సెప్టెంబర్ 24 నుంచి తిరుమల బ్రహ్మోత్సవాలు

Publish Date:Sep 16, 2025

Advertisement

 

 

మత మార్పిడుల నివారణకు దళిత వాడల్లో 1,000 ఆలయాలు నిర్మిస్తామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు హెచ్చరించారు. ఇవాళ టీటీడీ పాలక మండలి సమావేశమైంది. ఈ సమావేశం ముగిసిన అనంతరం  టీటీడీ చైర్మన్  చైర్మన్  మాట్లాడుతూ..తిరుమల దేవస్థానంపై తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వారిపై క్రిమినల్ కేసులు పెడతామని పేర్కొన్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పాలక మండలి సమావేశంలో తీర్మానం చేశామన్నారు.

బ్రహ్మోత్సవాల వేళ.. వాహన సేవను తిలకించెందుకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ పాలక మండలి నియమించిన తర్వాత జరుగుతున్న మొదటి బ్రహ్మోత్సవమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది ఈ బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని ప్రకటించారు.  

సెప్టెంబర్ 24వ తేదీ సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు స్వామి  వారికీ పట్టు వస్త్రాలు సమర్పిస్తారన్నారు. అదే రోజు.. 2026 క్యాలెండరు, డైరీలను సీఎం ఆవిష్కరిస్తారని ఆయన తెలిపారు. ఇక సెప్టెంబర్ 25వ తేదీ ఉదయం యాత్రి సముదాయాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని తెలిపారు. 

బ్రహ్మోత్సవాలు జరిగే 10 రోజులు..వీఐపీ సిపార్సు లేఖలను అనుమతించబోమన్నారు. ఆ రోజుల్లో ఈ లేఖలను రద్దు చేశామని చెప్పారు.  శ్రీవాణి ట్రస్టు నిధులతో కర్ణాటకలో 7ఎకరాల్లో శ్రీవారి ఆలయ నిర్మాణం చేపడుతున్నట్లు వివరించారు. అనంతవరంలోని స్వామి వారి ఆలయంలో రూ. 7.2 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. 

సీఎం చంద్రబాబు ఆదేశాలు మేరకు దళిత వాడల్లో రూ.10 నుంచి రూ. 20 లక్షల నిధులతో 1000 ఆలయాలు నిర్మాణానికి ఆమోదం తెలిపినట్లు బీఆర్ నాయడు తెలిపారు. తిరుమల  బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24 నుంచి ఆక్టోబర్ 2 వరకు జరగనున్నట్లు ఆయన పేర్కొన్నారు. 

ఈ కార్యక్రమం కోసం 8 లక్షల లడ్డూలు తయారు చేసి అందుబాటులో ఉంచనున్నామని వివరించారు. భక్తుల భద్రత కోసం 4500 మంది పోలీసులు, 3500 మంది వాలంటీర్లు సేవలు అందిస్తామని చెప్పారు. భక్తుల రద్దీని పర్యవేక్షించడానికి ఇస్రో సాంకేతిక సహాయం తీసుకోనున్నగట్లు వెల్లడించారు.
 

By
en-us Political News

  
హైదరాబాద్‌లోని సరూర్ నగర్ సాగరిక ఇంటెగ్రేటెడ్ హైస్కూల్‌లో రాఖీలు, తిలకం తొలగింపు వివాదంపై బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి టీచర్‌ను హిజాబ్‌‌పై ప్రశ్నించడం సంచలనంగా మారింది. పోలీసులు కార్పొరేటర్‌పై సుమోటో కేసు నమోదు చేశారు.
హైదరాబాద్‌లోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో కన్న కూతురిపై లైంగిక దాడికి యత్నించిన భర్త శ్రీనివాస్‌ను భార్య రమాదేవి గొడ్డలితో నరికి చంపింది. అల్వాల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జమ్మూ కాశ్మీర్‌లోని కథువా జిల్లా సీఐఎస్ఎఫ్ క్యాంపులో హెడ్ కానిస్టేబుల్ ఏకే 47 రైఫిల్‌తో చేసిన విచక్షణారహిత కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతి చెందారు. సేవా పవర్ ప్రాజెక్ట్ వద్ద జరిగిన ఈ దారుణ ఘటనపై సీఐఎస్ఎఫ్ డీజీ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు.
ఒడిశా తాల్చేర్ ప్రాంతంలో సంచలనం సృష్టించిన దారుణ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
హైదరాబాద్ మాధాపూర్‌లో స్పా సెంటర్ ముసుగులో నడుస్తున్న అక్రమ వ్యభిచార రాకెట్‌ను ఎస్‌ఓటీ పోలీసులు మట్టుబెట్టారు. నలుగురు యువతులను రక్షించి, రూ. 45 వేల నగదు, 8 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
యాదాద్రి భువనగిరి జిల్లా చల్లూరులో భూభారతి వెబ్‌సైట్ ద్వారా ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండానే 7.18 ఎకరాల భూమి వేరొకరి పేరు మీదకు మారిపోయింది. యజమానులకు తెలియకుండా జరిగిన ఈ భారీ భూ భాగోతం పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఏపీ సచివాలయ ఉద్యోగాలు, డీఎస్సీ నియామకాలు మరియు మెడికల్ సీట్లలో నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్ల అక్రమాలపై విచారణ ముమ్మరమైంది. హైకోర్టు ఆదేశాలు, విజిలెన్స్ తనిఖీలు మరియు సాప్ చేపట్టిన స్కిల్ టెస్ట్ వివరాలు ఇక్కడ చూడండి.
150 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న వందేమాతరం గేయానికి జాతీయ గీతంతో సమాన హోదా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ తెచ్చింది. 3 నిమిషాల 10 సెకన్ల ఆలాపన, సుప్రీంకోర్టు విచారణ మరియు చట్టపరమైన నిబంధనల పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
హైదరాబాద్ రాయదుర్గంలో ఐటీ కంపెనీ మహిళా ఉద్యోగిపై ఫుడ్ వెండర్ షేక్ నబీ కూల్ డ్రింక్‌లో మత్తుమందు కలిపి లైంగిక దాడి చేశాడు. ప్రైవేట్ వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేస్తూ రూ. 43 లక్షలు నొక్కేసి మూడేళ్లు వేధించిన నిందితుడిని రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు.
విజయవాడ ఎన్‌టీపీఎస్ కాలువలో లభించిన మహిళ శరీర భాగాల మిస్టరీ వీడింది. చేతిపై ఉన్న ఈక టాటూ ఆధారంగా మృతురాలిని మంగళగిరికి చెందిన 29 ఏళ్ల కళ్యాణిగా గుర్తించిన పోలీసులు, విచారణలో మటన్ షాప్ షఫీ చేసిన కిరాతక హత్యను ఛేదించారు.
కన్యాకుమారి యూట్యూబర్ ఇంట్లో ఏకంగా 118 సవర్ల (944 గ్రాములు) బంగారం, భారీగా నగదు చోరీకి గురయ్యాయి. సోషల్ మీడియాలో రీల్స్ కోసం చూపించిన సంపదే దొంగలను ఆకర్షించిందా అనే కోణంలో పోలీసుల దర్యాప్తు సాగుతోంది.
కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని నింబోలి అడ్డాలో చిన్నారి బాలుడిపై దాడికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మరియు పోలీసుల చర్యల కథనం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.