చెరువులను మింగేశారు.. వైసీపీ వీరంగం.. కేటీఆర్ కంప్లైంట్.. మెట్రో కష్టాలు.. టాప్ న్యూస్@8PM

Publish Date:Nov 24, 2021

Advertisement

టీడీపీ అధినేత చంద్రబాబు  చిత్తూరు జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. తిరుచానూరులో పర్యటించిన సందర్భంగా సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ ఒక వృద్ధుడని, ప్రజల్లో తిరగలేక వీడియో కాన్ఫరెన్స్ లు పెడుతుంటాడని ఎద్దేవా చేశారు. వైసీపీ పతనం ప్రారంభమైందని అన్నారు. తాగునీటి సంఘాలు పనిచేసి ఉంటే ఇవాళ చెరువులు తెగేవా? అని ప్రశ్నించారు. తాము చెరువులను ఆధునికీకరించామని, వైసీపీ నేతల్లా ఆక్రమించుకోలేదని స్పష్టం చేశారు
-------
గుంటూరు జిల్లాలో ఓ టీడీపీ కార్యకర్తపై వైసీపీ రౌడీమూకలు అత్యంత దారుణంగా దాడికి పాల్పడ్డారంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను పంచుకున్నారు. ఓ వ్యక్తిని రోడ్డు డివైడర్ పై పడేసి కొందరు తీవ్రంగా కొట్టడం ఆ వీడియోలో కనిపించింది. దీనిపై లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ అరాచకాలలో ఆఫ్ఘనిస్థాన్ ను మించిపోయిందని మండిపడ్డారు.
-------
రాష్ట్రంలోని బీసీల అభివృద్ధికి ప్రభుత్వం విప్లవాత్మక చర్యలు తీసుకుంటుందని సీఎం జగన్ అన్నారు. శాసనసభలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం జగన్‌ను డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మంత్రులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ, సీదిరి అప్పలరాజు, బీసీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కలిశారు. బీసీ జనగణన చేయాలని కేంద్రాన్ని కోరుతూ శాసనసభలో తీర్మానం చేయడంపై జగన్‌ను బీసీ నేతలు కలిసి సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. 
--------
ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సినిమాటోగ్రఫీ చట్టానికి సవరణ బిల్లును రాష్ట్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి పేర్ని నాని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సవరణ బిల్లు తీరుతెన్నులను వివరించారు. ప్రభుత్వం నిర్దేశించిన మేరకే షోలు ప్రదర్శించాల్సి ఉంటుందని, టికెట్ల ధరలు కూడా ప్రభుత్వ నియమనిబంధనలకు లోబడి ఉంటాయని స్పష్టం చేశారు. సినిమా టికెట్లను ఆన్ లైన్ లో కొనుగోలు చేయవచ్చని వెల్లడించారు.
----
ఇటీవలి భారీ వర్షాలకు తిరుమల ఘాట్‌రోడ్డులో విరిగిపడిన కొండచరియలను చెన్నై ఐఐటీ నిపుణుల బృందం బుధవారం పరిశీలించింది. అలిపిరి, తిరుమలలోని పలు ప్రాంతాలను, రెండు ఘాట్‌రోడ్లలోని కొండచరియలను ఐఐటీ నిపుణులకు టీటీడీ అధికారులు చూపించారు. కొండ చరియలు విరిగిపడకుండా పటిష్టమైన చర్యలకు సంబంధించి ఐఐటీ నిపుణులు త్వరలో సమగ్ర నివేదికను టీటీడీ ఉన్నతాధికారులకు అందించనున్నారు.
----------
