పీఆర్సీ రగడ.. వనమా మరో చిట్టా.. పీఎంకు లేఖాస్త్రం.. టాప్ న్యూస్@7PM

Publish Date:Jan 8, 2022

Advertisement

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటన మూడవ రోజు కొనసాగుతోంది. శనివారం ఉదయం కుప్పం ఆర్అండ్‌బి అతిథిగృహం వద్ద టీడీపీ కార్యకర్తలు, నాయకులు.నియోజకవర్గ ప్రజల సమస్యలపై బాబుకు వినతి పత్రాలు అందించారు. అక్కడి నుంచి పార్టీ కార్యాలయానికి చేరుకున్న టీడీపీ అధినేత... పార్టీ ఆఫీస్‌ను పరిశీలించారు. అనంతరం సొంత నివాసం నిర్మాణ పనులు ప్రారంభించడానికి  స్థలం ఎంపిక, పరిశీలన వంటి అంశాలపై నాయకులతో పార్టీ కార్యాలయంలో  చంద్రబాబు చర్చలు నిర్వహించారు
-------
ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు విషయంలో జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి విమర్శలు గుప్పించారు. వైసీపీ ప్రభుత్వం అటు ఉద్యోగులను, ఇటు నిరుద్యోగులను ఇద్దరినీ నిరాశ పరిచిందన్నారు. పదవీ విరమణ వయస్సును 60నుంచి 62 ఏళ్లకు పెంచడం ద్వారా నిరుద్యోగుల ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లిందన్నారు. సీపీఎస్ రద్దు, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంశంలోనూ చేతులెత్తేసినట్లు తులసిరెడ్డి వ్యాఖ్యలు చేశారు. 
----
సీఎం జగన్ పీఆర్సీ విషయంలో ఉద్యోగులను నిరుత్సాహానికి గురిచేశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. కొందరు ఉద్యోగ సంఘ నేతలు బాగానే ఉందని కంటి తుడుపు మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సజ్జల ఉద్యోగ సంఘాల నేతలతో సంతృప్తిగా ఉందని పాజిటివ్ స్టేట్ మెంట్స్ ఇప్పించారన్నారు.
----
ఆదివారం జరగాల్సిన జనసేన పార్టీ కార్యనిర్వాహక సమావేశం వాయిదా పడింది. కోవిడ్ కేసులు పెరుగుతున్నందున వాయిదా వేసినట్లు పార్టీ నేతలు ప్రకటించారు.ఈనెల 9న సమావేశంలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొంటున్నట్లు తొలుత ప్రకటించారు. కాగా మూడు రోజుల నుంచి పెరుగుతున్న కేసులతో పార్టీ పునరాలోచనలో పడింది. కార్యకర్తలు, అభిమానుల శ్రేయస్సు దృష్ట్యా వాయిదా వేసినట్లు ప్రకటించింది. 
----------
కాంగ్రెస్ శిక్షణ శిబిరాలు వాయిదా పడ్డాయి. కొవిడ్ కారణంగా వాయిదా వేస్తున్నట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. ఈ నెల 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకు సెలబ్రిటీ రీసార్ట్స్‌లో ఏఐసీసీ శిక్షణ శిబిరాన్ని నిర్వహించేందుకు టీపీసీసీ ఏర్పాట్లు చేసుకుంది. దేశంలో.. రాష్ట్రంలో రోజు రోజుకూ కరోనా పెరిగిపోతోంది. ఈ క్రమంలనే కాంగ్రెస్ శిక్షణా శిబిరాలను వాయిదా వేసింది.
