కాంగ్రెస్ కు తృణమూల్ మరో ఝలక్ .. రాహుల్ టార్గెట్ గా పీకే స్కెచ్

Publish Date:Nov 28, 2021

Advertisement

జాతీయ రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీని, ప్రధాన ప్రతిపక్ష స్థానం నుంచి పడగొట్టి ఆ స్థానాన్ని ఆక్రమించుకునేందుకు తృణమూల్ కాంగ్రెస్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోందా? కమలదళం కలలుకన్న కాంగ్రెస్ ముక్త భారత్ లక్ష్య సాధనకు, తృణమూల్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ నడుం బిగించారా? అంటే  రాజకీయ విశ్లేషకులు అవుననే అంటున్నారు. 

పశ్చిమ బెంగాల్  అసెంబ్లీ ఎన్నికల విజయం తర్వాత ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్  కాంగ్రెస్ పార్టీలో చేరి, స్వయంగా తానే రాజకీయ చక్రం తిప్పాలని ఆశించారు. అందుకోసం  ప్రయత్నించారు. అయితే, ఎందుకనో  ఆయన ప్రయత్నం ఫలించలేదు. ఇక అక్కడి నుంచి ఆయన మళ్ళీ మరోసారి మమతతో జట్టు కట్టి, కాంగ్రెస్ మీద కక్షకట్టారా అన్నట్లుగా, రాష్ట్రాలవారీగా, కాంగ్రెస్ జెండాను పీకేసీ ఆ స్థానంలో తృణమూల్ జెండాను ఎగరేసే వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. ముందుగా ఈశాన్య రాష్ట్ర్లపై కన్నేసిన పీకే, కొంత వరకు సక్సెస్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు కొందరు కాంగ్రెస్ ను వదిలి తృణమూల్ గూటికి చేరుతున్నారు.  ఇప్పటికే మహిళా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సుష్మితా దేవ్, గోవా మాజీ ముఖ్యమంత్రి లూజిన్‌హో ఫ‌లేరో, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమారుడు అభిజిత్ ముఖర్జీ ఇంకా ఇతర కీలక నేతలు కాంగ్రెస్ ను వదిలి తృణమూల్ తీర్ధం పుచ్చుకున్నారు. 

అంతేకాదు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ స్థానంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీని ఆవిష్కరించే ఆలోచనకు అంకురార్పణ అన్నట్లుగా మేఘాలయలో ప్రతిపక్షపీఠం నుంచి కాంగ్రెస్ పార్టీని పక్కకు నెట్టి, ఆ స్థానాన్ని తృణమూల్ ఆక్రమించుకుంది. గమ్మత్తు ఏమంటే, రెండేళ్ళ క్రితం జరిగిన మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పోటీనే చేయలేదు. కానీ, కాంగ్రెస్ పార్టీ టికెట్ పై గెలిచిన 18 మంది ఎమ్మెల్యేలలో 12 మందిని తమ వైపుకు తిప్పుకున్న తృణమూల్, వృద్ధ కాంగ్రెస్ పార్టీని పడగొట్టి ప్రధాన ప్రతిపక్ష హోదాను సొంత చేసుకుంది.మమతా బెనర్జీ ఉత్తర ప్రదేశ్, మేఘాలయ, గోవా, త్రిపుర, అస్సాం రాష్ట్రాలలో తృణమూల్ జెండాని ఇప్పటికే నిలబెట్టారు. అలాగే, జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యన్మాయంగా తృణమూల్ సారధ్యంలో మమతా బెనర్జీ నాయకత్వంలో కూటమిని ఏర్పటు చేసేందుకు ప్రశాంత్ కిషోర్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. అందులో భాగంగా ముందుగా కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్ధనే భావన తుడిచేసేందుకు, ఆయన కాంగ్రెస్ పార్టీని నైతికంగా బలహీన పరిచే వ్యూహంతో అడుగులు వేస్తున్నారని అంటున్నారు. 

