తిరుపతి తొక్కిసలాట ఘటనకు సంబంధించి చంద్రబాబు నలుగురు అధికారులపై చర్యలు తీసుకున్నారు. తిరుపతి ఎస్పీపై, జాయింట్ కమిషనర్ పై బదలీ వేటు వేశారు. ఇక డీఎస్పీ రమణ కుమార్, గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డిలనును సస్పెండ్ చేశారు. ఈ విషయాన్ని చంద్రబాబు ప్రకటించారు.
తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ కేంద్రం వద్ద బుధవారం (జనవరి 8) రాత్రి తొక్కిసలాట జరిగి ఆరుగురు మరణించిన సంఘటనకు కారణం డీఎస్పీ రమణకుమార్ నిర్లక్ష్యమే కారణమని అధికారులు ఈ రోజు ఉదయమే ముఖ్యమంత్రి చంద్రబాబుకు నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తరువాత తిరుపతి వెళ్లి అధికారులతో సమీక్షించి, క్షతగాత్రులను పరామర్శించిన సందర్భంగా తొక్కిసలాటకు దారి తీసిన పరిస్థితులపై వివరాలను తెలుసుకున్న చంద్రబాబు తిరుపతి ఎస్పీపై బదిలీ వేటు వేశారు. అలాగే నిర్లక్ష్యంగా వ్యవహరించిన డీఎస్పీ రమణబాబు, గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డిలను సస్పెండ్ చేశారు. అలాగే తిరుపతి జాయింట్ కమిషనర్ గౌతమిపై కూడా బదలీ వేటు వేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/tirupati-sp-transfered-and-dsp-suspended-39-191100.html
కాసే చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్నట్లు.. రాష్ట్రం అభివృద్ధికోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు శ్రమించే నాయకులపైనే విమర్శలు, నిందలు ఎక్కువ. ఈ కోవలో టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందు వరుసలో ఉంటారు. రోజుకు పద్దెనిమిది గంటలు ప్రజల కోసం పనిచేస్తూ, రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ స్థాయికి తీసుకెళ్లాలని ఆయన ఎప్పుడూ తపన పడుతుంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటీ రంగానికి పెద్ద పీట వేసి తద్వారా తెలుగు రాష్ట్రాల్లోని యువత ప్రపంచ దేశాల్లో సత్తాచాటేందుకు చంద్రబాబు కారణమయ్యారు.
హైదరాబాద్ శివారు నార్సింగి మున్సిపాలిటీ, ఆంజనేయ స్వామి దేవాలయం ప్రాంగణంలో నిర్లక్ష్యంగా పడి ఉన్న రాష్ట్రకూటుల కాలపు నంది విగ్రహాన్ని కాపాడుకోవాలని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి చెప్పారు.
ఉత్తర భారతం చలికి గజగజలాడుతోంది. తీవ్రమైన చలిగాలులకు తోడు పొగమంచుతో జనం నానా ఇబ్బందులూ పడుతున్నారు. దేశ రాజధాని నగరాన్ని మరో సారి కాలుష్యం కమ్మేసింది. ఢిల్లీలో గాలి నాణ్యత దారుణంగా పడపోయింది.
నటుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. జర్నలిస్ట్‌పై దాడి కేసులో తనను అరెస్ట్ చేయొద్దని, తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన కొన్ని రోజుల కిందట సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
ఫార్ములా ఈ రేస్ కేసులో హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో మాజీ మంత్రి కెటీఆర్ సుప్రీం గడపదొక్కే అవకాశాలున్న సమాచారంతో రాష్ట్ర ప్రభుత్వం కెవియట్ దాఖలు చేసింది. కెటీఆర్ వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు.
సామాన్యుడిగా మొదలై, అసామాన్యునిగా ఎదిగి నిలిచిన శకపురుషుడు నందమూరి తారక రామారావు. ఆ పేరు తలుచుకోగానే ఎవరికైనా చటుక్కున గుర్తుకు వచ్చేది ఆయన జగదేక సుందర రూపం. ఆయన ఒక నవ నవోన్మేష చైతన్య స్వరూపం .
తిరుపతి ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ గా తీసుకున్నారు. ఇప్పటికే ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసిన చంద్రబాబు నేరుగా ఘటనా స్థలికి చేరుకోబోతున్నారు.
అమెరికాలోని లాస్‌ఏంజెలెస్, కాలిఫోర్నియా ప్రాంతాలను కార్చిచ్చు కాల్చేస్తున్నది. దక్షిణ కాలిఫోర్నియాలోని అటవీప్రాంతంలో చెలరేగిన మంటలు లాస్ ఏంజిల్స్ నగరానికి విస్తరించాయి. ఈ దావాలనం నివాస ప్రాంతాలకూ వ్యపించడంతో ఐదుగురు ఆహుతయ్యారు.
టాలీవుడ్ ఒత్తిడికి రేవంత్ సర్కార్ తలొగ్గింది. తాను అధికారంలో ఉన్నంత వరకూ కొత్త సినిమాల విడుదల సందర్భంగా బెనిఫిట్ షోలు, టికెట్ల ధరల పెంపు ప్రశక్తే ఉండదన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెనక్కు తగ్గారు.
ఫార్ములా ఈ రేస్ కేసులో నిందితుడైన ఐఏఎస్ అధికారి గురువారం ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఆర్ బిఐ అనుమతి తీసుకోకుండానే విదేశీ సంస్థకు 55 కోట్ల రూపాయల నిధులు బదిలీచేసినట్టు అరవింద్ కుమార్ పై ఆరోపణలున్నాయి
తెలంగాణ నుంచి తమ బ్రాండ్ బీర్లను ఉపసంహరించుకుంటున్నట్లు యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ ప్రకటించింది. అంటే ఇక నుంచి ఆ కంపెనీ తెలంగాణకు తమ ఉత్పత్తులను సరఫరా చేయదు. యునైటెడ్ బ్రూవరీస్ నుంచి తెలంగాణకు బీర్ల సరఫరా నిలిచిపోనుందన్నమాట.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురువారం (జనవరి 9) మధ్యాహ్నం తిరుపతి వెళ్లనున్నారు.
ఫార్ములా ఈ రేస్ కేసులో తన తప్పేమీ లేదనీ, తాను సుద్దపూసననీ మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు ఎంత గట్టిగా చెబుతున్నా.. వేళ్లన్నీ మాత్రం ఆయనవైపే చూపుతున్నాయి.