బుగ్గనకు షాక్.. యనుమల సెటైర్లు.. రేవంత్ కు ఝలక్.. టాప్ న్యూస్@1PM

Publish Date:Nov 17, 2021

Advertisement

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తరలించారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ముందు విజయవాడలోని ఓ ఆస్పత్రిని సంప్రదించగా ఆయనకు కోవిడ్ లక్షణాలు ఉన్నట్లుగా అనుమానించారు. వెంటనే గవర్నర్ వ్యక్తిగత వైద్యులు ఆయనను హైదరాబాద్‌కు తరలించారు. 
---
అసెంబ్లీ నిర్వహించాలని రాజ్యాంగం గుర్తు చేసిందని... ఆరునెలలకు ఒసారైనా అసెంబ్లీ పెట్టాలనే నిబంధన రాజ్యాంగంలో లేకపోతే అది కూడా పెట్టేవారు కాదేమో అని శాసనమండలి ప్రధాన ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు అన్నారు. పార్లమెంట్‌కు మరే ఇతర రాష్ట్రాలకు లేని కోవిడ్ నిబంధనలు ఏపీ ప్రభుత్వానికే వర్తిస్తున్నాయా అని ప్రశ్నించారు. ఒక్కరోజు అసెంబ్లీతో ఒరిగేదేమీ లేదని వ్యాఖ్యానించారు. 14 ఆర్డినెన్సులు ప్రవేశపెట్టి ఎలాంటి చర్చా లేకుండా ఆమోదింపచేసుకోవటం వల్ల ప్రజలకు ఏం ఉపయోగమని నిలదీశారు
---
కొవిడ్ రోగులకు సరైన సౌకర్యాలు కల్పించడం లేదంటూ  తిరుపతిలో రోగులు ఆందోళనకు దిగారు. తిరుపతి విష్ణు నివాసం క్వారంటైన్ కేంద్రంలో నిరసన చేపట్టారు. తాగునీటిలో పురుగులు వస్తున్నాయని బాధితులు ఆవేదన చెందారు. అల్పాహారం, భోజనం నాణ్యతగా లేవని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదు చేస్తే కూడా పట్టించుకోవడం లేదని నిరసన తెలుపుతున్నారు. ---
తమకు కంచుకోటగా చెప్పుకునే ప్రకాశం జిల్లాలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. దర్శీ నగర పంచాయతీని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. దర్శి నగర పంచాయతీలోని 20 వార్డుల్లో టీడీపీ 13, వైసీపీ 7 వార్డులు గెలుచుకున్నాయి. దర్శిలో గెలవడానికి వైసీపీ అన్ని రకాల ప్రయత్నాలు చేసింది. భారీగా డబ్బు వెదజల్లింది. అయినా టీడీపీ చేతిలో పరాజయం తప్పలేదు. 
---
 నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలం మున్సిపాలిటీ కౌంటింగ్ లో ఉద్రిక్తతలు తలెత్తాయి.8వ వార్డులో మొదట ఓట్ల లెక్కింపులో టీడీపీ అభ్యర్థి మూడు ఓట్లతో గెలిచినట్లు ప్రకటించారు. తర్వాత వైసీపీ అభ్యర్థి కోరడంతో రీకౌంటింగ్ జరిపారు. అయితే రీకౌంటింగ్ తర్వాత వైసీపీ అభ్యర్థి గెలిచినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. దీంతో రీకౌంటింగ్ లో అక్రమాలు జరిగాయంటూ టీడీపీ అభ్యర్థి కౌంటింగ్ హాల్ దగ్గర ఆందోళనకు దిగాడు. 
---
బేతంచెర్ల మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌కు భారీ షాక్ తగిలింది. బుగ్గన నివాసం ఉండే 15 వార్డులో వైసీపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. వైసీపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థిపై టీడీపీ అభ్యర్థి వెంకట సాయి కుమార్ 114 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఈ గెలుపుతో టీడీపీ శ్రేణులు బేతంచెర్లలో సంబరాలు చేసుకుంటున్నాయి.
---
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా వెంకట్ రాంరెడ్డి నామినేషన్‌పై ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. నామినేషన్ పాత్రలు దాఖలు చేసే సమయంలో ఫిర్యాదు దారులను లోపలికి అనుమతించాలన్నారు. ఎన్నికల నిర్వహణ అధికారులు, టీఆర్ఎస్ పార్టీ వెంకట్ రాం రెడ్డికి సహకారం అందిస్తోందని ఆరోపించారు. 
----
తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు చేదు అనుభవం ఎదురైంది. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి  వెంకట్‌రాంరెడ్డిపై స్పీకర్‌కు ఫిర్యాదు చేసే క్రమంలో ఎల్పీ ముందు మీడియాకు అనుమతించేందుకు అసెంబ్లీ సిబ్బంది నిరాకరించారు. దీంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సీఎల్పీ కార్యాలయంలోనే సమావేశమయ్యారు
--------
ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీజేపీ, టీఆర్‌ఎస్ పార్టీల నాయకులపై 15 కేసులు నమోదు అయ్యాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉల్లంఘన, శాంతి భద్రతలకు విఘాతం, రైతులు, పోలీసులపై దాడుల చేయడంపై కేసులు నమోదయ్యాయి. నల్గొండ జిల్లాలో ఇరుపార్టీ నాయకులపై నల్గొండ రూరల్, మిర్యాలగూడ వన్ టౌన్, మాడ్గుల పల్లి, వేముల పల్లి పోలీస్ స్టేషన్లలో పోలీసులు పది కేసులు నమోదు చేశారు.
-------
ముఖ్యమంత్రి స్టాలిన్‌ మినహాయించి మిగతా డీఎంకే నేతలు సక్రమంగా పని చేయడం లేదని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు, నటి ఖుష్బూ విమర్శించారు. స్థానిక పట్టణంబాక్కం బీచ్‌ రోడ్డులో నివసిస్తున్న మత్స్యకారుల కుటుంబాలకు బీజేపీ తరఫున రొట్టెలు, పాలు తదితరాలను ఖుష్బూ పంపిణీ చేశారు. కొళత్తూర్‌ నియోజకవర్గంలో పదేళ్లుగా ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఆ నియోజకవర్గంలో భారీస్థాయిలో చేరిన వరద నీటిని తొలగించడంలో విఫలమయ్యారని అన్నారు. 
---

By
en-us Political News

  
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.