తిరుమలలో భక్తుల కిటకిట..సర్వదర్శనానికి 22 గంటలు..!

Publish Date:Aug 15, 2026

Advertisement

 

నవంబర్ శ్రీవారి ఆర్జిత సేవల ఆన్‌లైన్ కోటా విడుదల..!

వరుస సెలవులు రావడంతో తిరుమలగిరులు భక్తుల జనసందోహంతో కిటకిటలాడుతున్నాయి. కలియుగ వైకుంఠనాథుడైన శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనార్థం వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు పోటెత్తారు.వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోవడమే కాకుండా, క్యూలైన్లు బయటి వరకు విస్తరించాయి. టైమ్ స్లాట్ టోకెన్లు లేని సాధారణ భక్తులకు సర్వదర్శనం లభించడానికి ప్రస్తుతం సుమారు 22 గంటల సమయం పడుతోంది. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు నిరంతరం తాగునీరు, పాలు, అన్నప్రసాదాలను పంపిణీ చేస్తున్నారు.

నిన్న ఒక్కరోజే 90 వేల మంది దర్శనం..!

శనివారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 90,293 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అందులో 53,090 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. నిన్న ఒక్కరోజే స్వామివారి హుండీ ద్వారా రూ. 3.81 కోట్ల ఆదాయం సమకూరినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. రద్దీ తీవ్రంగా ఉన్నందున దర్శన సమయం మరికొంత పెరిగే అవకాశం ఉందని, వృద్ధులు, చిన్నపిల్లలతో వచ్చే భక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

నవంబర్ నెలకు సంబంధించిన వివిధ ఆర్జిత సేవలు, దర్శన టికెట్లతో పాటు అద్దె గదుల కోటా విడుదలకు ముహూర్తం ఖరారు చేసింది. ఈ క్రమంలోనే ప్రధాన ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన టికెట్లకు సంబంధించి లక్కీ డిప్ కోటాను ఈ నెల 18వ తేదీన ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నారు. 

ఈ సేవలను పొందగోరే భక్తులు ఈ నెల 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు తమ పేర్లను ఎలక్ట్రానిక్ డిప్ కోసం నమోదు చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. లక్కీ డిప్‌లో టికెట్లు పొందిన వారు 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నంలోగా నిర్ణీత రుసుము చెల్లించి దర్శన టికెట్లను ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది.

ఇక వర్చువల్ సేవలతో పాటు ప్రత్యక్షంగా పాల్గొనే ఇతర ఆర్జిత సేవల కోటా ఈ నెల 21వ తేదీన విడతల వారీగా అందుబాటులోకి రానుంది. ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ మరియు పవిత్రోత్సవాల టికెట్లు విడుదలవుతాయి. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు మరియు వాటికి సంబంధించిన దర్శన స్లాట్లను విడుదల చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు.భక్తులు ఎలాంటి దళారులను నమ్మకుండా కేవలం TTD Official Website ద్వారా మాత్రమే తమ టికెట్లను బుక్ చేసుకోవాలని దేవస్థానం యాజమాన్యం విజ్ఞప్తి చేస్తోంది.

Tirumala Heavy Rush, Tirumala Sarva Darshan Time, Srivari Hundi Income, TTD Updates, Tirupati News in Telugu

By
en-us Political News

  
తిరుమల పవిత్రతపై విమర్శలు..!
అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో బంగ్లాదేశ్ జాతీయ జట్టు ఊహించని సంచలనం సృష్టించింది.
బాలీవుడ్ స్టార్ హీరోలు షారూఖ్ ఖాన్, అజయ్ దేవగణ్, టైగర్ ష్రాఫ్‌లకు ఊహించని చట్టపరమైన చిక్కులు ఎదురయ్యాయి.
పశ్చిమ బెంగాల్‌ రాజకీయాల్లో ఒక్కసారిగా పెను సంచలనం నమోదైంది.
కాంగ్రెస్ ఎమ్మెల్యే, జడ్చర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి.. మంత్రి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అది ఓ ఆలయం.. అమ్మ వారి సన్నిధి. భక్తులు వచ్చి వెళ్లే పవిత్రమైన ప్రదేశం.
రాష్ట్రంలో ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ను దేశానికే తలమానికంగా తీర్చిదిద్దేందుకు మంత్రి నారా లోకేష్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు
వికసిత్ భారత్ సంకల్పంలో ఏపీ భాగస్వామ్యం..!
ఖమ్మం నగరంలో అత్యంత నివ్వెరపరిచే విషాద ఘటన చోటుచేసుకుంది.
విజయవాడలో జాతీయ జెండాను ఆవిష్కరించిన లోకేశ్..!
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్మార్ట్ కార్డులు, రేషన్ బియ్యం పంపిణీపై కీలక వ్యాఖ్యలు చేశారు.
అమరావతిలోని రాయపూడి పరేడ్ గ్రౌండ్స్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి
లంచం తీసుకునేందుకు దళారిని రంగంలోకి దింపిన రైల్వే ఉన్నతా ధికారిని సీబీఐ రెడ్‌హ్యాం డెడ్‌గా పట్టుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.