----
కోరుట్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ఇంట్లో స్వల్ప అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. శనివారం తెల్లవారుజామున ఇంట్లో పిండి పదార్థాలు చేస్తుండగా గ్యాస్ లీకై ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే భార్య సరోజకు స్వల్పగాయాలు కావడంతో వెంటనే హైదరాబాద్‎లోని ఓ ఆస్పత్రికి తరలించారు. 
---
రామ‌కృష్ణ‌ను బెదిరించిన‌ట్లు ఎమ్మెల్యే వ‌న‌మా కొడుకు  రాఘ‌వ అంగీక‌రించాడ‌ని పాల్వంచ‌ ఏఎస్పీ రోహిత్ రాజ్ చెప్పారు. ఈ నెల 3న పాత పాల్వంచ‌లో రామ‌కృష్ణ దంప‌తు‌లు, ఇద్ద‌రు కుమార్తెలు మృతి చెందార‌ని తెలిపారు. భార్య‌, కుమార్తెల‌పై పెట్రోల్ పోసి నిప్పు అంటించి, తన‌కు కూడా నిప్పు అంటించుకుని రామ‌కృష్ణ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌ని వివ‌రించారు. అనంత‌రం రామ‌కృష్ణ బావ‌మ‌రిది జ‌నార్ద‌న్ చేసిన ఫిర్యాదుతో తాము కేసు న‌మోదు చేశామ‌ని తెలిపారు.
------
‘మీ మౌనం విద్వేష గళాలకు మరింత ధైర్యాన్నిస్తోంది’’ అంటూ బెంగళూరు, అహ్మదాబాద్‌లలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ విద్యార్థులు, ఫ్యాకల్టీ సభ్యులు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి  లేఖ రాశారు. దీనిపై 183 మంది సంతకాలు చేశారు. మన దేశ బహుళ సంస్కృతుల కలనేతకు తాము విలువనిస్తామని, అటువంటి తమకు మన దేశంలో పెరుగుతున్నఅసహనంపై మీ మౌనం నిరుత్సాహం కలిగిస్తోందన్నారు.
---
దక్షిణ చైనాలోని చాంగ్ కింగ్ మున్సిపాలిటీలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో 16 మంది దుర్మరణం చెందగా, మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. చాంగ్ కింగ్ నగరంలోని క్యాంటీన్‌లో గ్యాస్ లీక్ కారణంగా పేలుడు సంభవించిందని చైనా ప్రభుత్వ అధికారులు చెప్పారు. ఈ పేలుడు ధాటికి క్యాంటీన్ కుప్పకూలిపోయింది. మృతదేహాలను శిథిలాల నుంచి వెలికి తీశారు.
---
జాతీయ పవర్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌షి్‌పలో హైదరాబాద్‌కు చెందిన వైష్ణవి మూడు పతకాలు సాధించి సత్తా చాటింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఈనెల 6వ తేదీన జరిగిన పోటీల్లో వైష్ణవి సబ్‌ జూనియర్‌ 84 కిలోల విభాగంలో పసిడి పతకం నెగ్గింది. ఇదే విభాగంలో స్క్వాట్‌ అండ్‌ బెంచ్‌ ప్రెస్‌, డెడ్‌ లిఫ్ట్‌లో రెండు కాంస్యాలు కొల్లగొట్టి అదరగొట్టింది.

