ఆత్మార్పణం చేసుకోవడం చట్టరీత్యా నేరం. సనాతన ధర్మం కూడా మహాపాపం అని బోధిస్తుంది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాకు హాజరవుతున్న రాజకీయ నాయకులు, సంపన్నులు అక్కడే చనిపోవాలని బీహార్ స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కుంభమేళాలో చనిపోతే వారికి మోక్ష ప్రాప్తి లభిస్తుందని ఆయన బోధిస్తున్నాడు. ఇటీవల అక్కడ తొక్కిసలాట జరిగి 30 మందికిపైగా చనిపోయారు. 60 కి పైగా గాయపడ్డారు. ఈ ఘటనకు యోగిఆదిత్యనాథ్ ప్రభుత్వమే కారణమని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. కానీ సదరు ఎంపీ మాత్రం యోగి ఆదిత్యనాథ్ పక్షాన నిలబడి కుంభమేళాలో చనిపోతే మోక్ష ప్రాప్తి లభిస్తుందని కొత్త నిర్వచనం చెప్పి వార్తల్లోకెక్కాడు లోక్‌సభలో పప్పు యాదవ్ మాట్లాడుతూ చనిపోయిన వారి మృతదేహాలను హిందూ సాంప్రదాయ ప్రకారం అంత్యక్రియలు జరిగాయని యుపి సర్కార్ తరపున వకాల్తా పుచ్చుకుంటే ప్రతి పక్షాలు మాత్రం వేరే విధంగా చెబుతున్నాయి. కుంభమేళ జరుగుతున్న త్రివేణి సంగమంలో మృతదేహాలను పారవేస్తున్నారని ఆరోపిస్తున్నాయి. కుంభమేళాలో చనిపోయిన వారంతా మోక్షం పొందారని ఒక బాబా తనతో చెప్పారని పప్పు యాదవ్ తెలిపారు. కాబట్టి రాజకీయ నాయకులు, ధనికులు, బాబాలు కుంభమేళాలో చనిపోవడమే మార్గమని చెప్పుకొచ్చారు చట్టాలను రూపొందించే చట్ట సభలోనే పార్లమెంటు సభ్యుడి హోదాలో భక్తులను చనిపోవాలని వింత కోరిక కోరడం ఇపుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
మోక్షానికి మూడుమార్గాలు ఉన్నవని ఆధ్యాత్మిక గురువులు చెబుతున్నారు. ఒకటి భక్తి మార్గం, రెండు జ్ఞాన మార్గం, మూడు యోగమార్గం.
ఇందులో మొదటిది భక్తిమార్గం. ఇది సులభతరం. పూజలు, వ్రతాలు, భజనలు, కైంకర్యాలను ప్రోత్సహించటం వల్ల మోక్షం పొందొచ్చు.
రెండోది జ్ఞానమార్గం. జ్ఞానులుగా జన్మించి అంటే ఎన్నోజన్మలుగా సత్కర్మలు చేసి మోక్షంవైపు వేగంగా అడుగులు వేయొచ్చు.
మూడవది యోగమార్గం. ఈ మార్గంలోఅతి కఠినమైన యోగ సాధన చేయాలి. దీనికి గురువుల అనుగ్రహం కంపల్సరీ.
ఈ మూడుమార్గాలు కాకుండా కుంభమేళాలో తొక్కిసలాటలో చనిపోవాలని ఒక ప్రజా ప్రతినిధి నిండు లోకసభలో కామెంట్ చేయడంతో ప్రజాస్వామ్యం పట్ల సదరు ఎంపీగారికి ఉన్న అవగాహన ఏంటో తెలియజేస్తుంది
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/to-attain-salvation-one-must-die-in-the-kumbh-mela-39-192416.html
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.