అన్న‌కు మించి చెల్లి!

Publish Date:Aug 20, 2022

Advertisement

అన్న‌ద‌మ్ములు, అన్నా చెల్లెళ్లు, అక్కాచెల్లెళ్ల మ‌ధ్య కొన్ని పోలిక‌లు చిత్రంగా క‌లుస్తాయి. చ‌దువు, సంస్కారం అవ‌త‌ల పెడితే, అస‌లు వ్య‌వ‌హార‌తీరు, ఆలోచ‌నా తీరు స‌రిగ్గా న‌ప్పేట్టు ఉంటారు ఉత్త‌ర కొరియా అధినేత కిమ్, ఆయ‌ న సోద‌రి యో జోంగ్‌. అస‌లే కొరియా ద్వీప‌ క‌ల్పంలో ఉద్రిక్త‌ల వాతావ‌ర‌ణం కొన‌సాగు తోంది. ఇక లాభం లేద‌ని ద‌క్షిణ కొరియా వారు ఒక ప్ర‌తిపాద‌న చేశారు. కానీ కిమ్ కంటే మొండివాడు ఎవ‌రుంటారు? అందుకునే ద‌క్షి ణాది వారి మాట వినేదే లే.. నేను త‌గ్గేదేలే.. అనుకుని కిమ్ అణ్వాయుధాల‌ను ఆపే ప్ర‌స‌క్తే లేద‌ని అన్నాడు. ద‌క్షిణాదివారు ఎవ‌రికి ఏమ‌ని న‌చ్చ‌జెప్పాల‌నుకున్నారు. ముందే ఉలిపిక‌ట్టె, కోపిష్టి అలాంటివారికి పోనీ ఈ పూట వింటాడేమోన‌నుకోవ‌డినికి ఆయ‌నే మ‌న్నా పెద్ద‌బావ‌గారా.. చేప‌ల‌పులుసు తిన్న వ్యామోహంలో ఓకే అన‌డానికి!

ప్రత్యర్థులపై విరుచుకుపడటంతో ఉత్తర కొరియా  అధినేత కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ అన్నకు తగ్గ చెల్లెలు అనిపిం చుకుంటోంది. ఈ విషయంలో ఆయన కంటే జోంగ్ రెండాకులు ఎక్కువే చదివిందనీ తేల్చింది.  తాజాగా, చర్చల విష యమై దక్షిణ కొరియా చేసిన ప్రతిపాదనపై తనదైన శైలిలో కిమ్ సోదరి వార్నింగ్ ఇచ్చింది. అణ్వాయుధాలను వదిలిపెడితే ఆర్థిక సా యం చేస్తామని దక్షిణ కొరియా చేసిన ప్రకటనపై ఆమె ఘాటుగా స్పందించారు. అసంబద్ధతకు నిలువెత్తు నిదర్శనం దక్షిణ కొరియా ఆఫర్‌ అని.. చర్చలపై కలలు కనడం మానుకోవాలని బదులిచ్చారు.

కేవలం తిండి కోసం ఎవరూ తమ లక్ష్యాలను వదలుకోరని.. ఇదో పనికిమాలిన ప్లాన్ అంటూ విరుచుకుపడ్డారు. ఈ విషయంలో దక్షిణ కొరియా అధినేత యూన్‌ సుక్‌ యేల్‌ కొంచెం నోరుమూసుకుంటే మంచిదని తీవ్ర పదజాలంతో హెచ్చరించారు. ఆయనవి అమాయక చర్యలని వ్యాఖ్యానించిన కియ్ యో.. వాటిని పిల్లచేష్టలతో పోల్చారు.

యూన్ ప్రతిపాదన నీలి సముద్రాన్ని ఎండబెట్టి మల్బరీ క్షేత్రంగా మార్చడానికి ప్రయత్నించినంత తెలివితక్కువగా ఉంది.. ఉత్తర కొరియాకు అణ్వాయుధాలను వదిలించుకునే ఉద్దేశం లేదు.. ఇవి ఆయుధాలు రాజకీయాలకు సంబంధించిన బేర సారాలు కాదు.. యూన్ సుక్ యోల్‌ను మేం మనిషిగా ఇష్టపడం.. మేలో పదవీ బాధ్యతలు స్వీకరించిన సంప్రదాయవాద దక్షిణ కొరియా నేత విషయంలో ప్యాంగ్‌యాంగ్ కఠినంగా వ్యవహరిస్తుంది’’ అని ప్రతిజ్ఞ చేశారు.

ఒక వేళ ఉత్తర కొరియా అణ్వాయుధాలను వదిలిపెడితే సాహసోపేతమైన చొరవ తీసుకుని ఆహారం, ఎనర్జీ, మౌలిక సౌకర్యాల సాయానికి ముందుకొస్తామని ఈ వారం దక్షిణ కొరియా అధ్యక్షుడు ఆఫర్ ఇచ్చారు. ఈ ఆఫర్‌ను ఉత్తర కొరియా తిరస్క రించింది. మరోవైపు, కిమ్ యో జోంగ్‌ వ్యాఖ్యలపై స్పందించిన దక్షిణ కొరియా అధ్యక్ష కార్యాలయం.. కిమ్‌ సోదరి కామెంట్లు విచారకరమని పేర్కొంది. అయినా సరే ఇప్పటికీ తమ ఆఫర్‌ అందుబాటులో ఉందని పునరుద్ఘాటించింది.

By
en-us Political News

  
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.