జీహెచ్ఎంసీ కార్యాల‌యంపై బీజేపీ కార్పొరేట‌ర్ల దాడిని టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పందించారు. బీజేపీకి చెందిన కొందరు పోకిరీలు, దుండగులు.. జీహెచ్ఎంసీ కార్యాలయపై దాడికి పాల్పడ్డారని కేటీఆర్ ఆరోపించారు. బీజేపీ కార్పొరేట‌ర్లు రౌడీలు, గుండాల్లా వ్య‌వ‌హ‌రించారని ఆయన ట్వీట్ చేశారు. గాడ్సే భ‌క్తులు గాంధీ మార్గాన్ని అనుస‌రిస్తార‌ని ఎలా అనుకుంటారని ట్వీట్టర్ ద్వారా విమర్శించారు కేటీఆర్. 
-----------
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ నేత విజయశాంతి విమర్శలు గుప్పించారు. హైదరాబాద్‌లో పురాణకాలపు మూసీనది, హుస్సేన్ సాగర్ నిర్వహణ తీరు తెన్నులపై హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీశ్ చంద్రశర్మ చేసిన వ్యాఖ్యలు విని రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుతో తలవంచుకోవాలని ఆమె అన్నారు. మూసీని చూసి మురుగునీటి నాలా అనుకున్నానని... ఆయన అన్న మాటలు తెలంగాణ సర్కారుకు ప్రజారోగ్యం పట్ల ఉన్న శ్రద్ధ ఏమిటన్నది అర్థమవుతుందని విజయశాంతి మండిపడ్డారు
----
హైదరాబాద్‌ మెట్రోకు భారీ నష్టాలు వస్తున్నాయని హైదరాబాద్‌ మెట్రో ఎండీ కేవీబీ రెడ్డి తెలిపారు.  సీఎం కేసీఆర్‌తో ఇటీవల జరిగిన సమావేశంలో మెట్రో ఆర్థిక ఇబ్బందులను వివరించామని తెలిపారు. మెట్రో బెయిల్ ఔట్‌కు కమిటీ ఏర్పాటు చేశామని, నాలుగు రోజుల్లో నివేదిక ఇస్తామన్నారని చెప్పారు. ఆరు వారాలు గడిచినా ఎలాంటి పురోగతి కనిపంచడంలేదన్నారు. మెట్రోకు రోజుకు రూ. 5 కోట్ల మేర నష్టం వాటిల్లుతోందని, గత త్రైమాసికంలో మెట్రోకు రూ.445 కోట్ల నష్టం వచ్చిందని వెల్లడించారు. 
-------
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ కాన్వాయ్‌పై బీజేవైఎం కార్యకర్తలు కోడిగుడ్లతో దాడి చేశారు. పూరీ నగరంలోని దర్జీపోఖారీ ఛక్‌ వద్ద ఈ దాడి జరిగింది. శ్రీ జగన్నాథ్‌ పరికర్మ ప్రాజెక్టు శంకుస్థాపనకు సీఎం పట్నాయక్‌ వెళ్లి తిరిగి వస్తుండగా ఈ దాడికి పాల్పడ్డారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రతను ఛేదించుకుని బీజేవైఎం కార్యకర్తలు అత్యంత సమీపం నుంచి సీఎం కాన్యాయ్‌పైకి కోడిగుడ్లు విసిరారు. ఇవి నేరుగా ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న కారు అద్దాలకు తగిలాయి.
---
భారత మాజీ క్రికెటర్, ఢిల్లీ పార్లమెంటు సభ్యుడు గౌతమ్ గంభీర్‌కు కశ్మీర్ ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల నుంచి బెదిరింపులు వచ్చాయి.రాజకీయ నాయకుడిగా మారిన క్రికెటర్‌కు ఈమెయిళ్ల రూపంలో బెదిరింపులు వచ్చాయి.దీంతో కశ్మీర్ ఐసిస్ ఉగ్రవాదుల నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆరోపిస్తూ బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.గంభీర్‌కు బెదిరింపు లేఖ పంపిన ఈ-మెయిల్ అడ్రస్‌ను గుర్తించేందుకు పోలీసులు విచారణ జరుపుతున్నారు.

By
en-us Political News

  
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.