు జరుగనున్నాయి. పాత‌ షెడ్యూలు ప్రకారం ఇంట‌ర్ ఎగ్జామ్స్‌ ఏప్రిల్‌ 8 నుంచి 28 వర‌కు జ‌ర‌గాల్సి ఉండ‌గా అవి వాయిదా ప‌డ్డాయి. ఇక‌, ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు మాత్రం యధావిధిగా మార్చి 11 నుంచి 31 వరకు జరగనున్నాయి. 
 

By
en-us Political News

  
యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు పండుగ రోజు.
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి సమక్షంలో శుక్రవారం దాదాపు ఐదుగంటల పాటు  సత్యప్రసాద్‌ తన వాంగ్మూలాన్ని నమోదు చేయించారు. ఈ ప్రక్రియలో పలువురు న్యాయవాదులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు   పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కీలక బాధ్యతలు నిర్వర్తించిన సత్యప్రసాద్, ఈ అక్రమ వసూళ్ల తంతు ఎలా సాగిందో సవివరంగా న్యాయమూర్తి ఎదుట చెప్పారు.
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.