ఇదే క్రమమలో తృణమూల్ కాంగ్రెస్ తాజాగా వృద్ధ కాంగ్రెస్ కు మరో ఝలక్ ఇచ్చింది. పార్లమెంట్’లోనూ కాంగ్రెస్ తో కలిసి పనిచేసేది లేదని స్పష్టం చేసింది. సోమవారం (నవంబర్ 29) నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో విపక్షాలను ఏకతాటిపైకి తేవాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీ, ఏర్పాటు చేసిన సమావేశానికి తృణమూల్ హాజరు కాదని ఆ పార్టీ నాయకులు  స్పష్టం చేశారు. విపక్షాల సమావేశానికి రావాలని  రాజ్య సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే తృణమూల్ సహా అన్ని ప్రతిపక్ష పార్టీలకు ఆహ్వానం పంపారు. అయితే కాంగ్రెస్ సారధ్యంలో జరిగే విపక్షాల సమావేశానికి తమ పార్టీ హాజరవటం లేదని టీఎంసీ సీనియర్ నేత ఒకరు తెలిపారు.అంతే కాదు, కాంగ్రెస్ పార్టీని తృణమూల్ నేత అవహేళన చేశారు.కాంగ్రెస్ పార్టీలోనే సరైన సయోధ్యత లేదని,ఆ పార్టీ నేతల్లోనే సరైన అవగాహన, లక్ష్యం లేదని ఎద్దేవా చేశారు .

మరో వంక కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో విపక్ష్ల పార్టీల ఉమ్మడి సమావేశం జరుగతున్న సమయంలోనే,  మమతా బెనర్జీ ఢిల్లీ నివాసంలో జాతీయ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ భేటీలో పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం సహా ఇతర కీలక అంశాలపై చర్చించనున్నామని తెలిపారు. కాగా కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీల మధ్య సాగుతున్న ఈ అదిపత్య పోరు, చివరకు బీజేపీకి మేలు చేసినా ఆశ్చర్య పోనవసరం లేదని, అలాగే, ప్రాంతీయ పార్టీలను ఏకం చేసేందుకు మమతా బెనర్జీ సాగిస్తున్న ప్రయత్నం ఫలిస్తే, కాంగ్రెస్ కనుమరుగైపోయినా పోవచ్చని విశ్లేషకులు అంటున్నారు.
 