By
en-us Political News

  
రేపే మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌.. ప్రశాంతంగా సాగేనా.?
విజయసాయి ఈ వీడియో చేయడం వెనుక పొలిటకల్ స్ట్రాటజీ ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తారకరత్న కుమార్తెతో వీడియో చేయడం ద్వారా తెలుగుదేశం శ్రేణుల మద్దతు పొంది తన పొలిటికల్ రూట్ లో ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ర్నాబ్ తుపానుతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ సరఫరాను సత్వరమే పునరుద్ధరించడానికి తమిళనాడు సహాయాన్ని కోరింది. ఈ మేరకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తమిళనాడు ప్రభుత్వాన్ని  రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ పునరుద్ధరణ  వేగవంతం చేయడానికి  అదనపు విద్యుత్ శాఖ సిబ్బందిని, పరికరాలను కోరారు.
సాధారణంగా వైసీపీ ఎకో సిస్టమ్ ఎలా ఉంటుందంటే.. ఎవరైనా సరే  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని , ఆయన పాలనా విధానాలను పొగిడితే వెంటనే ఆ పొగిడిన వారిపై విమర్శలు గుప్పించేస్తుంది. ఇందుకు గతంలో చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయి.
పులివెందుల మునిసిపోల్ రణరంగంగా మారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పోలీసులూ అప్రమత్తమయ్యారు. ఎలాంటి హింసాత్మక ఘటనలకూ తావులేకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అవసరమైతే  ఇటు తెలుగుదేశం కూటమి, అటు వైసీపీకి చెందిన ముఖ్య నేతలను హౌస్ అరెస్టు చేసేందుకైనా వెనుకాడబోమని పోలీసులు విస్పష్ట హెచ్చరికలు జారీ చేశారు.
గతంలో రాష్ట్ర రాజకీయాలలో  కొండా సురేఖ కేటీఆర్ పై చేసిన వ్యక్తిగత విమర్శలు  దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పిన కొండా సురేఖ వాటిని ఉపసంహరించుకున్నారు.   గతంలో కేటీఆర్ పై తాను చేసిన అనుచిత వ్యాఖ్యలను  పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా  పేర్కొన్నారు. 
తెలంగాణ రాజకీయాలలో ఏ పార్టీతోనూ పొత్తు లేదు లేదంటూనే జనసేనతో పొత్తుకు తహతహలాడుతోంది. తెలంగాణలో స్వంతంగానే బరిలోకి దిగుతామని కుండబద్దలు కొట్టిన బీజేపీ ఇప్పుడు జనసేనతో అంతర్గత పొత్తు కుదుర్చుకుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 
నియోజకవర్గంలో రాబోయే మున్సిపల్ చైర్మన్ ఎన్నికలను తెలుగుదేశం కూటమి గెలుచుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. వైసీపీకి పులివెందుల ఇంకెంత మాత్రం కంచుకోట కాదని విస్పష్టంగా పేర్కొన్నారు.  దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న పులివెందులలో కూటమి నేతలు నేరుగా సవాళ్లు విసురుతుండటం పులివెందులలో మసకబారిన వైసీపీ ప్రతిష్ఠకు, పలుకుబడికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
అయితే, ప్రస్తుతం సిద్ధమవుతున్న చార్జ్‌షీట్‌ను మరింత పటిష్టంగా రూపొందించేందుకు ఉన్నతాధికారులు ఢిల్లీలోని ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాదులతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. సాంకేతిక సాక్ష్యాలు, బాధితుల వాంగ్మూలాల ఆధారంగా ఈ అదనపు చార్జిషీట్ ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
స్థానిక  సన్నాహాలపై తెలుగుదేశం కూటమికి చెందిన దాదాపు 45 వేల మంది ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు,  కార్యకర్తలతో  సీఎం చంద్రబాబు ఈ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై చంద్ర నిప్పులు చెరిగారు.
కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో 4-0తో ఎన్డీఏ క్లీన్ స్వీప్.!
జగన్‌ తాను మళ్లీ  అధికారంలోకి వస్తానంటూ జగన్ 2.o అంటూ చేసిన వ్యాఖ్యలకు పవన్ కల్యాణ్ మేం 10x చూపిస్తామంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.  తెలుగుదేశం కూటమి ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ జగన్ చేసిన హెచ్చరికలకు పవన్ కల్యాణ్  దీటుగా ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ పొలిటికల్ సర్కిల్స్ లోనూ, సోషల్ మీడియాలోనూ కూడా పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.  
పులివెందుల నియోజకవర్గ పరిధిలో కూటమి అభ్యర్థులు స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. దశాబ్దాల కాలంగా ఎలాంటి ప్రతిఘటన లేకుండా ఏకపక్షంగా జగన్ కు పట్టుఉన్న నియోజకవర్గం పులివెందుల. అటువంటి పులివెందులలో ఎంపీటీసి జడ్పీటీసి స్థానాలను టీడీపీ  ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.