ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో ఈ నెల 13 నుంచి మహా కుంభమేళా ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ కుంభమేళాకు తిరుమల నుంచి శ్రీవారి కల్యాణ రథం వెళ్లనుంది. ఈ కల్యాణ రథాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మర్ బీఆర్ నాయుడు బుధవారం (జనవరి 8)ఉదయం జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి కూడా పాల్గొన్నారు. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరగనున్న మహా కుంభమేళాలో సెక్టార్ 6, భజరంగ్ దాస్ రోడ్డులోని నాగ వాసుకి దేవాలయం సమీపంలో యూపీ ప్రభుత్వం కేటాయించిన 2.89 ఎకరాల స్థలంలో శ్రీవారి నమూనా ఆలయం ఏర్పాటు చేస్తున్నారు. 170 మంది సిబ్బందితో నమూనా ఆలయంలో తిరుమల తరహాలో అన్ని కైంకర్యాలు నిర్వహిస్తారు. ఉత్తరాది భక్తులకు స్వామి వారి అర్జిత సేవలను తిలకించే భాగ్యం దీని ద్వారా కలుగుతుంది.
ఈ నమూనా ఆలయంలో నాలుగు సార్లు శ్రీవారి కల్యాణోత్సవాలు నిర్వహించనున్నారు. కుంభమేళా జరుగుతున్న రోజులలో జనవరి 18,26 తేదీలోనూ, ఫిబ్రవరి 3 ,12 తేదీ శ్రీవారి కల్యాణోత్సవం నిర్వహిస్తారు. ప్రపంచం లోనే అతి పెద్ద ఉత్సవమైన కుంభమేళాకు కోట్లాది మంది భక్తులు తరలి వస్తారు. అలా తరలి వచ్చే భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించే ఉద్దేశంతోనే అక్కడ శ్రీవారి నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కుంభమేళా సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన నమూనా ఆలయంలో జరిగే కల్యాణోత్సవాల కోసం శ్రీవారి కళ్యాణ రథం బుధవారం ప్రయాగరాజ్ కు బయలుదేరింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/tirumala-srivari-kalyana-ratham-starts-to-prayagraj-25-190988.html
వైకుంఠ ద్వార సర్వదర్శనం టోకెన్ల జారీ వేళ విషాదం చోటు చేసుకుంది. వైకుంఠద్వార దర్శనం కోసం తిరుపతిలో ఏర్పాటు చేసిన టోకెన్ల జారీ కేంద్రానికి పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ఆరుగురు మరణించారు. పలువురు తీవ్ర అస్వస్తతకు గురై ఆస్పత్రి పాలయ్యారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది.
ప్రధాని మూడోసారి ప్రధానిగా అయ్యాక రెండోసారి ఎపిలో పర్యటిస్తున్నారు. ఆయన విశాఖకు చేరుకోవడం చర్చనీయాంశమైంది. కూటమి నేతలు ఘన స్వాగతం పలికారు. సిరిపురం చౌరస్తానుంచి ఏయు ఇంజినీరింగ్ కాలేజివరకు ర్యాలీ నిర్వహించారు
ఫార్ములా-ఈ కార్ కేసులో ఏసీబీ విచారణకు తన వెంట న్యాయవాదిని అనుమతించాలని కోరుతూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన కేటీఆర్ కు ఒకే సమయంలో మోదం; ఖేదం కలిగేలా కోర్టు తీర్పు వెలువరించింది.
ఇప్పటికే ఫార్ములా ఈ రేసు కేసులో చిక్కులు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావుపై మరో ఫిర్యాదు నమోదైంది. ఈ ఫిర్యాదు ఔటర్ రింగు రోడ్డు టెంటర్లలో అవినీతికి సంబంధించింది.
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుకు హైకోర్టులో మళ్లీ చుక్కెదురైంది. ఏసీబీ విచారణకు తన వెంట న్యాయవాదిని అనుమతించాలని కోరుతూ కేటీఆర్ దాఖలు చేసుకున్న లంచ్ మోషన్ పిటిషన్ ను విచారించిన హైకోర్టు అందుకు నో చెప్పింది.
ఫార్ములా ఈ రేస్ కేసులో ఎసిబి విచారణకు కెటీఆర్ న్యాయవ్యాదులను అనుమతించకపోవడంపై బుధవారం హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. న్యాయవాదులను అనుమతించకపోవడానికి కారణమేమిటని హైకోర్టు ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది
ఎన్నికల వ్యూహకర్త, జనసూరజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రశాంత్ కిశోర్ మరోసారి ఆస్పత్రి పాలయ్యారు. విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా ఆయన ఇటీవల ఆమరణ నిరాహార దీక్ష చచే పట్టారు. పోలీసులు ఆ దీక్షను భగ్నం చేశారు. అయితే ఆ దీక్ష కారణంగా ఆయన అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరారు.
మావోయిస్టుల నుంచి ముప్పు ఉందన్న సమాచారం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడికి భద్రత పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే జడ్ ప్లస్ క్యాటగరి భద్రత ఉన్న చంద్రబాబు సెక్యూరిటీలోకి కొత్తగా కౌంటర్ యాక్షన్ బృందాలు వచ్చి చేరాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంక్రాంతి కానుక ఉన్నట్లా లేనట్టా అన్న చర్చ జరుగుతోంది. ఈ సారి సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు రెండు డీఏలను ప్రకటించే అవకాశం ఉందని విస్తృతంగా ప్రచారం జరిగింది.
గత వారం రోజులుగా మీడియాలో వస్తున్న ప్రచారంపై ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు టీం ఖండించింది. . ఈ ప్రచారంపై కుట్ర కోణం ఉందని ఆరోపించింది.
తెలుగురాష్ట్రాలను చలి పులి చంపేస్తోంది. రెండు రాష్ట్రాలలోనూ కూడా తీవ్రమైన చలిగాలులు వీస్తుండటంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారు. ఉదయం పది గంటల వరకూ కూడా బయటకు రావడానికి జంకుతున్న పరిస్థితి.
మొదటి వారం చివరి రోజున జెపిసి నివేదికను లోకసభ సమర్పించాల్సి ఉంటుంది. పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్బంగా సవరణ బిల్లు ను కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘ్ వాల్ కేంద్ర పాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లును ప్రవేశ పెట్టారు.
బీఆర్ఎస్ పార్టీ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఆ పార్టీకి చెందిన నేతలు ఒకరి తరువాత ఒకరు జైలుకెడుతున్నారు. త్వరలో కేటీఆర్ కూడా జైలుకెళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో పార్టీ భవిష్యత్ పై నీలినీడలు కమ్ముకుంటున్నాయి.