By
en-us Political News

  
ఐఏఎస్‌. కేంద్ర స‌ర్వీసు ఉద్యోగులు. దేశంలోకే అత్యున్న‌త కేడ‌ర్‌. అందులోనూ ముఖ్య‌మంత్రి ముఖ్య కార్య‌ద‌ర్శి అంటే మ‌రింత ప‌వ‌ర్‌ఫుల్‌. అయితే ఏంటి? ఎవ‌రైనా, ఎంత‌టి వాడైనా.. జ‌గ‌న్ ముందు జీహుజూర్ అనాల్సిందేనా? రాజారెడ్డి రాజ్యాంగంలో అలా ఉందా? అంటూ విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఏపీలో లేటెస్ట్‌గా జ‌రిగిన ఓ ఘ‌ట‌న‌.. రాష్ట్రంలో ఐఏఎస్‌లు ఎంత దిగ‌జారిపోయారో చెప్పేందుకు సాక్షంగా నిలుస్తోంద‌నే ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే....
ఛీ.. ఛీ.. కొంద‌రు వైసీపీ నేత‌ల‌ను ఏం చేసినా పాపం లేదు. ఏపీని భ్ర‌ష్టు పట్టిస్తున్నారు దుర్మార్గులు. ఇప్ప‌టికే కేసినోతో క‌ల‌క‌లం రేప‌గా.. తాజాగా ఓ బాలిక‌తో వ్యభిచార* చేయించిన పాపిష్టి ప‌నిలోనూ అధికార పార్టీ నేత‌లే ఉండ‌టం వారి అరాచ‌కాల‌కు నిద‌ర్శ‌నం. 
కెషినో.. గ్యాంబ్లింగ్ హౌస్.. ఇప్పుడు ఏపీలో మాంచి కాక రేపుతున్న వివాదం. తెలుగు ప్రజలు.. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల నోళ్లలో కొద్దిరోజులుగా తరచుగా వినిపిస్తున్న మాట. తెలుగు ప్రజలకు ముందెప్పుడూ ప్రత్యక్షంగా తెలియని సంస్కృతి.. ఈ కెషినో గురించే ఇంతగా చర్చల్లోకి రావడానికి ఒకే ఒక్కడు కారణం.. మహామహుల పురిటిగడ్డ గుడివాడ నడిబొడ్డున కెషినో నిర్వహించిన ఘనుడు.. అతనే బూతుల మంత్రి.. డైరెక్ట్ గా పేరు చెప్పకపోయినా ఆయనెవరో ఇప్పటికే గుర్తు వచ్చే ఉంటుంది.. సంక్రాంతి పండుగ సంబరాల నెపంతో గుడివాడలో.. తన సొంత కన్వెన్షన్ సెంటర్ లో కెసినో నిర్వహించిన ఆయనపై విపక్షాలు ఒంటికాలిపై లేస్తున్నాయి. జూదరుల స్థాయిని మరో మెట్టుకు ఎక్కించిన మంత్రిని ఆ పదవి నుంచి తప్పించాలని, ఆయన శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలని టీడీపీ నేతల నుంచి ప్రధానంగా వస్తున్న డిమాండ్.
కొండా ముర‌ళి. కొండా సురేఖ‌. వెర‌సి కొండా దంప‌తులు. కొండా.. గుండా అనేది కొంద‌రి మాట‌. కొండా.. కొండంత బ‌ల‌మైన నాయ‌కుడనేది అనుచ‌రుల వాద‌న‌. పొలిటిక‌ల్ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా.. పాలిటిక్స్‌లో పీక్స్ రేంజ్‌కి ఎదిగిన నాయ‌కులు. కొండా సురేఖ‌.. మాజీ మంత్రి, ప‌లుమార్లు ఎమ్మెల్యే. కొండా ముర‌ళి ఎమ్మెల్సీగా తెర‌వెనుక రాజ‌కీయాల‌కే ప‌రిమితం. ఒక‌ప్పుడు వైఎస్సార్ అనుంగ అనుచ‌రులు. ఆ త‌ర్వాత జ‌గ‌న్ ఫాలోయ‌ర్స్‌. కాంగ్రెస్‌లోనే సుదీర్ఘ రాజ‌కీయం నెరిపారు. టీఆర్ఎస్‌పై రాళ్ల‌దాడి చేసి.. ఆ కారు గుర్తు మీద‌నే గెలిచిన ఘ‌నులు. కేసీఆర్‌తో చెడి.. మ‌ళ్లీ కాంగ్రెస్‌లో చేరి.. ప్ర‌స్తుతం రాజ‌కీయ పున‌ర్‌వైభ‌వం కోసం ప్ర‌య‌త్నిస్తున్నారు. అలాంటి పొలిటిక‌ల్‌గా లేచి ప‌డిన కొండా హిస్ట‌రీ.. సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ రామ్‌గోపాల్‌వ‌ర్మ‌ను ఆక‌ర్షించింది. అయితే, ఆయ‌న్ను అంత అట్రాక్ట్ చేసింది వాళ్ల పొలిటిక‌ల్ కెరీర్ మాత్రం కాదు. అంత‌కుమించి న‌డిచిన వాళ్ల ల‌వ్ స్టోరీ. న‌క్స‌ల్స్ తూటాల‌ను త‌న శ‌రీరంలో దింపుకొని.. ఆ న‌క్స‌ల్ అగ్ర‌నేత ఆర్కేతో ముర‌ళి న‌డిపిన డీల్. స‌ర్పంచ్ నుంచి వ‌రంగ‌ల్ జిల్లాను ఏలేంతగా ఎదిగిన కొండా ప్ర‌స్థానం. ఆ హీరో టైప్ రౌడీ పాలిటిక్సే ఆర్జీవీని ఆక‌ర్షించాయి. కొండా టైటిల్‌తో కాక పుట్టించి కేక పెట్టించే సినిమా తీసేశారు. ట్రైల‌ర్‌తో ర‌చ్చ రాజేశారు. ఇంత‌కీ కొండా.. చరిత్ర‌లో ఏముంది?  కొండా ముర‌ళి హీరోనా? విల‌నా? వ‌రంగ‌ల్ ఏమంటోంది..?
చ‌దివింది నాలుగో త‌ర‌గ‌తి. చేసేది వ‌జ్రాల వ్యాపారం. 50 దేశాల‌కు పైగా ఎక్స్‌పోర్ట్స్‌. ఏటా 6వేల కోట్ల ట‌ర్నోవ‌ర్‌. ఎంత సంపాదించామ‌న్న‌ది కాదన్న‌య్యా.. స‌మాజానికి ఎంతోకొంత తిరిగిచ్చేశామ‌న్న‌దే ముఖ్యం అనే మ‌న‌స్త‌త్వం. అందుకే, త‌న కంపెనీలో ప‌ని చేసే ఉద్యోగుల‌కు కార్లు, ఫ్లాట్లు, విల్లాలు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు గిఫ్ట్‌లుగా ఇస్తుంటారు. పేద‌ల‌కు పెళ్లిల్లు, విద్యార్థుల‌కు ఆర్థిక సాయం కూడా చేస్తుంటారు. అందుకే, గుజరాత్‌కు చెందిన సావ్జీ ఢోలాకియాకు ఈఏడాది ప‌ద్మ‌శ్రీ పుర‌ష్కారం వ‌రించింది. 
ప్రజలు... నమ్మి ఓటు వేసి ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. ఏం చేయాలి.. వారి ఆశలకు అనుగుణంగా పనిచేయాలి. అదే ఎమ్మెల్యే పదవితో పాటు మంత్రి పదవి ప్లస్ ఉప ముఖ్యమంత్రి పదవి కూడా వస్తే.. ఏం చేయాలి.. రాష్ట్రానికి ఏం చేసినా.. చేయకపోయినా... కనీసం నియోజకవర్గ ప్రజలకైనా అంతో... ఇంతో... ఎంతో కొంత చేయాలి... చేసి తీరాలి. ఇది కనీస ధర్మం. 
జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌. పూర్తిగా ముస్లిం ఆధిప‌త్యం ఉన్న ప్రాంతం. వాళ్ల‌లో అధిక సంఖ్యాకులు పాక్ అభిమానులే. మ‌న దేశంలో ఉంటూ జై పాకిస్తాన్ అంటూ నిన‌దించే బ్యాచ్‌. అలాంటి శ్రీన‌గ‌ర్‌లో లాల్‌చౌక్ మ‌రింత డేంజ‌ర‌స్‌. దేశ వ్య‌తిరేక నిర‌స‌న‌లు, ధ‌ర్నాల‌కు సెంట‌ర్ పాయింట్‌. అందుకే, అక్క‌డి ప్ర‌ఖ్యాత ఘంటా ఘ‌ర్ (క్లాక్ ట‌వ‌ర్‌)పై ఎప్పుడూ పాకిస్తాన్ జెండానే ఎగురుతూ ఉండేది. స్వాతంత్రం వ‌చ్చి 75 ఏళ్లు అవుతున్నా.. ఇప్ప‌టికీ అక్క‌డ పాక్ అనుకూల డామినేష‌నే. త్రివ‌ర్ణ‌ప‌తాకం ఎగిరిందేలే. 
