పులులు కాదు పిల్లులు.. గంట క‌ళ్లు మూసుకుంటే.. మాకూ బీపీ.. టాప్‌న్యూస్ @7pm

Publish Date:Oct 22, 2021

Advertisement

1. కొన్ని పిల్లులు తాము పుల‌ల‌మ‌నుకుంటున్నాయి.. మా పార్టీ ఆఫీసులో ప‌గిలింది అద్దాలు మాత్ర‌మే.. మా కార్య‌క‌ర్త‌ల గుండెల‌ను మీరు గాయ‌ప‌ర‌చ‌లేరు.. ఒక చెంప మీద కొడితే రెండు చెంప‌లు వాయ‌గొడ‌తాం.. అంటూ టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ వైసీపీని తీవ్ర స్థాయిలో హెచ్చ‌రించారు. ప‌సుపు జెండా చూస్తే వైసీపీ శ్రేణుల‌కు ఎందుకంత భ‌య‌మ‌ని ప్ర‌శ్నించారు. ఏపీలో గంజాయి దందా బాగా న‌డుస్తోంది.. దీనిపై నిల‌దీస్తే టీడీపీ కార్యాల‌యంపై దాడి చేశార‌ని మండిప‌డ్డారు. ఏపీ సీఎంగా మ‌ళ్లీ చంద్ర‌బాబు ప్ర‌మాణ స్వీకారం చేయ‌డం ఖాయ‌మ‌న్నారు నారా లోకేశ్‌. 

2. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ఆయ‌న‌ గంట కళ్లు మూసుకుంటే తామేంటో చూపిస్తామంటూ పరిటాల సునీత వైసీపీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ‘‘మాలో ప్రవహించేది సీమ రక్తమే’’ అన్నారు. తన భర్తను చంపినప్పుడు కూడా ఓర్పుగా ఉండమన్నారు కాబట్టే ఉన్నామని.. ఆనాడే చంద్రబాబు కన్నెర్ర చేసి ఉంటే ఒక్కరు కూడా మిగిలి ఉండే వారు కాదని హెచ్చ‌రించారు. ఇక‌నైనా చంద్రబాబు తీరు మారాల‌న్నారు. తాము అధికారంలోకి వచ్చాక వైసీపీకి చుక్కలు చూపిస్తామని పరిటాల సునీత గ‌ట్టిగా హెచ్చరించారు. 

3. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష స్థానానికి నామినేషన్ల గడువు ముగిసింది. కేసీఆర్ పేరును బలపరుస్తూ మొత్తం 18 నామినేషన్లు దాఖలు అయ్యాయి. దీంతో కేసీఆర్ ఎన్నిక లాంఛనమే కానుంది. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష స్థానానికి వచ్చిన నామినేషన్లను శనివారం పరిశీలిస్తారు. ఈ నెల 25న టీఆర్ఎస్ ప్లీనరీ జరుగనుంది. ప్లీనరీలో టీఆర్ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ పేరును రిటర్నింగ్ అధికారి అధికారికంగా ప్రకటించనున్నారు. టీఆర్ఎస్ పార్టీ ఏర్పడి 20 వసంతాలు కావడంతో 25న పార్టీ తరపున ద్విదశాబ్ది ఉత్సవాలను నగరంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. 

4. టీడీపీ ఫైర్‌బ్రాండ్ లీడ‌ర్ చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ సీఎం జ‌గ‌న్‌రెడ్డితో పాటు మంత్రుల‌పై ఓ రేంజ్‌లో విరుచుకుప‌డ్డారు. ‘‘మంత్రి పదవి కోసమే ఇన్నాళ్లూ కొడాలి నాని టీడీపీ నేతలను తిట్టారు. త్వరలోనే ఆయన పదవి పోవడం ఖాయం. జగన్‌కే కాదు.. గాడ్సేకు కూడా అభిమానులున్నారు. మేమూ ఉప్పూకారం తింటున్నాం.. మాకూ బీపీ వస్తుంది’’ అని చింతమనేని ప్రభాకర్ హెచ్చ‌రించారు. రాష్ట్రంలో ఎన్నికల జరగాల్సిన స్థానిక సంస్థలకు నోటిఫికేషన్‌ ఇస్తే వైసీపీకి ముచ్చెమటలు పట్టిస్తామన్నారు చింతమనేని. 

5. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని పరిరక్షించాలని కోరుతూ నవంబర్ 1 నుంచి రైతులు మహా పాదయాత్ర చేప‌డుతున్నారు. తుళ్లూరు గ్రామం నుంచి తిరుమల వరకు 45 రోజుల పాటు పాద‌యాత్ర కొన‌సాగనుంది. డిసెంబర్ 17వ తేదీతో పాదయాత్ర ముగియనుంది. మహా పాదయాత్రకు పలు పార్టీల మద్దతు కూడ‌గ‌డుతున్నారు. తాజాగా, మహా పాదయాత్రకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ మద్దతును రాజధాని రైతుల ప్రతినిధులు కోరారు. శుక్రవారం జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకుడు నాదెండ్ల మనోహర్‌ను రైతులు కలిసారు.

6. న్యాయమూర్తులు, న్యాయస్థానాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. తాజాగా ఆరుగురు నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరు పర్చారు. ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం 11 మందిని అరెస్టు చేసినట్టు సీబీఐ అధికారులు తెలిపారు. హైకోర్టు ఆదేశాలతో సీబీఐ అధికారులు గతేడాది నవంబర్‌ 11న దర్యాప్తు ప్రారంభించారు. మొత్తం 16 మందిపై 12 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. విదేశాల్లో ఉన్న నిందితులపై ఏవిధంగా చర్యలు తీసుకోవాలో చూడాలని గతంలో హైకోర్టు ఆదేశించ‌గా.. ఆ దిశగా సీబీఐ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 

7. చిత్తూరు జిల్లాలో వైసీపీ చేపట్టిన జనాగ్రహ దీక్షలో చంద్రబాబుపై రెస్కో చైర్మన్‌ జీఎస్‌ సెంథిల్‌కుమార్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ‘చంద్రబాబూ.. కుప్పం వస్తే కారు మీద బాంబు వేస్తా.. దమ్ముంటే కుప్పంకి రా రా..’ అంటూ బ‌రితెగింపు మాట‌లు మాట్లాడారు. ఎంపీ రెడ్డెప్ప సమక్షంలోనే ఇలా రెచ్చిపోయారు. చంద్ర‌బాబుపై వైసీపీ లీడ‌ర్ సెంథిల్‌కుమార్ చేసిన తీవ్ర వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. సెంథిల్‌కుమార్‌పై టీడీపీ శ్రేణులు భ‌గ్గు మంటున్నాయి.

8. అమ్మను వదిలేసినవాడు అమ్మఒడి ఇస్తాడా? అని అమరావతి జేఏసీ అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావు ప్రశ్నించారు. ‘‘చెల్లిని వదిలేసిన వాడికి సెంటిమెంట్స్ ఉంటాయా? జగన్మోహన్ రెడ్డి తన సమాధిని తానే కట్టుకుంటున్నాడు. అరాచకంతో అధికారంలోకి వచ్చిన ఏ నాయకుడూ పూర్తికాలం అధికారంలో లేడు. ఈరోజు నుంచి సీఎం జగన్ గంజాయి ముఖ్యమంత్రి. జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తెచ్చినవారే సమాధి చేస్తారు. తాడేపల్లి నుంచి తరిమికొట్టే రోజు దగ్గరలోనే ఉంది. ఆంధ్రప్రదేశ్ బిడ్డల భవిష్యత్ కోసం ప్రజలంతా తిరగబడాలి. సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకు జగన్ అరాచకాన్ని సృష్టించాడు’’ అని కొలికపూడి మండిప‌డ్డారు. 

9. తిరుమ‌ల‌ శ్రీవారి దర్శనం టికెట్లను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. నవంబర్, డిసెంబర్ నెల‌లకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ టికెట్లను ఆన్‌లైన్లో ఉంచింది. రోజుకి 12 వేల చొప్పున 7.8 లక్షల టికెట్లను టీటీడీ విడుదల చేసింది. అయితే, నాలుగు గంటల్లోనే ఆన్‌లైన్‌ టికెట్ల విక్రయాలు పూర్తయ్యాయి. ఆన్‌లైన్‌ టికెట్ల విక్రయంతో టీటీడీకి 21 కోట్ల రాబడి వచ్చింది. 

10. కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీలో 100 కోట్ల మైలురాయిని అధిగ‌మించిన సంద‌ర్భంగా ఈ ప్రయాణాన్ని ‘ఆందోళన నుంచి భరోసా’ వరకు అని ప్ర‌ధాని మోదీ అభివర్ణించారు. ‘‘దాదాపు 100 ఏళ్ల తర్వాత మానవాళి ఇంతటి ఘోరమైన మహమ్మారిని ఎదుర్కొంటోంది. కన్పించని శత్రువు వేగంగా పాకుతుంటే ఏం చేయాలో కూడా పాలుపోని పరిస్థితుల్లో పడిపోయాం. అలాంటి ఆందోళనల నుంచి బయటపడి టీకాలు తయారుచేసుకున్నాం. ఇప్పుడు 100 కోట్ల మైలురాయిని దాటుకుని మహమ్మారి నుంచి బయటపడగలమనే భరోసా ఇవ్వగలుగుతున్నాం. ఈ ప్రయాణంతో మనం మరింత బలంగా మారాం. దీని కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు’’ అని మోదీ అన్నారు. 

