వరల్డ్ టాప్ టెన్ ట్రాఫిక్ రద్దీ నగరాలివే! 

Publish Date:Jan 19, 2021

Advertisement

ప్రపంచ దేశాల్లో పట్టణీకరణ వేగంగా పెరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాలు, పట్టణాలకు వలసలు పెరిగిపోతున్నాయి.  అయితే వలసలకు తగ్గట్లు మౌలిక వసతుల కల్పన నగరాల్లో సాధ్యం కావట్లేదు. దీంతో నగరాలు, పట్టణాల్లో రద్దీ పెరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా పెద్ద నగరాల్లో ట్రాఫిక్‌ రద్దీ దారుణంగా ఉంటోందని తాజా అధ్యయనం చెబుతోంది. ప్రపంచంలో ఏయే నగరాల్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉందనే అంశంపై టామ్ టామ్ సంస్థ ఒక నివేదిక వెల్లడించింది. 2020 సంవత్సరానికి సంబంధించిన ట్రాఫిక్ ఇండెక్స్‌ను Tom Tom Traffic index- 2020 పేరుతో విడుదల చేసింది. ప్రపంచంలోని ఆరు ఖండాలు, 57 దేశాల్లో మొత్తం 416 నగరాలపై ఈ సర్వే చేశారు. 2020 సంవత్సరంలో ప్రపంచంలో సగటు ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్న పది నగరాలను ఆ సంస్థ వెల్లడించింది. ఈ జాబితాలో మూడు భారతీయ నగరాలు కూడా ఉన్నాయి.

రష్యా రాజధాని మాస్కో ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న నగరాల్లో మొదటి స్థానంలో ఉంది. ఇక్కడి రోడ్లపై ట్రాఫిక్ రద్దీ అత్యధికంగా 54 శాతంగా ఉందని టామ్ టామ్ నివేదిక తెలిపింది. భారత వాణిజ్య రాజధాని ముంబై ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్న నగరాల్లో ప్రపంచ వ్యాప్తంగా రెండు, మన దేశంలో  మొదటి స్థానంలో నిలిచింది. ముంబై రోడ్లపై వాహనాల ట్రాఫిక్ రద్దీ 53 శాతంగా ఉంది.కొలంబియా కేపిటల్ బొగోటా  53 శాతం ట్రాఫిక్ రద్దీతో మూడో స్థానంలో నిలిచింది. ఫిలిప్పీన్స్‌లో రాజధాని మనీలాలో ప్రజలు సొంత వాహనాలనే ఎక్కువగా వాడతారు. ఇక్కడి రోడ్లపై  ట్రాఫిక్ రద్దీ 53 శాతంగా నమోదైంది.  మిడిల్ ఈస్ట్ దేశాల్లో టర్కీలోనే ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది.  టర్కీ రాజధాని  ఇస్తాంబుల్ లో ట్రాఫిక్ రద్దీ  51 శాతంతో  ప్రపంచ నగరాల్లో ఇది ఐదో స్థానంలో ఉంది.   

భారత్ ఐటీ నగరం బెంగళూరులో ట్రాఫిక్ సమస్య అంతకంతకు పెరిగిపోతోంది. మన దేశంలోని దక్షిణాది నగరాల్లో బెంగళూరులోనే రోడ్లపై సగటు ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ట్రాఫిక్ రద్దీ స్థాయి 51 శాతంగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ట్రాఫిక్ సమస్య ఎక్కువున్న ఆరో నగరంగా టామ్ టామ్ సంస్థ సర్వేలో నిలిచింది బెంగళూరు. ఉక్రెయిన్ దేశంలోని కైవ్ నగరంలో కూడా రద్దీ క్రమంగా పెరుగుతోంది. ఇక్కడ ట్రాఫిక్ రద్దీ స్థాయి 51 శాతంగా ఉంది. భారత రాజధాని ఢిల్లీ రద్దీ ఎక్కువగా ఉన్న నగరాల్లో దేశంలో  మూడవ స్థానంలో, మొత్తం జాబితాలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. మన రాజధానిలో ట్రాఫిక్ రద్దీ స్థాయి 47 శాతంగా ఉన్నట్లు టామ్ టామ్ వెల్లడించింది. రష్యాలోని నోవోసిబిర్స్క్ నగరం ట్రాఫిక్ రద్దీ జాబితాలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. నోవోసిబిర్స్క్ రోడ్లపై ట్రాఫిక్ రద్దీ స్థాయి 45 శాతంగా నమోదైంది. ఇక టూరిజానికి ప్రసిద్ధి చెందిన బ్యాంకాక్‌ నగరంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. అక్కడి రోడ్లపై సగటు ట్రాఫిక్ రద్దీ 44 శాతంగా ఉన్నట్లు టామ్ టామ్ తెలిపింది. బ్యాంకాక్ ఓవరాల్ లిస్టులో పదో స్థానంలో నిలిచింది. 

అయితే నగరాల్లో ట్రాఫిక్ రద్దీ విపరీతంగా పెరిగిపోతున్నా..  కరోనా మహమ్మారి వైరస్ కారణంగా గతేడాది వివిధ దేశాల్లో ట్రాఫిక్ చాలావరకు తగ్గిపోయిందని సర్వేలో తెలిసింది. అయితే ఇది తాత్కాలికమేనని.. ప్రస్తుతం పట్టణాల్లో మళ్లీ ట్రాఫిక్ రద్దీ పెరుగుతుందని టామ్ టామ్ సంస్థ వివరించింది.  
 

By
en-us Political News

  
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.