దేశమంతా 73వ గణతంత్ర దినోత్సవాలను జరుపుకుంది. ప్రజలు ప్రముఖులు స్వాతంత్ర సమర యోధులకు, రాజ్యాంగ నిర్మాతలకు, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమర వీరులకు నివాళులు అర్పించారు. తెలంగాణ రాష్ట్రంలోనూ గణతంత్ర వేడుకలు జరిగాయి.కానీ, ఏదో వెలితి కొట్టొచ్చినట్లు కనిపించింది. 
ఏపీలో కొత్త జిల్లాలు వ‌స్తున్నాయి. అవి వ‌స్తాయో లేదో డౌట్‌గానే ఉన్నా.. ప్ర‌భుత్వ గెజిట్ నోటిఫికేష‌న్ మాత్రం విడుద‌లైపోయింది. ఉన్న‌ట్టుండి ఇప్పుడే కొత్త జిల్లాలు ఎందుకండి? అని అమాయ‌కంగా ప్ర‌శ్నించ‌కండి. పీఆర్సీ తేనెతెట్టును క‌దిలించి.. ఉద్యోగులతో శాప‌నార్థాలు పెట్టించుకుంటున్న జ‌గ‌న‌న్న‌.. ప్ర‌జ‌ల దృష్టిని అటునుంచి మ‌ర‌ల్చ‌డానికే ఈ కొత్త జిల్లాల య‌వ్వారం తెర‌మీద‌కు తీసుకొచ్చార‌ని అంటున్నారు. స‌రే.. తెచ్చిందేదో తెచ్చేశారు.. ఇక‌, ఆ జిల్లాల పేర్ల‌తో జ‌గ‌నన్న జ‌బ‌ర్ద‌స్త్ పొలిటిక‌ల్ గేమ్ ఆడుతున్నారని అంటున్నారు.
టీఆర్ఎస్ పార్టీ ఏర్పడి 20 ఏండ్లు దాటింది. తెలంగాణ రాష్ట్రం సాకార‌మై ఏడేండ్లు గ‌డుస్తోంది. తెలంగాణ‌లో త‌మ‌దే తిరుగులేని పార్టీగా చెప్పుకునే కేసీఆర్‌.. స్వ‌రాష్ట్రం వ‌చ్చాక‌ ఇంత‌వ‌ర‌కూ టీఆర్ఎస్‌ జిల్లా అధ్య‌క్షుల‌ను నియ‌మించింది లేదు. రాష్ట్ర కార్య‌వ‌ర్గ‌మే కానీ.. కాంగ్రెస్‌లో మాదిరి జిల్లాల స్థాయిలో బ‌ల‌మైన వ్య‌వ‌స్థ మాత్రం లేదు. జిల్లా అధ్య‌క్షులు అవ‌స‌ర‌మేలేద‌ని గ‌తంలో ఓ సంద‌ర్భంలో కేసీఆర్ అన్నారు కూడా. అలాంటిది.. ఇప్పుడు స‌డెన్‌గా 33 జిల్లాల‌కు టీఆర్ఎస్ అధ్య‌క్షుల‌ను నియ‌మించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. అదికూడా రిప‌బ్లిక్ డే రోజున‌.. అంత సీక్రెట్‌గా ఆ లిస్ట్ రిలీజ్ చేయాల్సిన అవ‌స‌రం ఏమొచ్చింద‌నేది మ‌రో అనుమానం.
పుష్ప ఫీవ‌ర్ ఇప్పుడు అంద‌రినీ వెంటాడుతోంది. పుష్ప మేన‌రిజం, స్టెప్పులకు అంతా ఫిదా అయిపోయారు. క్రికెట‌ర్ల‌కూ ఆ ఫీవ‌ర్ ప‌ట్టుకుంది. విదేశీ ఆట‌గాళ్లు సైతం పుష్ప‌ను ఫాలో అవుతుండ‌టం ఆస‌క్తిక‌రం. 
దేశ రాజధాని ఢిల్లీలో 73వ గణతంత్ర వేడుకలు ఘ‌నంగా జ‌రిగాయి. దేశ ప్రథమ పౌరుడు, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతీయ ప‌తాకానికి వందనం చేసి వేడుకలు ప్రారంభించారు. విశిష్ట సేవలందించిన వారికి రాష్ట్రపతి పురస్కారాలు ప్రదానం చేశారు. 
కొవాగ్జిన్ తయారీ సంస్థ‌ భారత్ బయోటెక్‌కు సీఎండీ కృష్ణ ఎల్లా, జేఎండీ సుచిత్ర ఎల్లా. ఔషధ రంగంలో విశేష కృషి చేసిన వారిద్దరినీ సంయుక్తంగా పద్మవిభూషణ్ వరించింది. కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ ప్రకటించడంతో వారిద్దరి కృషికి ప్రశంసలు దక్కినట్లయింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.