By
en-us Political News

  
దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ ప్రముఖులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇండియా కూటమి నేతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమంలో వేదికపై అతిథుల సీటింగ్  అరేంజ్ మెంట్ లో ప్రాధాన్యతల క్రమం రాజకీయ చర్చకు తెరలేపింది.  
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, టీటీడీ పాలకమండలి మాజీ సభ్యుడు ఓవీ రమణ టీటీడీ రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయి పెట్టబోయే కొత్త పార్టీలో చేరనున్నారు. రాబోయే పార్టీలో చేరబోయే తొలి నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారు.
 రాష్ట్రంలోని పలు కీలక మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు పలు మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో జనసేన  మేయర్లు, ఛైర్మన్ పదవుల కోసం బరిలో నిలవనున్నారు. ముఖ్యంగా శ్రీకాకుళం, కాకినాడ, ఏలూరు, విజయవాడ వంటి ప్రముఖ మున్సిపల్ కార్పొరేషన్లలో జనసేన అభ్యర్థులను తొలి జాబితాలో ప్రకటించింది. 
ప్రతికూల పరిస్థితులను ఎదిరించి  గెలిచి, నిలిచిన  తనను పపారిపోయానని వంశీ విమర్శించడం హాస్యాస్పదమని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు.  గత రాజకీయ పరిణామాలను ప్రస్తావిస్తూ, గతంలో గన్నవరం అసెంబ్లీ టికెట్ దక్కక నియోజకవర్గాన్ని వదిలి విజయవాడకు పారిపోయింది తాము కాదని,   వంశీయేనని స్పష్టం చేశారు.
తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక మార్పులకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుత పరిణామాలను పరిశీలిస్తే, కొండా సురేఖ అడుగులు బీజేపీ వైపు పడుతున్నాయన్న ప్రచారం కూడా సాగుతోంది. ఇప్పటికే ఆమెకు బీజేపీనుంచి ఆహ్వానం అందిందని కూడా చెబుతున్నారు. కొండా సురేఖ బీజేపీ గూటికి వస్తే తమకు  అభ్యంతరం లేదని ఆ పార్టీ రాష్ట్ర నాయకుల నుంచి ఆమెకు స్పష్టమైన సంకేతాలు అందాయని చెబుతున్నారు.  
జగన్  ఢిల్లీ పర్యటన కేంద్రం పెద్దల ఆశీస్సులతో.. కేసుల నుంచి రక్షణ పొందేందుకేనన్న అభిప్రాయం రాజకీయవర్గాలలో వ్యక్తమైంది. అయితే జగన్ హస్తిన పర్యటన వార్తలు విస్తృతంగా ప్రచారంలోకి వచ్చి వారాలు గడిచిపోయినా ఆయన బెంగళూరు, తాడేపల్లి ప్యాలెస్ మధ్య తిరగడం తప్ప హస్తిన  ఫ్లైట్ ఎక్కలేదు.
కొండా సురేఖను కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేయాలన్న డిమాండ్  ఎవరి స్వార్థం కోసం చేసిన రచ్చ కాదు, పార్టీ క్రమశిక్షణను కాపాడేందుకు తీసుకున్న చర్య అని  వివరించారు. కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, ప్రభుత్వంని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టిన వీరేషం..  క్రమశిక్షణ రాహిత్యంగా ఎవరు మాట్లాడినా సరే సహించేది లేదు అని వీరేషం స్పష్టం చేశారు.
ప్రతిపక్ష హోదా డిమాండ్ చేస్తే రాదనీ, జనం అందుకు అవసరమైనంత మంది సభ్యులను గెలిపించి సభకు పంపాల్పి ఉంటుందనీ మధుసూదన్ రెడ్డి చెప్పారు.  
ఇటీవలి కాలంలో హిమాన్షు రావు  తన  ఫిట్‌నెస్‌తో, సరికొత్త స్టైలిష్ లుక్‌లో కనిపిస్తున్నారు.
బీజేపీలో క్రియాశీలకంగా వ్యవహరించి, హిందుత్వ వ్యవహారంలో బీజేపీని మించి మరీ గుర్తింపు పొందిన రాజాసింగ్ ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హిందుత్వ అజెండాను ఎత్తుకున్న పవన్ దృష్టి రాజాసింగ్ పై పడిందని అంటున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.